Trains: తెలుగు రాష్ట్రాల మీదుగా రెండు ప్రత్యేక రైళ్లు.. ఎక్కడినుంచి ఎక్కడివరకంటే...
ABN, First Publish Date - 2023-10-06T13:59:17+05:30
నైరుతి రైల్వే బెంగళూరు డివిజన్ యశ్వంతపురం- ముజఫర్‌పూర్‌ల మధ్య 05272 నెంబరు రైలును ప్రతి సోమవారం నడుపుతోంది.
బెంగళూరు, (ఆంధ్రజ్యోతి): నైరుతి రైల్వే బెంగళూరు డివిజన్ యశ్వంతపురం- ముజఫర్‌పూర్‌ల మధ్య 05272 నెంబరు రైలును ప్రతి సోమవారం నడుపుతోంది. వారానికోసారి నడిచే ఈరైలు యశ్వంతపురం రైల్వేస్టేషన్‌లో ప్రతి సోమవారం ఉదయం 7-30 గంటలకు బయల్దేరుతుంది. ఈ రైలు ధర్మవరం, అనంతపురం, గుత్తి, డోన్, కర్నూల్(Dharmavaram, Anantapur, Gutti, Don, Kurnool), జడ్జర్ల, షాద్‌నగర్, కాచిగూడ, జనగాం, కాజిపేట, రామగుండం(Janagam, Kazipet, Ramagundam), కాగజ్‌నగర్, సిర్పూర్‌ల మీదుగా సాగుతుంది. ఈ రైలు సేవలు యశ్వంతపురం నుంచి అక్టోబరు 9న ప్రారంభమై డిసెంబరు 11 వరకు ఉంటాయి. కాగా యశ్వంతపురం- బారౌనీ వీక్లీస్పెషల్ రైలు 05216 వీక్లీ ఎక్స్‌ప్రెస్ ప్రత్యేక రైలు యశ్వంతపురంలో ప్రతి మంగళవారం ఉదయం 7-30 గంటలకు బయల్దేరి వెళుతుంది. ఈ రైలు కూడా పైన తెలిపిన రైల్వేస్టేషన్ల మీదుగానే ప్రయాణిస్తుంది. ఈ రైలు సేవలు కూడా అక్టోబరు 10న ప్రారంభమై డిసెంబరు 12 వరకు ఉంటాయని పేర్కొన్నారు.
Updated Date - 2023-10-06T13:59:17+05:30 IST