ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Savarkar Row: వాళ్లు రెచ్చగొడతారు..మీరు అదుపుతప్పితే ఎలా?.. రాహుల్‌కు శివసేన వార్నింగ్

ABN, First Publish Date - 2023-03-27T15:20:32+05:30

''నేను సావర్కర్‌ను కాదు, క్షమాపణ చెప్పను'' అంటూ కాంగ్రెస్ సీనియర్ నేత రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలపై..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ప్రవేశం ఉచితం. సం|| 9393 763 666

ముంబై: ''నేను సావర్కర్‌ను కాదు, క్షమాపణ చెప్పను'' అంటూ కాంగ్రెస్ సీనియర్ నేత రాహుల్ గాంధీ (Rahul Gandhi) చేసిన వ్యాఖ్యలపై మహారాష్ట్ర మాజీ సీఎం ఉద్ధవ్ థాకరే (Uddhav Thackeray) ఆగ్రహం వ్యక్తం చేశారు. సావర్కర్ తమ దేవుడని, ఆయనను ఇలా అవమానిస్తూ పోతుంటే మహారాష్ట్ర విపక్ష కూటమిలో చీలికలు వస్తాయని పరోక్షంగా రాహుల్‌ను హెచ్చరించారు. మహారాష్ట్రలో కాంగ్రెస్, శివసేన ఉద్ధవ్ వర్గం, ఎన్‌సీపీ మహాకూటమిగా ఉన్నాయి.

''రాహుల్‌కు ఒక మాట చెప్పదలచుకున్నాను. మనం కలిసి పనిచేస్తున్నాం. ప్రజాస్వామ్యం, రాజ్యాంగ పరిరక్ష కోసం మనమంతా కలిసి ఉన్నాం. భారత్ జోడా యాత్రలోనూ మీ వెంట ఉన్నాం. వాళ్లు (బీజేపీ) మిమ్మల్ని రెచ్చగొడుతూనే ఉంటారు. మనం కూడా అదుపుతప్పితే దేశం నియంతృత్వంలోకి వెళ్లిపోతుంది. సావర్కర్‌ని మా దేవుడిలా భావిస్తాం. ఆయనను అవమానించడం మానుకోవాలి. లేదంటే సహించమని స్పష్టంగా చెప్పదలచుకున్నాను'' అని థాకరే అన్నారు.

'సామ్నా' సంపాదకీయంలోనూ..

సావర్కర్‌పై రాహుల్ గాంధీ వ్యాఖ్యలను శివసేన పార్టీ పత్రిక 'సామ్నా' సైతం తమ సంపాదకీయంలో ఖండించింది. ''పరువునష్టం కేసులో రాహుల్ గాంధీకి అన్యాయం జరిగింది. కానీ సావర్కర్‌ను అవమానించడం ద్వారా సత్యంపై పోరాటంలో ఆయన విజయం సాధించలేరు. దేశం కోసం తమ జీవితాలను త్యాగం చేసిన కుటుంబంలో రాహుల్ పుట్టారు. అది నిజం. సావర్కర్, ఆయన కుటుంబ సభ్యులు సైతం దేశం కోసం పనిచేశారు. సావర్కర్‌ను అవమానించడం వల్ల రాహుల్‌పై సానుభూతి తగ్గిపోతుంది'' అని ఆ సంపాదకీయం పేర్కొంది.

రాహుల్ స్టేట్‌మెంట్ కరెక్ట్ కాదు: సంజయ్ రౌత్

నేను సావర్కర్‌ని కాదు, క్షమాపణ చెప్పనంటూ రాహుల్ ఇచ్చిన స్టేట్‌మెంట్ సరైనది కాదని శివసేన ఉద్ధవ్ థాకరే వర్గం ఎంపీ సోమవారంనాడు మీడియాతో మాట్లాడుతూ అన్నారు. ''ఆయన గాంధీనే. కానీ సావర్కర్ పేరును ఇందులోకి లాగవలసిన అవసరం లేదు. సావర్కర్ మాకు స్ఫూర్తి. మా పోరాటాల వెనుక ఛత్రపతి శివాజీ, వీర సావర్కర్ స్ఫూర్తి ఉంది'' అని అన్నారు.

Updated Date - 2023-03-27T15:20:32+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising