Tushar Gandhi: ఎల్జీ సాబ్.. గాంధీకి లా డిగ్రీ లేదా? బుక్ పంపిస్తా చదువుకోండి..!
ABN, First Publish Date - 2023-03-25T16:51:48+05:30
జాతిపిత మహాత్మాగాంధీ విద్యార్హతలపై జమ్మూకశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా చేసిన వ్యాఖ్యలపై ..
న్యూఢిల్లీ: జాతిపిత మహాత్మాగాంధీ (Mahatma Gandhi) విద్యార్హతలపై (Educational Qualifications) జమ్మూకశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా (Manoj Sinha) చేసిన వ్యాఖ్యలపై గాంధీజీ ముని మనుమడు తుషార్ గాంధీ (Tushar Gandhi) విరుచుకుపడ్డారు. ''జమ్మూ రాజ్‌భవన్‌కు మహాత్మాగాంధీ ఆటోబయోగ్రఫీని పంపాను. అది చదవిన తర్వాత అయినా డిప్యూటీ గవర్నర్ అవగాహన పెంచుకుంటారని ఆశిస్తున్నాను'' అని తుషార్‌గాంధీ ఓ ట్వీట్‌లో పేర్కొన్నారు.
గ్వాలియర్‌లోని ఐటీఎంలో డాక్టర్ రామ్ మనోహర్ లోహియా స్మారకోపన్యాసంలో సిన్హా మాట్లాడుతూ, మహాత్మాగాంధీకి యూనివర్శిటీ డిగ్రీ లేదని అన్నారు. ఈ వ్యాఖ్యలను తుషార్ గాంధీ వరుస ట్వీట్లలో ఖండించారు. మహాత్మాగాంధీ రెండు మెట్రిక్ ఎగ్జామ్స్ పాస్ అయ్యారని, ఒకటి ఆల్ఫ్రెడ్ హైస్కూల్ రాజ్‌కోట్ అనీ, మరొకటి దానిని సమానమైన లండన్‌లోని బ్రిటిష్ మెట్రిక్యులేషన్‌లో ఉత్తీర్ణులయ్యారని చెప్పారు. ఇవేకాకుండా, లండన్ యూనివర్శీటికి అనుబంధంగా ఉన్న ఇన్నర్ టెంపుల్ లా కాలేజీలో నాయశాస్త్రం చదవడం, పరీక్ష రాయడం, లా డిగ్రీ పొందడం జరిగిందన్నారు. అలాగే, రెండు డిప్లమోలు కూడా పొందారని, ఒకటి లాటిన్‌లో, మరొకటి ఫ్రెంచ్‌లోనని తెలిపారు. జమ్మూకశ్మీర్ రాజ్‌భవన్‌కు గాంధీజీ ఆటోబయోగ్రఫీ ప్రతిని పంపుతున్నానని, అది చదవి అయినా ఎల్జీ అవగాహన పెంచుకుంటున్నారని ఆశిస్తున్నానని అన్నారు.
Updated Date - 2023-03-25T16:51:48+05:30 IST