Karnataka: సీఎల్‌పీ సమావేశంపైనే అందరి దృష్టి.. కేంద్ర పరిశీలకులుగా ముగ్గురు
ABN, First Publish Date - 2023-05-14T14:32:26+05:30
బెంగళూరు: కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘనవిజయం సాధించడంతో ముఖ్యమంత్రి పదవి ఎవరిని వరించబోతోందనే అంశంపై పార్టీ వర్గాల్లో ఉత్సుకత నెలకొంది. మాజీ సీఎం సిద్ధరామయ్య, కర్ణాటక కాంగ్రెస్ చీఫ్ డీకే శివకుమార్ సీఎం రేసులో ఉండగా, ఆదివారం సాయంత్రం 5.30 నిమిషాలకు కొత్తగా ఎంపికైన ఎమ్మెల్యేలతో శాసనసభాపక్ష సమావేశం ఏర్పాటైంది. ఈ సమావేశానికి కేంద్ర పరిశీలకులుగా సుశీల్ కుమార్ షిండే, దీపక్ బవారియా, భన్వర్ జితేంద్ర సింగ్‌లను ఏఐసీసీ నియమించింది.
బెంగళూరు: కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘనవిజయం సాధించడంతో ముఖ్యమంత్రి పదవి ఎవరిని వరించబోతోందనే అంశంపై పార్టీ వర్గాల్లో ఉత్సుకత నెలకొంది. మాజీ సీఎం సిద్ధరామయ్య (Siddaramaiah), కర్ణాటక కాంగ్రెస్ చీఫ్ డీకే శివకుమార్ (DK Shivakumar) సీఎం రేసులో ఉండగా, ఇద్దరి నేతల అభిమానులు తమ నేతనే సీఎంగా ప్రకటించాలని కోరుతున్నారు. ఈ నేపథ్యంలో ఆదివారం సాయంత్రం 5.30 నిమిషాలకు కొత్తగా ఎంపికైన ఎమ్మెల్యేలతో శాసనసభాపక్ష సమావేశం ఏర్పాటైంది. ఈ సమావేశానికి కేంద్ర పరిశీలకులుగా సుశీల్ కుమార్ షిండే, దీపక్ బవారియా, భన్వర్ జితేంద్ర సింగ్‌లను కాంగ్రెస్ అధిష్ఠానం (AICC) నియమించింది. లెజిస్లేచర్ పార్టీ సమావేశంలో పరిశీలకు పాల్గొని సమావేశ వివరాలతో కూడిన నివేదికను అధిష్ఠానానికి అందజేస్తుంది.
ఇద్దరిలో ఎవరు?
సమష్టిగా పోటీ చేసి పార్టీని విజయతీరాలకు చేర్చిన సిద్ధరామయ్య, డీకే శివకుమార్‌లను అభినందించిన కాంగ్రెస్ అధిష్ఠానం వీరిలో ఒకరిని సీఎం అభ్యర్థిగా ఎంపిక చేసేందుకు కసరత్తు చేస్తోంది. శాసనసభాపక్ష సమావేశంలో ఏకాభిప్రాయసాధన కోసం ప్రయత్నించనుంది. కాగా, సిద్ధరామయ్యకు పార్టీ అధిష్ఠానం ఆశీస్సులు ఉన్నాయని జాతీయ మీడియా ప్రధానంగా చెబుతోంది. అయితే, కేవలం ఒకే రోజు తన నియోజకవర్గంలో ప్రచారం చేసి 1,22,392 ఓట్ల భారీ ఆధిక్యంతో గెలుపొందిన డీకే శివకుమార్‌కు అధిష్ఠానం ఆశీస్సులు దొరికే అవకాశాలు లేకపోలేదని మరికొందరు పరిశీలకులు అంటున్నారు. శాసనసభాపక్ష నేతగా ఎన్నికైన నాయకుడే సీఎం అవుతారు. సీఎం రేసులో ఉన్నట్టు సిద్ధరామయ్య, డీకే శివకుమార్ గతంలోనే పరోక్ష సంకేతాలు ఇచ్చినప్పటికీ ఎవరికి ఎవరూ పోటీ కాదని స్పష్టత ఇచ్చారు. అధిష్ఠానం నిర్ణయానికి కట్టుబడి ఉంటానని ఎన్నికలకు ముందు డీకే ప్రకటించగా, ఆరోగ్యకరమైన పోటీ మంచిదేనంటూ సిద్ధరామయ్య వ్యాఖ్యానించారు.
Updated Date - 2023-05-14T14:35:33+05:30 IST