ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Same-sex marriage: స్వలింగ సంపర్క వివాహాలపై సుప్రీం కోర్టు సంచలన తీర్పు.. అసలు ఏం చెప్పిందంటే..?

ABN, First Publish Date - 2023-10-17T12:15:24+05:30

స్వలింగ సంపర్కుల వివాహాలపై సుప్రీం కోర్టు సంచలన తీర్పు వెలువరించింది. నలుగురు సభ్యులతో కూడిన న్యాయమూర్తుల రాజ్యాంగ ధర్మాసనం ఈ అంశంపై భిన్నమైన అభిప్రాయాలను వ్యక్తం చేసింది.

స్వలింగ సంపర్కుల వివాహాలపై సుప్రీం కోర్టు సంచలన తీర్పు వెలువరించింది. ఐదుగురు సభ్యులతో కూడిన న్యాయమూర్తుల రాజ్యాంగ ధర్మాసనం ఈ అంశంపై భిన్నమైన అభిప్రాయాలను వ్యక్తం చేసింది. నాలుగు వేర్వేరు తీర్పులను ఇచ్చింది. ప్రధాన న్యాయమూర్తి డీవై చంద్రచూడ్ స్వలింగ సంపర్కుల వివాహాలకు అనుకూలంగా తీర్పు వెలువరించారు. తీర్పును చదువుతూ, ఈ కేసు విషయంలో మనం ఎంత దూరం వెళ్లాలి అనే విషయంలో కొంత అంగీకారం, భిన్నాభిప్రాయాలు ఉన్నాయని అన్నారు. మొత్తం నాలుగు తీర్పులు ఉన్నాయని ప్రధాన న్యాయమూర్తి తెలిపారు. ఒకటి తనది కాగా మిగిలినవి మిగతా న్యాయమూర్తులవి సంజయ్ కిషన్ కౌల్, ఎస్ రవీంద్ర భట్, పిఎస్ నరసింహ తీర్పులున్నాయని పేర్కొన్నారు. పౌరుల హక్కులను కాపాడాలని రాజ్యాంగం స్పష్టం చేస్తోందని, స్వలింగ సంపర్కులకు కూడా హక్కులుంటాయని ఆయన తీర్పులో పేర్కొన్నారు. హోమో సెక్సువాలిటీ నగరాలు, ఉన్నత వర్గాలకు మాత్రమే సంబంధించినది కాదని స్పష్టం చేశారు. కాగా స్వలింగ వివాహాలను చట్టబద్ధం చేయాలనే ఆలోచన "అర్బన్ ఎలైట్" సమస్య అని విచారణ సందర్భంగా కేంద్ర ప్రభుత్వం వాదించింది.


వివాహం ఒక స్థిరమైన, మార్పులేని విషయమని పేర్కొనడం సరికాదని అన్నారు. శాసనసభ చట్టాల ద్వారా వివాహంలో సంస్కరణలు తీసుకొచ్చామని ఆయన తెలిపారు. ప్రాథమిక హక్కుల పరిరక్షణ కోసం సుప్రీం కోర్టు ఇచ్చే ఆదేశాలు అధికారాల విభజనకు అడ్డంకి కాదని ఆయన చెప్పారు. ఈ అంశంపై సుప్రీంకోర్టు చట్టం చేయలేదని తెలిపారు. ఈ కేసుపై పార్లమెంటే నిర్ణయం తీసుకోవాలని అన్నారు. అయితే అది న్యాయ సమీక్షకు లోబడి ఉండాలని పేర్కొన్నారు. అలాగే ప్రత్యేక వివాహ చట్టంలో మార్పులు చేయాలా వద్దా అనేది పార్లమెంటు నిర్ణయిస్తుందని ఆయన తెలిపారు. ప్రత్యేక వివాహ చట్టాన్ని కొట్టివేస్తే, అది దేశాన్ని స్వాతంత్ర్యానికి ముందు యుగానికి తీసుకెళ్తుందని చెప్పారు. తన సహచర భాగస్వామిని ఎన్నుకునే స్వేచ్ఛ, హక్కు ప్రతి ఒక్కరికి ఉంటుందని ఈ సందర్భంగా డీవై చంద్రచూడ్ పేర్కొన్నారు. సహచర భాగస్వామిని ఎన్నుకోవడం జీవితంలో ముఖ్యమైన ఘట్టంగా చెప్పుకొచ్చారు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 21 స్వలింగ సంపర్కులకు కూడా మిగతా వారిలాగానే అన్ని హక్కులు కల్పిచిందని ప్రధాన న్యాయమూర్తి డీవై చంద్రచూడ్ తెలిపారు. అలాగే అసహజ వ్యక్తుల హక్కులపై కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్రపాలిత ప్రాంతాలు వివక్ష చూపకూడదు ఆయన సూచించారు. సహజ వ్యక్తుల హక్కులు, అర్హతలను నిర్ణయించడానికి కేంద్ర ప్రభుత్వం ఒక కమిటీని ఏర్పాటు చేస్తుందని చెప్పిన సొలిసిటర్ జనరల్ ప్రకటనను రికార్డు చేస్తున్నాం. రేషన్ కార్డ్‌లలో అసహజ జంటలను కుటుంబంగా చేర్చడం, అసహజ జంటలు ఉమ్మడి బ్యాంకు ఖాతా కోసం నామినేట్ చేయడానికి వీలు కల్పించడం, పెన్షన్, గ్రాట్యుటీ మొదలైన వాటి నుంచి వచ్చే హక్కులను కేంద్రం ఏర్పాటు చేసే కమిటీ పరిశీలించాలని సీజేఐ చంద్రచూడ్ తెలిపారు.


మరో తీర్పులో స్వలింగ సంపర్కులకు ఎదురుదెబ్బ

మరో తీర్పులో స్వలింగ సంపర్కులకు సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. స్వలింగ వివాహనికి చట్టబద్దత లేదని ధర్మాసనం పేర్కొంది. స్వలింగ వివాహం చేసుకున్న వారిని దంపతులుగా గుర్తించలేమని పేర్కొంది. వివాహం చేసుకోవడం ప్రాథమిక హక్కు కాదన్న ధర్మాసనం కలిసి జీవించడాన్ని గుర్తిస్తున్నామని, కానీ దాన్ని వివాహంగా పరిగణించలేమని చెప్పుకొచ్చింది. ఈ క్రమంలో స్వలింగ సంపర్కులను దంపతులుగా గుర్తించలేమని స్పష్టం చేసింది. స్వలింగ జంటల అభ్యర్థనల పట్ల సానుభూతి ఉంది కానీ అభ్యర్థనలకు చట్ట బద్ధత లేదని తెలిపింది. ప్రత్యేక వివాహ చట్టంలో మార్పులు చేయాలా వద్దా అనేది పార్లమెంటు నిర్ణయిస్తుందని పేర్కొంది. ప్రత్యేక వివాహ చట్టాన్ని రద్దు చేయలేమని సుప్రీం స్పష్టం చేసింది. వివాహ వ్యవస్థకు సంబందించిన నిర్ణయాలను పార్లమెంటే తీసుకుంటుందని పేర్కొంది. ప్రేమ అనేది మానవత్వ లక్షణమని, వివాహ హక్కుల నిర్ధారణకూ ప్రభుత్వం కమిటీ వేయాలని సూచించింది.

Updated Date - 2023-10-17T13:19:15+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising