Hindi Row : హిందీని రుద్దితే సహించేది లేదు : సీఎం స్టాలిన్
ABN, First Publish Date - 2023-08-05T15:32:48+05:30
తమిళం, హిందీ భాషల వివాదం మళ్లీ మొదలైంది. ఎలాంటి వ్యతిరేకత లేకుండా చివరాఖరికి హిందీని స్వీకరించవలసిందేనని కేంద్ర హోం మంత్రి అమిత్ షా (Amit Shah) చెప్పడాన్ని తమిళనాడు ముఖ్యమంత్రి, డీఎంకే చీఫ్ ఎంకే స్టాలిన్ (MK Stallin) తప్పుబట్టారు. హిందీ పట్ల వ్యక్తమవుతున్న వ్యతిరేకతను గుర్తించాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
చెన్నై : తమిళం, హిందీ భాషల వివాదం మళ్లీ మొదలైంది. ఎలాంటి వ్యతిరేకత లేకుండా చివరాఖరికి హిందీని స్వీకరించవలసిందేనని కేంద్ర హోం మంత్రి అమిత్ షా (Amit Shah) చెప్పడాన్ని తమిళనాడు ముఖ్యమంత్రి, డీఎంకే చీఫ్ ఎంకే స్టాలిన్ (MK Stallin) తప్పుబట్టారు. హిందీ పట్ల వ్యక్తమవుతున్న వ్యతిరేకతను గుర్తించాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. 1965నాటి హిందీ వ్యతిరేక ఆందోళనలను మళ్లీ రెచ్చగొట్టవద్దని హెచ్చరించారు. హిందీ మాట్లాడని రాష్ట్రాల్లో ఆ భాషను రుద్దేందుకు బీజేపీ ప్రయత్నిస్తోందని దుయ్యబట్టారు. హిందీతో తాము బానిసలం కాబోమన్నారు.
అధికార భాషపై పార్లమెంటరీ కమిటీ సమావేశంలో అమిత్ షా మాట్లాడుతూ, ఎలాంటి వ్యతిరేకత లేకుండా చివరాఖరికి హిందీని స్వీకరించవలసిందేనని చెప్పారు. ఈ ఆమోదం నెమ్మదిగా జరిగినప్పటికీ, ఎప్పటికైనా హిందీని అంగీకరించక తప్పదన్నారు.
దీనిపై స్టాలిన్ స్పందిస్తూ విడుదల చేసిన ప్రకటనలో, హిందీకి ఆమోదం లభించడం కోసం అమిత్ షా దుస్సాహసానికి ఒడిగడుతున్నారన్నారు. హిందీ మాట్లాడనివారిని తమ ఆధిపత్యం క్రిందకు వచ్చేలా చేయడానికి జరుగుతున్న దారుణమైన ప్రయత్నమని ఆరోపించారు. హిందీ ఆధిపత్యాన్ని, దానిని రుద్దడాన్ని తమిళనాడు తిరస్కరిస్తుందని స్పష్టం చేశారు. మన భాష, వారసత్వం మనల్ని నిర్వచిస్తాయన్నారు. హిందీతో తాము బానిసలం కాబోమని తెలిపారు. కర్ణాటక, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల్లో హిందీని రుద్దడానికి వ్యతిరేకంగా ఎలాంటి వ్యతిరేకత వ్యక్తమవుతోందో గుర్తించాలని అమిత్ షాను కోరారు.
ఇవి కూడా చదవండి :
Gyanvapi : జ్ఞానవాపి మసీదు ప్రాంగణంలో ఏఎస్ఐ సైంటిఫిక్ సర్వే పునఃప్రారంభం
Updated Date - 2023-08-05T15:32:48+05:30 IST