PM Modi: 50 శాతానికి పైగా ప్రజల అశీస్సులతో మోదీ మూడో సారి గెలుస్తారు: కేంద్ర మంత్రి
ABN, Publish Date - Dec 25 , 2023 | 09:00 AM
రాబోయే లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ విజయం సాధించడంపై కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ఆత్మవిశ్వాసం వ్యక్తం చేశారు. దేశంలోని 50 శాతానికిపైగా ప్రజల అశీర్వాదంతో ప్రధాని మోదీ విజయం సాధిస్తారని ఆయన అన్నారు.
రాబోయే లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ విజయం సాధించడంపై కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ఆత్మవిశ్వాసం వ్యక్తం చేశారు. దేశంలోని 50 శాతానికిపైగా ప్రజల అశీర్వాదంతో ప్రధాని మోదీ విజయం సాధిస్తారని ఆయన అన్నారు. ఒడిషాలోని అంగుల్ జిల్లాలో ఏర్పాటు చేసిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న ధర్మేంద్ర ప్రధాన్ 'విక్షిత్ భారత్ సంకల్ప్ యాత్ర' లబ్ధిదారులతో సంభాషించారు. "ప్రజలు చాలా ఉత్సాహంగా ఉన్నారు. రైతుల క్రెడిట్ కార్డ్, ఉజ్వల యోజనలో మరిన్ని గ్యాస్ కనెక్షన్లు, ఇల్లు లేని పేదలకు ఇల్లు ఇస్తామని ఇచ్చిన హామీలపై ప్రజలకు నమ్మకం ఉంది. దేశంలోని 50 శాతానికి పైగా ప్రజల ఆశీర్వాదంతో నరేంద్ర మోదీ మూడో సారి ప్రధాని అవుతారు" అని ధర్మేంద్ర ప్రధాన్ చెప్పారు. కాగా రెండు రోజుల బీజేపీ జాతీయ సమావేశం శనివారంతో ముగిసింది. ఈ సమావేశంలో 2024 లోక్‌సభ ఎన్నికల్లో 50 శాతం ఓట్లను సాధించాలని బీజేపీ లక్ష్యంగా పెట్టుకుంది.
దీంతో పాటు కొత్త ఓటర్లతో అనుసంధానం అయ్యేందుకు పార్టీ దేశవ్యాప్తంగా ప్రచారాన్ని నిర్వహించనుంది. ఇందులో భాగంగా బూత్ స్థాయిలో బీజేపీ కార్యక్రమాలు నిర్వహించనుంది. దేశవ్యాప్తంగా ఉన్న లోక్‌సభలను క్లస్టర్లుగా విభజించి సమావేశాలు నిర్వహించనున్నారు. ఇందులో భాగంగా ప్రధాని నరేంద్ర మోదీ, హోంమంత్రి అమిత్ షా, రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా బహిరంగ సభల్లో పాల్గొని ప్రసంగిస్తారు. జనవరి 24న యువమోర్చా నూతన ఓటరు సదస్సులను ప్రారంభించనుంది. బీజేపీ యువమోర్చా దేశవ్యాప్తంగా 5,000 సదస్సులు నిర్వహించనుంది. దీంతో పాటు దేశవ్యాప్తంగా సామాజిక సదస్సులు కూడా నిర్వహించనున్నారు. వచ్చే ఏడాది లోక్‌సభ ఎన్నికల్లో మైనారిటీల ఓట్లను పొందాలని బీజేపీ లక్ష్యంగా పెట్టుకుంది. దీంతో బీజేపీ మైనారిటీ ఔట్రీచ్ కార్యక్రమాన్ని ప్రారంభించనుంది.
Updated Date - Dec 25 , 2023 | 09:00 AM