Strike: 28న ప్రభుత్వ ఉద్యోగుల సమ్మె
ABN, First Publish Date - 2023-02-28T11:21:26+05:30
డీఎంకే ఎన్నికల హామీలో పేర్కొన్న ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయుల(Government employees and teachers) హామీలు నెరవేర్చకపోవడాన్ని ఖండిస్తూ
ఐసిఎఫ్(చెన్నై): డీఎంకే ఎన్నికల హామీలో పేర్కొన్న ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయుల(Government employees and teachers) హామీలు నెరవేర్చకపోవడాన్ని ఖండిస్తూ మార్చి 28వ తేది సమ్మె చేపట్టనున్నట్లు ఆ సంఘం ప్రధాన కార్యదర్శి సెల్వం ఒక ప్రకటనలో తెలిపారు. డీఎంకే అధికారంలోకి వస్తే పాత పింఛన్ విధానం అమలు చేస్తుందని, సరెండర్, డీఏ బకాయిలు అందిస్తామని హామీ ఇచ్చింది. అయితే ఇప్పటివరకు ఒక్క హామీ కూడా నెరవేర్చలేదని ఆరోపించారు. పౌష్టికాహార, అంగన్వాడీ, గ్రామ సహాయకులు, వైద్య ఎంపిక బోర్డు ఎంపిక చేసిన నర్సులు అని మొత్తం 3.5 లక్షల మంది ఉద్యోగుల వెట్టిచాకిరి విధానాన్ని మార్చి సక్రమంగా వేతనాలు, ఖాళీ పోస్టుల భర్తీ వంటి డిమాండ్లు నెరవేర్చాలని కోరుతూ సమ్మె చేపట్టడంతో పాటు సచివాలయాన్ని ముట్టడిస్తామని తెలిపారు.
Updated Date - 2023-02-28T11:21:26+05:30 IST