The Kerala Story : ‘ది కేరళ స్టోరీ’పై సుప్రీంకోర్టులో పిటిషనర్లకు దక్కని ఉపశమనం
ABN, First Publish Date - 2023-05-03T13:43:28+05:30
‘ది కేరళ స్టోరీ’ (The Kerala Story) సినిమాలో ఓ ప్రకటనను జారీ చేసేలా ఆదేశించాలని కోరిన పిటిషనర్లకు సుప్రీంకోర్టులో
న్యూఢిల్లీ : ‘ది కేరళ స్టోరీ’ (The Kerala Story) సినిమాలో ఓ ప్రకటనను జారీ చేసేలా ఆదేశించాలని కోరిన పిటిషనర్లకు సుప్రీంకోర్టులో ఉపశమనం దక్కలేదు. ‘ఇది యథార్థ కథ కాదు, కేవలం కల్పిత కథ’ అని ప్రకటనను ప్రదర్శించాలని పిటిషనర్ కోరారు. దీనిపై కేరళ హైకోర్టును ఆశ్రయించాలని పిటిషనర్‌కు సర్వోన్నత న్యాయస్థానం బుధవారం సూచించింది.
అన్ని కేసులను తానే విచారించడం సాధ్యం కాదని సుప్రీంకోర్టు తెలిపింది. పిటిషనర్లు హైకోర్టును ఆశ్రయించాలని, అవసరమైన ఉపశమనాన్ని కోరాలని తెలిపింది. ఈ విషయంపై సాధ్యమైనంత త్వరగా విచారణ జరిపే అంశాన్ని హైకోర్టు పరిశీలిస్తుందని చెప్పింది.
‘ది కేరళ స్టోరీ’ టీజర్ విడుదలైన తర్వాత పెద్ద ఎత్తున వివాదం జరుగుతోంది. ఈ కథలోని ఓ పాత్ర మాట్లాడుతూ, కేరళలో ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాద సంస్థ 32 వేల మంది మహిళలను రిక్రూట్ చేసుకుందని, తాను వారిలో ఒకరినని చెప్పడం వివాదాస్పదమైంది. ఈ సినిమాపై నిషేధం విధించాలని కేరళ అధికార, ప్రతిపక్షాలు కోరుతున్నాయి. హిందీ సినిమా తమ రాష్ట్రంలో విడుదల కాకూడదని సీపీఎం, కాంగ్రెస్ చెప్తున్నాయి. దీనిపై ఈ సినిమా ఎగ్జిబిటర్లు స్పందిస్తూ, ప్రేక్షకులు ఓటీటీలో చూసే అవకాశం ఉందని, అందువల్ల థియేటర్లలోనే ప్రదర్శించడం ఉత్తమమని చెప్తున్నారు. ఈ సినిమా శుక్రవారం విడుదల కాబోతోంది.
ఇవి కూడా చదవండి :
MeToo Protest : కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్‌పై ఒలింపియన్ వినేష్ ఫోగట్ ఆరోపణలు
Karnataka Polls : కర్ణాటకలో చెట్లకు కరెన్సీ కట్టల పంట.. ఆశ్చర్యపోతున్న ఐటీ అధికారులు..
Updated Date - 2023-05-03T13:43:28+05:30 IST