Manish Sisodia: సుప్రీంకోర్టులో మనీష్ సిసోడియాకు చుక్కెదురు
ABN, First Publish Date - 2023-10-30T11:27:05+05:30
ఢిల్లీ మాజీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియాకు సుప్రీం కోర్టులో చుక్కుదురైంది. మనీష్ సిసోడియాకు బెయిల్ ఇచ్చేందుకు సుప్రీం నిరాకరించింది.
ఢిల్లీ: ఢిల్లీ మాజీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియాకు సుప్రీం కోర్టులో చుక్కుదురైంది. మనీష్ సిసోడియాకు బెయిల్ ఇచ్చేందుకు సుప్రీం నిరాకరించింది. బెయిల్ కోసం ఆయన వేసిన పిటిషన్‌లను న్యాయస్థానం కొట్టేసింది. ఈ మేరకు జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ ఎస్వీ ఎన్ భట్టితో కూడిన రాజ్యాంగ ధర్మాసనం తీర్పు వెలువరించింది. గతంలో బెయిల్ కోసం సిసోడియా వేసిన రెండు వేర్వేరు పిటిషన్‌లపై సుప్రీం కోర్టు అక్టోంబర్ 17న తీర్పును రిజర్వ్ చేసింది. తాజాగా బెయిల్ నిరాకరిస్తూ తీర్పు ఇచ్చింది. లిక్కర్ స్కాం కేసులో నగదు లావాదేవీలు జరిగినట్లుగా ఈడీ ఆధారాలు చూపించండంతో అత్యున్నత న్యాయస్థానం ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. రూ.338 కోట్ల నగదు బదిలీకి సంబంధించిన అంశాన్ని ఈడీ సుప్రీం ముందు ఉంచింది. ఇక ఈ లిక్కర్ స్కాం కేసులో విచారణను పూర్తి చేసేందుకు ఈడీకి సుప్రీంకోర్టు 6 నుంచి 8 నెలల సమయం ఇచ్చింది. విచారణ నెమ్మదిగా సాగితే మూడు నెలల లోపు సిసోడియా మళ్లీ బెయిల్ కోసం దరఖాస్తు చేసుకునేందుకు అర్హత పొందుతారని సుప్రీం పేర్కొంది. కాగా కొన్ని నెలల క్రితం ఢిల్లీ మద్యం పాలసీ కుంభకోణానికి సంబంధించిన అవినీతి, మనీలాండరింగ్ కేసుల్లో ఢిల్లీ ఉప ముఖ్యమంత్రిగా ఉన్న ఆమ్ ఆద్మీ పార్టీ నేత మనీష్ సిసోడియాను ఈడీ అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే.
Updated Date - 2023-10-30T11:37:24+05:30 IST