ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

High Court: హైకోర్టులో రాష్ట్ర మంత్రికి ఎదురుదెబ్బ

ABN, First Publish Date - 2023-10-19T15:55:52+05:30

తమిళనాడు మంత్రి సెంథిల్ బాలాజీకి మద్రాస్ హైకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. ఆయన వేసిన బెయిల్ పిటిషన్‌ను హైకోర్టు తిరస్కరించింది.

చెన్నై: తమిళనాడు మంత్రి సెంథిల్ బాలాజీకి మద్రాస్ హైకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. ఆయన వేసిన బెయిల్ పిటిషన్‌ను హైకోర్టు తిరస్కరించింది. మనీలాండరింగ్ కేసులో అరెస్టైన సెంథిల్ బాలాజీ తనకు బెయిల్ ఇవ్వాలని కోరుతూ హైకోర్టును ఆశ్రయించారు. ఈ రోజు వాదనలు విన్న హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ జయచంద్రన్ బెయిల్ పిటిషన్‌ను తోసిపుచ్చారు. ఇప్పటికే పిటిషనర్ సోదరుడు పరారీలో ఉండడం, బెయిల్ ఇస్తే బాలాజీ సాక్షులను ప్రభావితం చేసే అవకాశాలు కూడా ఉండడంతో చివరకు బెయిల్ పిటిషన్‌ను హైకోర్టు కొట్టివేసింది. గతంలో అన్నాడీఎంకే హయాంలో రవాణా శాఖ మంత్రిగా ఉన్న సెంథిల్ బాలాజీ.. ఆ సమయంలో ఉద్యోగాల విషయంలో నగదు కుంభకోణానికి పాల్పడ్డారని ఆయనపై ఆరోపణలున్నాయి. దీంతో ఉద్యోగాల విషయంలో నగదు కుంభకోణంతో ముడిపడి ఉన్న మనీలాండరింగ్ కేసుకు సంబంధించి జూన్ 14న ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ బాలాజీని అరెస్టు చేసింది. అరెస్ట్ చేసిన వెంటనే ఆయనకు ఛాతి నొప్పి రావడంతో ఆసుపత్రికి తరలించారు. కావేరి ఆసుపత్రిలో బాలాజీకి బైపాస్ సర్జరీ కూడా జరిగింది. అనంతరం జూలై 17న పుఝుల్ సెంట్రల్ జైలులోని జైలు ఆసుపత్రికి తరలించారు. అయితే తాను 100 రోజులకు పైగా జైలులో ఉన్నానని, విచారణకు కూడా సహకరించారని బెయిల్ దరఖాస్తులో బాలాజీ పేర్కొన్నారు. ఇప్పటివరకు పిటిషనర్ కానీ, అతని కుటుంబసభ్యులు కానీ సాక్షులను ప్రభావితం చేయడానికి ప్రయత్నించినట్టు ఫిర్యాదు కూడా రాలేదని సెంథిల్ బాలాజీ తరఫు న్యాయవాది కోర్టులో వాదనలు వినిపించారు. కానీ పిటిషనర్ సోదరుడు పరారీలో ఉండడం, దీంతో సాక్షులను ప్రభావితం చేసే అవకాశాలు కూడా ఉంటాయని నమ్మిక కోర్టును ఆయనకు బెయిల్ ఇచ్చేందుకు నిరాకరించింది.

Updated Date - 2023-10-19T15:55:52+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising