ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Tomato Price: డబుల్ సెంచరీ కొట్టిన టమాటా.. ఎక్కడంటే..?

ABN, First Publish Date - 2023-07-31T16:07:01+05:30

దేశంలో టమాటాల ధరలు రోజురోజుకు పెరుగుతున్నాయే కానీ తగ్గడం లేదు. నిన్న మొన్నటి వరకు కిలో టమాటాల ధర రూ.100 దాటితేనే వామ్మో అనుకున్న వినియోగదారులకు ఇప్పుడు మరో షాక్ తగిలింది. ప్రస్తుతం టమాటాల ధరలు మరింత పెరిగిపోయాయి. ఆల్‌టైమ్ అత్యధిక ధరలు పలుకుతున్నాయి.

చెన్నై: దేశంలో టమాటాల ధరలు రోజురోజుకు పెరుగుతున్నాయే కానీ తగ్గడం లేదు. నిన్న మొన్నటి వరకు కిలో టమాటాల ధర రూ.100 దాటితేనే వామ్మో అనుకున్న వినియోగదారులకు ఇప్పుడు మరో షాక్ తగిలింది. ప్రస్తుతం టమాటాల ధరలు మరింత పెరిగిపోయాయి. ఆల్‌టైమ్ అత్యధిక ధరలు పలుకుతున్నాయి. కిలో టమాటాల ధర ఏకంగా డబుల్ సెంచరీ కొట్టేసింది. టమాటాల కొరత కారణంగా ఆదివారం చెన్నైలోని రిటైల్ మార్కెట్‌లో కిలో టమాటాల ధర రూ.200 పలికింది. అదే టమాటాలు హోల్ సేల్ మార్కెట్‌లో రూ.150గా ఉంది. టమాటాల కొరత కారణంగానే ధరలు ఈ స్థాయిలో పెరిగినట్టు వ్యాపారులు చెబుతున్నారు. ప్రస్తుతం చెన్నైకి టమాటాలు కర్ణాటకలోని ఎస్‌ఎస్ పురం, కోలార్, చిక్కమగళూరు, ఏపీలోని శ్రీనివాసపురం, ఒట్టపల్లి, క్రిష్ణగిరి, రావకోట్లై, ధర్మపురి నుంచి వస్తున్నాయి. అయితే ఆయా ప్రాంతాల్లో భారీ వర్షాల కారణంగా పంట నష్టం సంభవించడంతో రావాల్సిన దాని కన్నా టమాటాలు చెన్నైకి తక్కువగా వస్తున్నాయని వ్యాపారులు అంటున్నారు. దీంతో ధరలు భారీగా పెరిగినట్టు చెప్పుకొస్తున్నారు.


అయితే ఈ ధరలు ఇక్కడితో ఆగే అవకాశం లేదని, రానున్న వారం రోజుల్లో రూ.250కి చేరుకొచ్చని పలువురు అంచనా వేస్తున్నారు. నూతన పంటలు అందుబాటులోకి వచ్చే వరకు టమాటాల ధరలు తగ్గే అవకాశం లేదని చెబుతున్నారు. కోయంబేడు మార్కెట్‌లో ఓ హోల్‌సేల్ వ్యాపారి మాట్లాడుతూ.. చైన్నైకి గతంలో ప్రతి రోజూ 1,200 టన్నుల టమాటాలు వచ్చేవని, కానీ ప్రస్తుతం అది 300 టన్నులకు పడిపోయిందని తెలిపాడు. ఆ తగ్గుదల రిటైల్ మార్కెట్‌లో ధరల పెరుగుదలకు దారి తీసిందని పేర్కొన్నారు. కాగా కొన్ని ప్రాంతాల్లో కిలో కంట్రీ టమాటా రూ.130, కొన్ని సూపర్‌ మార్కెట్లలో బెంగళూరు రకం టమాటా రూ.160, ఆన్‌లైన్ కూరగాయల పోర్టల్‌లో కిలో టమాటా రూ.165గా ఉంది. కాగా ధరల పెరుగుదల కారణంగా వినియోగదారులు టమాటాల వాడకం తగ్గించినప్పటికీ కొన్ని ప్రాంతాల్లో ధరలు పెరుగుతూనే ఉన్నాయి. ఏది ఏమైనా ఆకాశన్నింటిన టమాటాల ధరలు సామాన్యులకు చుక్కలు చూపిస్తున్నాయి.

Updated Date - 2023-07-31T16:32:09+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising