RSS Drills Ban : ట్రావన్‌కోర్ దేవస్వోమ్ బోర్డ్ సంచలన నిర్ణయం.. ఆరెస్సెస్ డ్రిల్స్‌పై నిషేధం..
ABN, First Publish Date - 2023-05-23T19:59:31+05:30
కేరళలోని దేవాలయాల ప్రాంగణాల్లో రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ కార్యకలాపాలను అనుమతించరాదని ట్రావన్‌కోర్ దేవస్వోమ్ బోర్డ్ నిర్ణయించింది.
తిరువనంతపురం : కేరళలోని దేవాలయాల ప్రాంగణాల్లో రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ (RSS) కార్యకలాపాలను అనుమతించరాదని ట్రావన్‌కోర్ దేవస్వోమ్ బోర్డ్ (TDB) నిర్ణయించింది. ఈ బోర్డు పరిధిలో దాదాపు 1,200 దేవాలయాలు ఉన్నాయి. వీటిలో ఆరెస్సెస్ సభ్యులను అనుమతించరాదని ఆయా దేవాలయాలకు ఆదేశాలు జారీ చేసింది. ఈ ఆదేశాలను పాటించని అధికారులపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది.
దేవాలయాల అధికారులకు టీడీబీ జారీ చేసిన ఆదేశాల్లో, దేవాయాల ప్రాంగణాల్లో ఆరెస్సెస్ కార్యకలాపాలను అనుమతించరాదని తెలిపింది. సామూహిక కవాతులు, ఇతర కార్యకలాపాలను నిర్వహించేందుకు ఆరెస్సెస్‌ను అనుమతించవద్దని చెప్పింది. ఈ ఆదేశాలను కఠినంగా అమలు చేయాలని, ఈ ఆదేశాలను అమలు చేయని అధికారులపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది.
టీడీబీ అధ్యక్షుడు కే అనంత గోపన్ మీడియాతో మాట్లాడుతూ, అనేక దేవాలయాల్లో ఆరెస్సెస్ శాఖలు జరుగుతున్నాయని, కవాతులు చేస్తున్నారని అన్నారు. అందుకే తాము ఈ ఆదేశాలను జారీ చేశామని చెప్పారు. దేవాలయాలు ఉన్నది భక్తుల కోసమని, వారికి ఎటువంటి అసౌకర్యం కలుగకూడదని అన్నారు. బోర్డు వైఖరి ఇదేనని చెప్పారు. తాము ఏ దేవాలయంలోనూ ఎటువంటి దర్యాప్తును నిర్వహించలేదన్నారు. ఇది పండుగల సమయమని చెప్పారు. ఆరెస్సెస్ మాత్రమే కాకుండా ఇతరులు కూడా జోక్యం చేసుకునే అవకాశం ఉందని, దానిని తాము వ్యతిరేకిస్తున్నామని చెప్పారు.
ఆరెస్సెస్ కార్యకలాపాలపై నిషేధం విధించడాన్ని కాంగ్రెస్ స్వాగతించింది. కాంగ్రెస్ నేత ఉదిత్ రాజ్ మాట్లాడుతూ, ఆరెస్సెస్ దుర్మార్గపు ఎజెండాను దేవాలయాల్లో కాకుండా మరెక్కడైనా అమలు చేసుకోవచ్చునన్నారు. అయితే ఆరెస్సెస్ నేత ఇంద్రేష్ కుమార్ మాట్లాడుతూ, ఇది అప్రజాస్వామిక నిర్ణయమని చెప్పారు. రాజ్యాంగాన్ని హత్య చేయడం వంటి చర్య అని ఆరోపించారు. ఆరెస్సెస్ శాఖల్లో ఆయుధాలను ఉపయోగించడంలో శిక్షణ ఇచ్చిన దాఖలాలు లేవన్నారు.
టీడీబీ 2021 మార్చిలో కూడా ఇటువంటి ఆదేశాలను జారీ చేసింది. ఆయుధాలను ఉపయోగించడంలో ఆరెస్సెస్ శిక్షణ ఇవ్వడంపై 2016లో నిషేధం విధించింది.
ఇవి కూడా చదవండి :
Gyanvapi Case : ‘జ్ఞానవాపి’పై అన్ని పిటిషన్లను కలిపి విచారిస్తాం : వారణాసి కోర్టు
Modi Vs Sisodia : మోదీ దురహంకారి : సిసోడియా
Updated Date - 2023-05-23T19:59:31+05:30 IST