ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

India vs Canada: ‘ఉగ్రవాదులకు స్వర్గధామంగా కెనడా’.. భారత్‌కు మద్దతుగా మరో దేశం

ABN, First Publish Date - 2023-09-26T12:56:00+05:30

భారత్, కెనడా వివాదంలో మన దేశానికి మద్దతు తెలిపే దేశాల సంఖ్య రోజు రోజుకు పెరుగుతోంది. తాజాగా మన పొరుగు దేశం శ్రీలంక కూడా మనకు మద్దతు తెలిపింది. ఈ మేరకు శ్రీలంక విదేశాంగ మంత్రి అలీ సబ్రీ స్పందించారు.

భారత్, కెనడా వివాదంలో మన దేశానికి మద్దతు తెలిపే దేశాల సంఖ్య రోజు రోజుకు పెరుగుతోంది. తాజాగా మన పొరుగు దేశం శ్రీలంక కూడా మనకు మద్దతు తెలిపింది. ఈ మేరకు శ్రీలంక విదేశాంగ మంత్రి అలీ సబ్రీ స్పందించారు. కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో ఎలాంటి ఆధారాలు లేకుండా భారత్‌పై ఆరోపణలు చేయడాన్ని ఖండించారు. ఉగ్రవాదులకు కెనడా సురక్షితమైన ప్రదేశంగా, స్వర్గధామంగా మారిపోయిందని ఆయన మండిపడ్డారు. ఈ క్రమంలోనే గతంలో శ్రీలంకపై కూడా కెనడా తప్పుడు ఆరోపణలు చేసిందని ఆయన గుర్తు చేశారు. తాజాగా భారత్‌పై ట్రూడో చేసిన ఆరోపణలు తననేమి ఆశ్చర్యానికి గురి చేయాలేదని ఆయన చెప్పుకొచ్చారు.


"కొందరు తీవ్రవాదులు కెనడాలో సురక్షిత స్థావరాన్నిఏర్పాటు చేసుకున్నారు. కెనడా ప్రధాని ఎలాంటి ఆధారాలు లేకుండా భారత్‌పై దారుణమైన ఆరోపణలు చేశారు. శ్రీలంక విషయంలో కూడా కెనడా గతంలో ఇలాంటి ఆరోపణలే చేసింది. మా దేశంలో ఎలాంటి మారణహోమం జరగలేదని అందరికీ తెలుసు. కానీ కెనడా అసత్య ప్రచారాలు చేసింది" అని ఆయన అన్నారు. అలాగే ఇటీవల కెనడా పార్లమెంట్‌లో రెండో ప్రపంచ యుద్ధంలో నాజీల కోసం పని చేసిన సైనికుడిని గౌరవించడంపై కూడా శ్రీలంక మంత్రి స్పందించారు. ఈ క్రమంలో కెనడా ప్రధాని ట్రూడోపై ఆయన విమర్శలు చేశారు. "నేను నిన్న చూశాను. రెండవ ప్రపంచ యుద్ధంలో నాజీలతో సంబంధం ఉన్న వ్యక్తికి ట్రూడో ఘన స్వాగతం పలికారు. ఇది సందేహాస్పదంగా ఉంది. ట్రూడో గతంలో కూడా ఇలానే వ్యవహరించారు. ఏదీ సరిగ్గా తెలుసుకోకుండా ఆరోపణలు చేస్తారు. దీంతో కొన్నిసార్లు ట్రూడో దారుణమైన, ఆధారాలు లేని ఆరోపణలు చేయడం నాకు ఆశ్చర్యం కలిగించదు." అని అన్నారు. ట్రూడో చేసిన "మారణహోమం" వ్యాఖ్యలు శ్రీలంక-కెనడా సంబంధాలను ప్రభావితం చేశాయని సబ్రీ అన్నారు.

"ఇది వాస్తవానికి మా సంబంధాన్ని ప్రభావితం చేసింది. విదేశాంగ మంత్రిత్వ శాఖ దానిపై భిన్నమైన వైఖరిని కలిగి ఉంది. శ్రీలంక మారణహోమానికి గురికాలేదని గ్లోబల్ అఫైర్స్ మంత్రిత్వ శాఖ చాలా స్పష్టంగా చెప్పింది. అయితే ఒక రాజకీయ నాయకుడిగా ట్రూడో మారణహోమం జరిగిందని చెప్పారు. అది విరుద్ధమైనది. ఒక దేశం నాయకుడు చేసే ఇటువంటి బాధ్యతా రహితమైన ప్రకటనలు శాంతి, సయోధ్యను ప్రోత్సహించడానికి బదులుగా కెనడా, శ్రీలంక మధ్య అసమ్మతి, ద్వేషాన్ని పెంచుతాయి." అని సబ్రీ అన్నారు. అలాగే సార్వభౌమాధికారం ఉన్న దేశ అంతర్గత విషయాల్లో జోక్యం చేసుకోవద్దని కెనడా ప్రధానికి ఆయన సూచించారు. “ఎవరూ ఇతర దేశాలకు ముక్కు పొడిచి, మన దేశాన్ని ఎలా పరిపాలించాలో చెప్పాలని నేను అనుకోను. మనం మన దేశాన్ని అందరికంటే ఎక్కువగా ప్రేమిస్తున్నాము, అందుకే మనం మన దేశంలో ఉన్నాము.’’ అని శ్రీలంక విదేశాంగ మంత్రి అలీ సబ్రీ అన్నారు.

Updated Date - 2023-09-26T12:56:00+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising