Tungabhadra: 20 రోజుల తర్వాత ‘తుంగభద్రకు’ ఇన్‌ఫ్లో..
ABN, First Publish Date - 2023-11-10T11:44:51+05:30
మూడు నాలుగు రోజులుగా తుంగభద్రపై తట్టు ప్రాంతంలో విస్తారంగా వర్షాలు కురుస్తుండడంతో జలాశయానికి వరద
- వర్షం కారణంగా టీబీ డ్యాంలోకి చేరుతున్న నీరు
బళ్లారి(బెంగళూరు): మూడు నాలుగు రోజులుగా తుంగభద్రపై తట్టు ప్రాంతంలో విస్తారంగా వర్షాలు కురుస్తుండడంతో జలాశయానికి వరద నీటి చేరిక జరుగుతున్నట్లు బోర్డు అధికారులు తెలిపారు. గత 20 రోజులుగా తుంగభద్ర జలాశయా(Tungabhadra Reservoir)నికి ఇన్‌ప్లో ‘జీరో ’ స్థాయికి పడిపోవడంతో ఉన్న నీటినే ఆచితూచి వాడుకునే పరిస్థితి నెలకొంది. అయితే గురువారం ఉదయం సమయానికి జలాశయానికి సుమారు 4,800 క్యూసెక్కుల వరద నీరు చేరడంతో ఆయకట్టు రైతులకు మళ్లీ ఊపిరి వచ్చినట్లయ్యింది. ఇదే తంతు మరికొన్ని కొనసాగితే ఖరీఫ్‌లో సాగుచేసిన పంటలు చేతికి వస్తాయని రైతులు ఆశిస్తున్నారు. ప్రస్తుతం జలాశయంలో 1,60,315 అడుగులకు నీటి మట్టం పడిపోగా 25.870 టీఎంసీల నీరు మాత్రమే నిల్వ ఉంది. జలాశయం క్రింద వివిధ కాలువలకు 9,874 క్యూసెక్కులు నీరు విడుదల చేస్తుండగా, గురువారం ఉదయం నుంచి జలాయశానికి 4860 క్యూసెక్కుల వరద నీరు వచ్చిచేరుతున్నట్లు బోర్డు అధికారులు తెలిపారు. గత ఏడాది ఇదే సమయానికి 1632.07 అడుగుల మేర నీరు నిల్వ ఉండగా, 102.054 టీఎంసీల నీటితో జలాశయం తొణికిసలాడు తుండేది. అయితే నీరు లేక వెలవెలబోతుండడంతో ఆయకట్టు రైతులు ఆందోళన చెందాల్సిన పరిస్థితి నెలకొంది.
Updated Date - 2023-11-10T11:47:37+05:30 IST