ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

విషాదం: నీట్ పరీక్షలో ర్యాంకు రాలేదని విద్యార్థి ఆత్మహత్య.. మరుసటి రోజే తండ్రి కూడా ఆత్మహత్య

ABN, First Publish Date - 2023-08-14T15:26:01+05:30

నీట్ మెడికల్ ప్రవేశ పరీక్షలో ఉత్తీర్ణత సాధించలేకపోయాననే మనస్తాపంతో 19 ఏళ్ల విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు. కొడుకు మరణాన్ని తట్టుకోలేక అతని తండ్రి కూడా మరుసటి రోజే ఆత్మహత్య చేసుకున్నాడు.

నీట్ మెడికల్ ప్రవేశ పరీక్షలో(NEET medical entrance exam) ఉత్తీర్ణత సాధించలేకపోయాననే మనస్తాపంతో 19 ఏళ్ల విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు. కొడుకు మరణాన్ని తట్టుకోలేక అతని తండ్రి కూడా మరుసటి రోజే ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ విషాదకర ఘటన తమిళనాడు రాష్ట్ర రాజధాని చెన్నైలో చోటుచేసుకుంది. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. జగదీశ్వరన్ అనే విద్యార్థి 2022లో 12వ తరగతి పూర్తి చేసుకున్నాడు. 427 మార్కులతో ఉత్తీర్ణుడయ్యాడు. అయితే డాక్టర్ కావాలనే కోరికతో వైద్య విద్య చదవాలని భావించాడు. దీంతో మెడికల్ సీటు కోసం నీట్ పరీక్ష రాశాడు. అందుకు కోచింగ్ కూడా తీసుకున్నాడు. కానీ ఉత్తీర్ణత సాధించలేకపోయాడు. మరోసారి ప్రయత్నించాడు. కానీ మళ్లీ నీట్ పరీక్షలో ర్యాంకు రాలేదు. దీంతో తీవ్ర మనస్తాపానికి గురైన జగదీశ్వరన్(Jagadeeswaran) శనివారం ఆత్మహత్య చేసుకున్నాడు. విద్యార్థి తండ్రి సెల్వశేఖర్ ఫోన్ చేసిన స్పందించకపోవడంతో ఇంటికెళ్లి చూస్తే శవమై కనిపించాడు. దీంతో కొడుకు మృతి చెందాడనే బాధను సెల్వశేఖర్(Selvasekar) తట్టుకోలేకపోయాడు. ఆ మరుసటి రోజే ఇంట్లో ఉరివేసుకుని చనిపోయాడు. ఈ ఘటన తమిళనాడు వ్యాప్తంగా తీవ్ర విషాదాన్ని నింపింది.


దీంతో ఈ విషాదకర ఘటనపై తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ కూడా స్పందించారు. తండ్రి కొడుకుల మృతి పట్ల సంతాపం వ్యక్తం చేశారు. విద్యార్థులు ఇలాంటి ఘటనలకు పాల్పడవద్దని, ఆత్మవిశ్వాసంతో జీవించాలని సూచించారు. అలాగే ఈ సందర్భంగా ఆయన పలు కీలక వ్యాఖ్యలు చేశారు. కొన్ని నెలల్లో రాజకీయంగా మార్పులు వస్తే.. నీట్ అడ్డంకులు తొలగిపోతాయంటూ చెప్పుకొచ్చారు. అప్పుడు నేను ‘సంతకం చేయను’ అనే వారుండరని రాష్ట్ర గవర్నర్‌ను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. జగదీశ్వరన్ కుటుంబాన్ని ఎలా ఓదార్చాలో తనకు అర్థం కావడం లేదని స్టాలిన్ అన్నారు. నీట్ బలిపీఠంపై ప్రాణాలు కోల్పోయిన వారిలో జగదీశ్వరన్ కూడా చేరాడని, ఇది అత్యంత దారుణమైన ఘటన అని సీఎం స్టాలిన్ తెలిపారు. కాగా నీట్ పరీక్షను తమిళనాడు ప్రభుత్వం మొదటి నుంచి వ్యతిరేకిస్తున్న సంగతి తెలిసిందే.

Updated Date - 2023-08-14T15:29:28+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising