Tungabhadra: తుంగభద్రకు భారీగా వరద నీరు
ABN, First Publish Date - 2023-07-28T11:52:02+05:30
తుంగభద్ర(Tungabhadra) జలాశయానికి వరద నీరు చేరిక ఎక్కువ అవుతున్న తరుణంలో ఆంధ్రా కోటా క్రింద నేడు ఎల్లెల్సీకి సాగునీటిని విడుదల చేస్తు
- ఒకే రోజు 10టీఎంసీల నీరు చేరిక
బళ్లారి(బెంగళూరు): తుంగభద్ర(Tungabhadra) జలాశయానికి వరద నీరు చేరిక ఎక్కువ అవుతున్న తరుణంలో ఆంధ్రా కోటా క్రింద నేడు ఎల్లెల్సీకి సాగునీటిని విడుదల చేస్తున్నట్లు బోర్డు అధికారులు తెలిపారు. తుంగభద్ర జలాశయానికి గత ఏడాదితో పోల్చితే ఆలస్యంగా నీటి సేకరణ జరిగా, ప్రస్తుతం నెలకొన్న వాతావరణ పరిస్థితుల నేపథ్యంలో సరైన సమయంలోనే తుంగభద్ర జలాశయం పూర్తి స్థాయిలో నిండుతుందని బోర్డు అధికారులు భావిస్తున్నారు. తుంగభద్ర పైతట్టు పరివాహక ప్రాంతాల్లో భారీగా వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో రోజురోజకు తుంగభద్ర జలాశయంలో నీటి చేరిక ఎక్కువ అవుతున్న తరుణంలో ఎల్లెల్సీ పరిధిలోకి ఆంధ్రప్రదేశ్(Andhra Pradesh)లోని కర్నూలు(Kurnool) జిల్లా రైతుల డిమాండ్ మేర ఆంధ్రాకోటా క్రింద నీటి విడుదల చేసేందుకు బోర్డు అధికారులు సిద్దమయ్యారు.
అయితే కర్ణాటక వాటా విడుదలపై బోర్డు అధికారులతో స్పష్టమైన సమాచారం లేదు. సాధారణంగా సాగునీటి విడుదలపై బళ్ళారి, కొప్పళ, రాయచూరు జిల్లాల ప్రజా ప్రతినిధుల ఆధ్వర్యంలో ప్రతి యేటా మునిరాబాద్‌లో బోర్డు కార్యాలయంలో ఐసీసీ సమావేశంలో సాగునీటి కాలువలకు నీటి విడుదలకు సంబంధించి నిర్ణయం తీసుకుంటారు. అయితే ఇంతవరకు సమావేశానికి సంబంధించి ఎలాంటి సమాచారం లేదు. తుంగభద్ర జలాశయానికి ఆశించినస్థాయిలో నీటి చేరిక జరుగుతున్నట్ల్లు సాగునీటిని విడుదల చేయాలని బళ్లారి జిల్లా రైతు సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. ప్రస్తుతం తుంగభద్ర జలాశయం నీటి మట్టం 1617.32 అడుగులకు చేరుకోగా, ప్రస్తుతం జలాశయానికి 1,21,918 క్యూసెక్కులకు పైగా వరదనీరు వచ్చిచేరుతున్నట్లు బోర్డు అధికారులు తెలిపారు.
Updated Date - 2023-07-28T11:52:02+05:30 IST