Supreme Court : సుప్రీంకోర్టులో ఉద్ధవ్ ఠాక్రే పిటిషన్ విచారణ రేపు
ABN, First Publish Date - 2023-02-21T12:14:26+05:30
మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే దాఖలు చేసిన పిటిషన్ పై సుప్రీంకోర్టు విచారించనుంది....
న్యూఢిల్లీ : మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే దాఖలు చేసిన పిటిషన్ పై సుప్రీంకోర్టు విచారించనుంది.(Supreme Court) శివసేన పేరు, చిహ్నంపై ఎన్నికల కమిషన్ ఇచ్చిన ఆదేశాలపై ఉద్ధవ్ ఠాక్రే దాఖలు చేసిన పిటిషన్‌ను(Uddhav Thackerays plea) బుధవారం (రేపు) సుప్రీంకోర్టు విచారించనుంది.మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండే నేతృత్వంలోని వర్గానికి శివసేన పార్టీ పేరు, గుర్తును కేటాయించాలన్న ఎన్నికల కమిషన్ (ఈసీ) ఆదేశాలను(Against ECs order) సవాలు చేస్తూ ఉద్ధవ్ ఠాక్రే దాఖలు చేసిన పిటిషన్‌ను సుప్రీంకోర్టు విచారణకు స్వీకరించింది.
ఇది కూడా చదవండి : Cricketer Prithvi Shaw: క్రికెటర్ పృథ్వీ షాపై సప్నాగిల్ కేసు
ఈ పిటిషన్‌పై బుధవారం మధ్యాహ్నం 3.30 గంటలకు విచారణ జరగనుంది.ఉద్ధవ్ వర్గం తన పిటిషన్‌లో మధ్యంతర ఉపశమనంగా ఈసీ ఆర్డర్‌పై స్టే విధించాలని కోరింది. తటస్థ మధ్యవర్తిగా తన బాధ్యతను నిర్వర్తించడంలో ఎన్నికల సంఘం విఫలమైందని శివసేన (యూబీటీ) ఆరోపించింది. రాజ్యాంగ హోదాను దెబ్బతీసే విధంగా ఈసీ వ్యవహరించిందని కూడా ఉధ్ధవ్ ఆరోపించారు.ఎన్నికల సంఘం గత వారం ఏకనాథ్ షిండే నేతృత్వంలోని బృందానికి శివపార్టీ పేరును, ఎన్నికల గుర్తు ‘విల్లు బాణం’ను కేటాయించింది.
Updated Date - 2023-02-21T12:14:29+05:30 IST