ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

West Bengal : మమత బెనర్జీ హిందూ వ్యతిరేకి : కేంద్ర మంత్రి

ABN, First Publish Date - 2023-04-02T14:04:51+05:30

పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, టీఎంసీ అధినేత్రి మమత బెనర్జీ (Mamata Banerjee)పై కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్

Anurag Thakur, Mamata Banerjee
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ప్రవేశం ఉచితం. సం|| 9393 763 666

న్యూఢిల్లీ : పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, టీఎంసీ అధినేత్రి మమత బెనర్జీ (Mamata Banerjee)పై కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ (Union minister Anurag Thakur) విరుచుకుపడ్డారు. ఆ రాష్ట్రంలో రామ భక్తులపై దాడులు జరుగుతున్నాయని ఆరోపించారు. రాష్ట్రంలో ఉద్రిక్తతలను ఆమె ప్రోత్సహిస్తున్నారని దుయ్యబట్టారు.

పశ్చిమ బెంగాల్‌లోని హౌరాలో శ్రీరామ నవమి సందర్భంగా జరిగిన శోభాయాత్రపై దాడులు జరిగాయి. పెద్ద ఎత్తున హింసాకాండ జరిగింది. రాజు ఝా అనే బీజేపీ కార్యకర్త శనివారం హత్యకు గురయ్యారు.

ఈ నేపథ్యంలో అనురాగ్ ఠాకూర్ ఓ వార్తా సంస్థతో మాట్లాడుతూ, మమత బెనర్జీ ఓ వర్గానికి కొమ్ముకాస్తున్నారని, ఆమె హిందూ వ్యతిరేకి అని మండిపడ్డారు. పశ్చిమ బెంగాల్‌లో రామభక్తులపై దాడులు జరుగుతున్నాయన్నారు. రామ భక్తులపై రాళ్లు, బాంబులు విసురుతున్నారన్నారు. వారిని లాఠీలతో కొడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. శ్రీరామ నవమి శోభాయాత్రను బలవంతంగా నిలిపివేయించారని ఆవేదన వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి మమత బెనర్జీ ఏ స్థాయిలో పక్షపాతంతో వ్యవహరిస్తున్నారో స్పష్టంగా చూడవచ్చునన్నారు. ఆమె హిందూ వ్యతిరేకి అని స్పష్టమవుతోందన్నారు. హిందువులపై దాడులు జరుగుతూ ఉంటే మమత మౌన ప్రేక్షకురాలిగా మిగిలిపోయారన్నారు. ఆమె నిద్రపోతున్నారని దుయ్యబట్టారు. ఓ వర్గానికి ఆమె భద్రత కల్పిస్తున్నారన్నారు. ఆమె హిందువులపై హింసను రెచ్చగొడుతున్నారన్నారు.

ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ (Nitish Kumar) నేతృత్వంలోని బిహార్ ప్రభుత్వంపై కూడా అనురాగ్ ఠాకూర్ తీవ్ర విమర్శలు గుప్పించారు. బిహార్‌లో ఆటవిక పాలన జరుగుతోందన్నారు. లాలూ ప్రసాద్ యాదవ్ హయాంలో ఉన్న ఈ ఆటవిక పాలన ప్రస్తుతం నితీశ్, తేజస్విల ప్రభుత్వంలో మళ్లీ వచ్చిందన్నారు.

శ్రీరామ నవమి శోభాయాత్ర సందర్భంగా హౌరాలో జరిగిన ఘర్షణల్లో అనేక వాహనాలు ధ్వంసమయ్యాయి. దీనికి సంబంధించిన కేసుల్లో 38 మందిని అరెస్టు చేశామని పోలీసులు శనివారం చెప్పారు. బిహార్‌లోని నలంద, సాసారామ్ జల్లాల్లో శ్రీరామ నవమి శోభా యాత్ర సందర్భంగా హింస జరిగిన సంగతి తెలిసిందే.

ఇవి కూడా చదవండి :

Modi Vs Sibal : మోదీ ‘సుపారీ’ ఆరోపణలపై కపిల్ సిబల్ అనూహ్య స్పందన

Modi Surname Case : జైలుకెళ్లేందుకు రాహుల్ గాంధీ సిద్ధమేనా?.. కాంగ్రెస్ వర్గాల కీలక సంకేతాలు..

Updated Date - 2023-04-02T14:04:51+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising