ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Bharat Jodo Yatra : రాహుల్ గాంధీ సత్తా పెరిగింది... ప్రధాన మంత్రి కాగలరు : శతృఘ్న సిన్హా

ABN, First Publish Date - 2023-01-09T13:11:35+05:30

కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ (Rahul Gandhi) భారత్ జోడో యాత్ర (Bharat Jodo Yatra)తో తన సత్తాను చాటుకుంటున్నట్లు

Bharat Jodo Yatra
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ : కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ (Rahul Gandhi) భారత్ జోడో యాత్ర (Bharat Jodo Yatra)తో తన సత్తాను చాటుకుంటున్నట్లు కనిపిస్తోంది. వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు ఈ యాత్రలో పాల్గొంటూ, ఆయనకు మద్దతు పలుకుతున్నారు. తాజాగా టీఎంసీ ఎంపీ శత్రుఘ్న సిన్హా (Shatrughan Sinha) ఆదివారం ఓ వార్తా సంస్థతో మాట్లాడుతూ, రాహుల్ గాంధీ ప్రధాన మంత్రి పదవికి అర్హుడని చెప్పారు.

రాహుల్ గాంధీ, కాంగ్రెస్ నిర్వహిస్తున్న భారత్ జోడో యాత్ర విప్లవాత్మక యాత్ర అని శత్రుఘ్న సిన్హా చెప్పారు. రానున్న ఎన్నికల్లో ఈ యాత్ర ప్రభావం కచ్చితంగా ఉంటుందన్నారు. నెలల తరబడి పాదయాత్ర చేస్తూ పరిణతి సాధించారని, సీరియస్ లీడర్‌గా ఎదిగారని చెప్పారు. ఆయన యువతకు ఓ ఆదర్శప్రాయుడిగా మారారని చెప్పారు. ఆయన ప్రజలకు కనిపించే తీరు, ప్రజల్లో ఆయనపైగల ముద్ర అంతకుముందులా లేవని, ఈ యాత్రతో పూర్తిగా మారిపోయాయని చెప్పారు. కొందరు ఆయన మూర్తిత్వాన్ని (imageను) నాశనం చేయాలని ప్రయత్నిస్తున్నారని, ఆయన మాత్రం దేశానికి సీరియస్ లీడర్‌గా ఎదిగారని చెప్పారు. ప్రధాన మంత్రి కాగలిగే సత్తా ఆయనకు ఉందన్నారు.

తమిళనాడులోని కన్యా కుమారి నుంచి సెప్టెంబరు 7న ప్రారంభమైన భారత్ జోడో యాత్ర కశ్మీరులో జనవరి 30న ముగుస్తుంది. ప్రస్తుతం ఈ యాత్ర హర్యానాలోని కురుక్షేత్రలో జరుగుతోంది. ఈ యాత్రలో సోమవారం రాహుల్ గాంధీతోపాటు అందరూ మహిళలే పాల్గొంటున్నారు.

Updated Date - 2023-01-09T13:11:40+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising