ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Uddhav Thackeray: శివసేన-యూబీటీ నేషనల్ ఎగ్జిక్యూటివ్‌లో మార్పులు, కొత్తగా ఆరుగురికి చోటు

ABN, First Publish Date - 2023-10-16T15:40:58+05:30

లోక్‌సభ ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని శివసేన-యూబీటీ చీఫ్ ఉద్ధవ్ థాకరే సోమవారంనాడు పార్టీ ఆర్గనైజేషన్‌ను పునర్వవస్థీకరించారు. ఇందులో భాగంగా శివసేన-యూబీటీ కొత్త జాతీయ కార్యవర్గాన్ని ఆయన ప్రకటించారు. తనకు నమ్మకమైన ఆరుగురు నేతలను ఇందులో చేర్చారు.

ముంబై: వచ్చే ఏడాది జరుగనున్న లోక్‌సభ ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని శివసేన (UBT) చీఫ్ ఉద్ధవ్ థాకరే (Uddhav Thackeray) సోమవారంనాడు పార్టీ ఆర్గనైజేషన్‌ను పునర్వవస్థీకరించారు. శివసేనలో ఇటీవల చీలక వచ్చిన అనంతరం పార్టీని పునర్వవస్థీకరించే కసరత్తును ఉద్ధవ్ కొద్దికాలంగా చేస్తున్నారు. ఇందులో భాగంగా శివసేన-యూబీటీ కొత్త జాతీయ కార్యవర్గాన్ని ఆయన ప్రకటించారు. తనకు నమ్మకమైన ఆరుగురు నేతలను ఇందులో చేర్చారు. కొత్త జాతీయ కార్యవర్గంలో ఎంపీలు వినాయక్ రౌత్, అనిల్ దేశాయ్, రాజన్ విచారే, ఎమ్మెల్యేలు అనిల్ పరబ్, సునీల్ ప్రభు, రవీంద్ర వాయకర్‌లకు చోటు కల్పించారు.


కొత్తగా చేసిన మార్పులతో శివసేన (యూబీటీ) నేషనల్ ఎగ్జిక్యూటివ్‌లో నేతల సంఖ్య 16 మందికి చేరింది. వీరిలో 10 మంది డిప్యూటీ లీడర్లు, ముగ్గురు సెక్రటరీలు, ముగ్గురు ఆర్గనైజేషన్ మినిస్టర్లు ఉన్నారు. ఆదిత్య థాకరేకు అత్యంత సన్నిహితులైన యువ నేతలు వరుణ్ సర్దేశాయ్, సాయినాథ్ దుర్గేలకు కూడా నూతన కార్యవర్గంలో చోటు కల్పించారు.


అనర్హత పిటిషన్లపై ఎటూ తేల్చని స్పీకర్...సుప్రీంకోర్టు ఆగ్రహం

శివసేన చీలక వర్గమైన మహారాష్ట్ర సీఎం ఏక్‌నాథ్ షిండేతో పాటు పలువురు ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలంటూ వచ్చిన పిటిషన్లపై అసెంబ్లీ స్పీకర్‌ రాహల్ నార్వేకర్ చేస్తున్న జాప్యంపై గత శుక్రవారంనాడు సుప్రీంకోర్టు సీరియస్ అయింది. గతంలో తాము గడువు కోరుతూ ఇచ్చిన ఉత్పర్వులపై సమాధానం ఇవ్వకపోవడాన్ని తప్పుపట్టింది. అత్యున్నత న్యాయస్థానం ఉత్తర్వులను స్పీకర్ బేఖాతరు చేయలేరని సీజేఐ డీవై చంద్రచూడ్ నేతృత్వంలోని ధర్మాసనం వ్యాఖ్యానించిది. ఈ వ్యవహారాన్ని ఎప్పట్లోగా తేలుస్తారో కాలవ్యవధి చెప్పాలని అదనపు సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతాను ధర్మాసనం ఆదేశించింది. స్పీకర్ ఇచ్చే కాల వ్యవధి తమను సంతృప్తి పరచని పక్షంలో తామే తప్పనిసరి ఆదేశాలిస్తామని హెచ్చరించింది.

Updated Date - 2023-10-16T15:40:58+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising