ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

RTC: రన్నింగ్‌లో ఆర్టీసీ బస్సు పైటాప్ లేచిపోయింది.. ప్రయాణికుల ఆర్తనాదాలు పట్టించుకోకుండా..!

ABN, First Publish Date - 2023-07-28T14:53:54+05:30

ఆర్టీసీ ప్రయాణం గురించి ఆ సంస్థ రకరకాలైన స్లోగన్లు ఇస్తుంటుంది. ఆర్టీసీలో ప్రయాణం క్షేమమని.. సురక్షితంగా గమ్యానికి చేరొచ్చని ఇలా ప్రోమోట్ చేసుకుంటుంది. అలాగే ప్రైవేటు బస్సుల కంటే ఛార్జీలు తక్కువని.. తక్కువ ఖర్చుతో ఇంటికి చేరొచ్చని పబ్లిసిటీ చేసుకుంటుంది. ఇది ఎంతవరకు నిజమో తెలియదు గానీ.. ఈ సీన్ చూశాక ఏమంటారో మీరే చెప్పండి.

ఆర్టీసీ ప్రయాణం గురించి ఆ సంస్థ రకరకాలైన స్లోగన్లు ఇస్తుంటుంది. ఆర్టీసీలో ప్రయాణం క్షేమమని.. సురక్షితంగా గమ్యానికి చేరొచ్చని ఇలా ప్రోమోట్ చేసుకుంటుంది. అలాగే ప్రైవేటు బస్సుల కంటే ఛార్జీలు తక్కువని.. తక్కువ ఖర్చుతో ఇంటికి చేరొచ్చని పబ్లిసిటీ చేసుకుంటుంది. ఇది ఎంతవరకు నిజమో తెలియదు గానీ.. ఈ సీన్ చూశాక ఏమంటారో మీరే చెప్పండి.

సహజంగా ప్యాసింజర్స్ ఎక్కువగా ఆర్టీసీకే ప్రాధాన్యత ఇస్తుంటారు. ఎంతో నమ్మకంతో ప్రయాణం చేస్తున్న ప్రయాణికులకు ఆర్టీసీ కూడా అంతే భరోసా కల్పించాలి. అలాంటిది ఓ డ్రైవర్ అవేమీ పట్టించుకోకుండా ప్రమాదకర స్థితిలో బస్సును నడిపించి ప్రయాణికులను హడలెత్తించాడు. ఓ డ్రైవర్ చేసిన పనికి ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని జర్నీ చేయాల్సి వచ్చింది. మహారాష్ట్రలో జరిగిన ఈ సంఘటన ఇప్పుడు నెట్టింట తెగ వైరల్ అవుతోంది. అసలు ఇంతకీ ఏం జరిగిందో తెలియాలంటే ఈ వార్త చదవాల్సిందే.

మహారాష్ట్రలోని (Maharashtra) గడ్చిరోలి జిల్లా అహేరి డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు (TRC BUS) ప్రయాణికులతో రోడ్డుపై దూసుకుపోతుంది. ఉన్నట్టుండి బస్సు పైటాప్ పైకి లేచిపోయింది. దీంతో బస్సులో ఉన్న ప్రయాణికులంతా భయభ్రాంతులకు గురయ్యారు. మరికొందరైతే ప్రాణభయంతో ఆర్తనాదాలు చేశారు. వెంటనే బస్సును ఆపాలంటూ డ్రైవర్‌ను ప్రాధేయపడ్డారు. కానీ డ్రైవర్ ఏ మాత్రం కనికరం చూపలేదు. ప్రయాణికుల ఆక్రందనలు ఏమీ పట్టించుకోకుండా డ్రైవర్‌ అలాగే ముందుకు పోనిచ్చాడు. ప్యాసింజర్స్ భయపడుతున్నారన్న ఆలోచన లేకుండా 60 కిలోమీటర్ల వేగంతో దూసుకుపోయాడు. అదే రోడ్డుపై వెళ్తున్న వాహనదారులు తమ ఫోన్లలో ఆర్టీసీ బస్సు విజువల్స్‌ను షూట్ చేసి సోషల్ మీడియాలో పోస్టు చేశారు. అవి కాస్తా అధికారుల దృష్టికి చేరడంతో డ్రైవర్‌పై చర్యలకు ఉపక్రమించారు. ప్రయాణికుల భద్రత విషయంలో నిర్లక్ష్యం వహించిన సిబ్బందిపై చర్యలు తీసుకుంటామని అధికారులు తెలిపారు. మరోవైపు నెటిజన్లు.. ఆర్టీసీ డ్రైవర్‌పై మండిపడుతున్నారు.

Updated Date - 2023-07-28T14:53:54+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising