ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Anurag Thakur: కింగ్‌పిన్ కూడా జైలుకు వెళ్తారు.. అరవింద్ కేజ్రివాల్‌ను పరోక్షంగా హెచ్చరించిన అనురాగ్ ఠాకూర్

ABN, First Publish Date - 2023-10-05T15:40:45+05:30

ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో ‘కింగ్ పిన్’ ప్రస్తుతం బయటే ఉన్నారని, త్వరలోనే ఆయన కూడా జైలుకు వెళ్తారని కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్.. సీఎం అరవింద్ కేజ్రీవాల్ ను ఉద్దేశించి అన్నారు. కేజ్రీవాల్ నిజాయితీ సర్టిఫికెట్ ఇచ్చిన వారంతా ప్రస్తుతం జైలులోనే ఉన్నారని ఎద్దేవా చేశారు. లిక్కర్ స్కామ్‌లో(Delhi Liquor Scam) ఆమ్ ఆద్మీ పార్టీ(AAP) ఎంపీ సంజయ్ సింగ్ అరెస్టయిన తరువాత కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్(Anurag Thakur) కేజ్రివాల్ సర్కార్‌పై విరుచుకుపడ్డారు.

ఢిల్లీ: ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో ‘కింగ్ పిన్’ ప్రస్తుతం బయటే ఉన్నారని, త్వరలోనే ఆయన కూడా జైలుకు వెళ్తారని కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్.. సీఎం అరవింద్ కేజ్రీవాల్ ను ఉద్దేశించి అన్నారు. కేజ్రీవాల్ నిజాయితీ సర్టిఫికెట్ ఇచ్చిన వారంతా ప్రస్తుతం జైలులోనే ఉన్నారని ఎద్దేవా చేశారు. లిక్కర్ స్కామ్‌లో(Delhi Liquor Scam) ఆమ్ ఆద్మీ పార్టీ(AAP) ఎంపీ సంజయ్ సింగ్ అరెస్టయిన తరువాత కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్(Anurag Thakur) కేజ్రివాల్ సర్కార్‌పై విరుచుకుపడ్డారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. అవినీతికి వ్యతిరేకంగా తమ పార్టీ పోరాడుతుందని చెప్పిన ఆప్ స్వయంగా అవినీతి ఊబిలో కూరుకుపోయిందని విమర్శించారు.


ఆప్ నేతల అరెస్టులను వ్యతిరేకిస్తూ సీఎం అరవింద్ కేజ్రీవాల్(Arvind Kejrival) ప్రధాని మోదీపై పలు ఆరోపణలు చేశారు. ఈ ఆరోపణలపై స్పందించిన ఠాకూర్.. కేజ్రివాల్ మాటల్ని విని ప్రజలు నవ్వుకుంటున్నారని, ఆయన కళ్లలో భయం కనిపిస్తోందని అన్నారు. ఆప్ నేతలు మనీష్ సిసోడియా, సత్యేందర్ జైన్ ఇప్పటికే జైలు శిక్ష అనుభవిస్తున్నారు. పంజాబ్(Punjab) లో ఆప్ అధికారంలోకి వచ్చిన రెండు నెలల్లో అవినీతి ఆరోపణలతో ఆ రాష్ట్ర ఆరోగ్య మంత్రి పదవి నుంచి తొలగిపోయారని ఠాకూర్ ఎద్దేశా చేశారు. మద్యం కుంభకోణం కేసులో తన ప్రమేయంపై కేజ్రివాల్ ఇప్పటివరకు వివరణ ఇవ్వలేదని అన్నారు. ఈ కేసులో ఇంకా దర్యాప్తు కొనసాగుతోందని అక్రమార్కులను విడిచిపెట్టేది లేదని స్పష్టం చేశారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో అవినీతి రాజ్యమేలుతోందని ఆయన మండిపడ్డారు.

Updated Date - 2023-10-05T15:44:57+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising