Hindi Row : పెరుగును హిందీలో పిలవడంపై తమిళనాడులో లొల్లి
ABN, First Publish Date - 2023-03-30T11:58:59+05:30
తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల్లో పెరుగు పొట్లాలపై ‘దహీ’ అని హిందీలో ముద్రించాలని భారత ఆహార భద్రత, ప్రమాణాల ప్రాధికార సంస్థ
చెన్నై : తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల్లో పెరుగు పొట్లాలపై ‘దహీ’ అని హిందీలో ముద్రించాలని భారత ఆహార భద్రత, ప్రమాణాల ప్రాధికార సంస్థ (FSSAI) చెప్పడాన్ని తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ (MK Stallin) తీవ్రంగా ఖండించారు. ‘‘మా మాతృభాషలను నిర్లజ్జగా అగౌరవపరచడానికి బాధ్యులైనవారిని దక్షిణాది నుంచి బహిష్కరిస్తాం’’ అని హెచ్చరించారు.
అంతకుముందు తమిళనాడు డెయిరీ అభివృద్ధి శాఖ మంత్రి ఎస్ఎం నాజిర్ మాట్లాడుతూ, రాష్ట్ర సహకార సొసైటీ ఆవిన్ విక్రయించే పెరుగు పొట్లాలు (curd packets)పై హిందీలో ‘దహీ’ అని ముద్రించాలని ఎఫ్ఎస్ఎస్ఏఐ ఆదేశించిందన్నారు. ఈ ఆదేశాలను అమలు చేయరాదని తమ ప్రభుత్వం నిర్ణయించిందన్నారు.
ఎంకే స్టాలిన్ ట్విటర్ వేదికగా స్పందిస్తూ, ప్రజల మనోభావాలను గౌరవించాలని ఎఫ్ఎస్ఎస్ఏఐని డిమాండ్ చేశారు. తమ మాతృభాషలను దూరం చేసుకోవాలని రాష్ట్రాలను కోరవద్దని హితవు పలికారు. పిల్లలను గిల్లి, ఊయల ఊపడం వంటి చర్యలకు పాల్పడవద్దని కోరారు. పెత్తనం చేయాలని చూడవద్దని చెప్పారు. అలాంటి ప్రయత్నాలు చేస్తే ఊయల ఊపడానికి ముందే మీరు కనుమరుగైపోతారని స్పష్టం చేశారు.
ఎఫ్ఎస్ఎస్ఏఐ కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల్లోని మిల్క్ ఫెడరేషన్లకు ఇచ్చిన ఆదేశాల్లో, పెరుగు పొట్లాలపై ‘దహీ’ అని హిందీలో స్పష్టంగా కనిపించేలా రాయాలని, కన్నడం, తమిళం భాషల్లో ఆ పదానికి సమాన అర్థాన్ని బ్రాకెట్లలో రాయాలని తెలిపింది.
ఇవి కూడా చదవండి :
Modi Vs Mamata : కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా పాట పాడిన దీదీ.. వీడియో వైరల్
Lalit Modi Vs Rahul Gandhi : రాహుల్ గాంధీకి లలిత్ మోదీ హెచ్చరిక
Updated Date - 2023-03-30T11:58:59+05:30 IST