Special trains: హైదరాబాద్, సికింద్రాబాద్‌లకు రెండు ప్రత్యేక రైళ్ళు
ABN, First Publish Date - 2023-03-30T12:45:36+05:30
వేసవి రద్దీని తట్టుకునే దిశలో నైరుతి రైల్వే బెంగళూరులోని యలహంక(Yalahanka) మీదుగా తెలంగాణలోని హైదరా బాద్,
బెంగళూరు, (ఆంధ్రజ్యోతి): వేసవి రద్దీని తట్టుకునే దిశలో నైరుతి రైల్వే బెంగళూరులోని యలహంక(Yalahanka) మీదుగా తెలంగాణలోని హైదరా బాద్, సికింద్రాబాద్‌లకు రెండు ప్రత్యేక రైళ్ళను నడపుతోంది. 07234 అరసికెరె - సికింద్రాబాద్ స్పెషల్ వీక్లీ ఎక్స్‌ప్రెస్ రైలు సంచారం ఈ నెల 31న ప్రారంభమై జూన్ 30 వరకు కొనసాగనుంది. ఈ రైలు అరసికెరెలో మధ్యా హ్నం 2గంటలకు బయల్దేరుతుంది. సికింద్రాబాద్‌కు మరుసటి రోజు ఉదయం 7.35కు చేరుకుంటుంది. అరసికెరెలో బయల్దేరే ఈ రైలు తుమకూరు, చిక్కబాణావర, యలహంక, హిందూపురం, ధర్మవరం, అనంతపురం, గుంతకల్, రాయచూరు గద్వాల్, వనపర్తి రోడ్, మహబూబ్‌నగర్, జడ్చర్ల, షాద్‌నగర్(Mahbubnagar, Jadcharla, Shadnagar), ఉందానగర్, కాచిగూడల మీదుగా సికింద్రాబాద్‌కు చేరుకోనుంది. వారానికి ఒక రోజు అంటే ప్రతి శుక్రవారం సంచరించే ఈ రైలుకు 24 కోచ్‌లు ఉంటాయని రైల్వే ప్రకటన పేర్కొంది. కాగా 07266 రైలు అరసికెరె - హైదరాబాద్‌ల మధ్య సంచరించనుంది. ఈ రైలు ప్రతి బుధవారం మధ్యా హ్నం 2 గంటలకు బయల్దేరి హైదరాబాదుకు మరుసటి రోజు ఉదయం 8-30 గంటలకు చేరుకోనుంది. ఈ రైలు సంచారం ఏప్రిల్ 5న ప్రారంభమై జూన్ 28 వరకు కొనసాగనుంది. ఈ రైలు కర్నూలు, డోన్(Kurnool, Don) స్టేషన్లలోనూ ఆగుతుందని రైలుకు 21 కోచ్‌లు ఉంటాయని ప్రకటన పేర్కొంది. యలహంక మీదుగా ఈ రెండు ప్రత్యేక రైళ్ళు సంచరించనుండటంతో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల ప్రయాణీకులకు వెసలుబాటు లభించనుంది. ఈ రెండు ప్రత్యేక రైళ్ళలోనూ చార్జీ సాధారణం కంటే కాస్త అధికంగా ఉంటుందని బుధవారం విడుదలైన ప్రకటనలో పేర్కొన్నారు.
Updated Date - 2023-03-30T12:45:36+05:30 IST