ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Amit Shah : రిజర్వేషన్లకు మత ప్రాతిపదిక... అమిత్ షా సంచలన వ్యాఖ్యలు...

ABN, First Publish Date - 2023-03-26T16:03:24+05:30

కర్ణాటక కేబినెట్ సమావేశం శుక్రవారం జరిగింది. ఓబీసీ కోటాలో ముస్లింలకు కల్పిస్తున్న 4 శాతం రిజర్వేషన్లను రద్దు చేయాలని నిర్ణయించింది.

Amit Shah
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ప్రవేశం ఉచితం. సం|| 9393 763 666

బెంగళూరు : మత ప్రాతిపదికపై రిజర్వేషన్లు కల్పించాలనే నిబంధన భారత రాజ్యాంగంలో లేదని కేంద్ర హోం మంత్రి, బీజేపీ నేత అమిత్ షా (Amit Shah) చెప్పారు. ‘గరోటా షహీద్ స్మారక్’ను సర్దార్ వల్లభ్ భాయ్ పటేల్ విగ్రహాన్ని ఆయన ఆదివారం ప్రారంభించారు. అదేవిధంగా 103 అడుగుల ఎత్తయిన జాతీయ జెండాను ఆవిష్కరించారు.

కర్ణాటక శాసన సభ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో అమిత్ షా ఆదివారం ఓ బహిరంగ సభలో మాట్లాడారు. మైనారిటీలకు కల్పిస్తున్న రిజర్వేషన్లు భారత రాజ్యాంగం ప్రకారం కల్పిస్తున్నవి కాదన్నారు. మత ప్రాతిపదికన రిజర్వేషన్లు కల్పించాలని తెలిపే నిబంధన రాజ్యాంగంలో లేదన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం పోలరైజేషన్ పాలిటిక్స్ కోసం మైనారిటీలకు రిజర్వేషన్లు ఇచ్చిందన్నారు. ఆ రిజర్వేషన్లను బీజేపీ రద్దు చేసిందని, ఆ కోటాను వొక్కళిగలకు, లింగాయత్‌లకు ఇచ్చిందని చెప్పారు. ఓటు బ్యాంకు కోసం దురాశతో కాంగ్రెస్ ఎన్నడూ స్వాతంత్ర్య సమర యోధులను స్మరించుకునే కార్యక్రమాలను నిర్వహించలేదన్నారు. అదేవిధంగా హైదరాబాద్ విముక్తి దినోత్సవాలను కూడా నిర్వహించలేదన్నారు.

హైదరాబాద్ విముక్తి, స్వాతంత్ర్యం కోసం అనేక మంది ప్రాణత్యాగం చేశారని చెప్పారు. సర్దార్ పటేల్ లేకపోతే హైదరాబాద్‌కు స్వాతంత్ర్యం వచ్చి ఉండేది కాదన్నారు. బీదర్‌కు కూడా స్వాతంత్ర్యం వచ్చి ఉండేది కాదన్నారు. గరోటా గ్రామస్థుల త్యాగాలను ప్రశంసించారు. 2.5 అడుగుల ఎత్తయిన త్రివర్ణ పతాకాన్ని ఎగురవేసినందుకు క్రూరుడైన నిజామ్ సైన్యం గరోటా గ్రామస్థులను హత్య చేసిందని ఆవేదన వ్యక్తం చేశారు. అదే గ్రామంలో ఆ అమర వీరుల స్మారకాన్ని నిర్మించామన్నారు. కేవలం త్రివర్ణ పతాకాన్ని ఎగురవేసినందుకు వందలాది మందిని హత్య చేశారన్నారు. అదే గడ్డపైన మనం 103 అడుగుల ఎత్తయిన త్రివర్ణ పతాకాన్ని ఎగురవేయడం గర్వకారణమని చెప్పారు. ఇది ఎవరి దృష్టినీ తప్పించుకోదన్నారు. హైదరాబాద్ నుంచి నిజాం పాలకుడిని తప్పించడంలో మన దేశ తొలి హోం మంత్రి సర్దార్ పటేల్ పోషించిన పాత్రకు గుర్తుగా ఆయన విగ్రహాన్ని ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఆయన పోషించిన పాత్ర వల్లే బీదర్ భారత దేశంలో అంతర్భాగం అయిందన్నారు.

కాగా కర్ణాటక కేబినెట్ సమావేశం శుక్రవారం జరిగింది. ఓబీసీ కోటాలో ముస్లింలకు కల్పిస్తున్న 4 శాతం రిజర్వేషన్లను రద్దు చేయాలని నిర్ణయించింది. ఈ నాలుగు శాతంలో రెండు శాతం రిజర్వేషన్లను వీరశైవ-లింగాయత్‌లకు, మరో రెండు శాతం రిజర్వేషన్లను వొక్కళిగ సామాజిక వర్గానికి పంపిణీ చేసింది. ఓబీసీ ముస్లింలను ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు కల్పిస్తున్న 10 శాతం రిజర్వేషన్ల కేటగిరీలోకి పంపించింది.

ఇవి కూడా చదవండి :

Hyper loop: చెన్నై-బెంగళూరు మధ్య హైపర్ లూప్?

rahul disqualification: దేశవ్యాప్తంగా రోడ్లపైకి కాంగ్రెస్ శ్రేణులు.. ఢిల్లీలో ప్రియాంక, ఖర్గే సహా అగ్రనాయకత్వం..

Updated Date - 2023-03-26T16:06:51+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising