Manipur : మణిపూర్‌లో ఆగని హింసాకాండ.. కేంద్ర మంత్రి ఇంటిపై దాడి, దహనం..
ABN, First Publish Date - 2023-06-16T09:19:20+05:30
మణిపూర్‌లో హింసాకాండ ఆగడం లేదు. కేంద్ర హోం మంత్రి అమిత్ షా (Amit Shah) స్వయంగా రంగంలోకి దిగి అన్ని వర్గాలతో చర్చలు జరిపినప్పటికీ నిరసనకారులు వెనుకంజ వేయడం లేదు. తాజాగా గురువారం విదేశీ వ్యవహారాల శాఖ సహాయ మంత్రి ఆర్‌కే రంజన్ సింగ్ (RK Ranjan Singh) నివాసంపై దాడి చేసి, దహనం చేశారు.
న్యూఢిల్లీ : మణిపూర్‌లో హింసాకాండ ఆగడం లేదు. కేంద్ర హోం మంత్రి అమిత్ షా (Amit Shah) స్వయంగా రంగంలోకి దిగి అన్ని వర్గాలతో చర్చలు జరిపినప్పటికీ నిరసనకారులు వెనుకంజ వేయడం లేదు. తాజాగా గురువారం విదేశీ వ్యవహారాల శాఖ సహాయ మంత్రి ఆర్‌కే రంజన్ సింగ్ (RK Ranjan Singh) నివాసంపై దాడి చేసి, దహనం చేశారు.
మణిపూర్ ప్రభుత్వం విడుదల చేసిన ప్రకటనలో తెలిపిన వివరాల ప్రకారం, గురువారం రాత్రి ఇంఫాల్‌లోని కొంగ్బాలో ఉన్న కేంద్ర మంత్రి రంజన్ సింగ్ నివాసంపై నిరసనకారులు దాడి చేశారు. ఇంఫాల్‌లో ఘర్షణలు చెలరేగడంతో రెండు ఇళ్లను తగులబెట్టారు. భద్రతా దళాలు, నిరసనకారుల మధ్య బుధవారం జరిగిన ఘర్షణల్లో తొమ్మిది మంది ప్రాణాలు కోల్పోయారు, 10 మంది గాయపడ్డారు.
ముఖ్యమంత్రి ఎన్ బిరేన్ సింగ్ గురువారం మీడియాతో మాట్లాడుతూ, వివిధ స్థాయుల్లో ప్రభుత్వం చర్చలు జరుపుతోందన్నారు. హింసాకాండకు బాధ్యులైనవారిపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. సమస్యను పరిష్కరించాలనే నిబద్ధత తమకు ఉందన్నారు. తాము ప్రతి ఒక్కరితోనూ మాట్లాడుతున్నామని చెప్పారు. గవర్నర్ శాంతి కమిటీని ఏర్పాటు చేశారని చెప్పారు. శాంతి కమిటీ సభ్యులతో చర్చలు, సంప్రదింపులు త్వరలోనే ప్రారంభమవుతాయన్నారు. రాష్ట్ర ప్రజల మద్దతు, సహకారంతో త్వరలోనే శాంతిని సాధిస్తామన్నారు. పరిస్థితి అకస్మాత్తుగా మెరుగుపడటం సులువు కాదని, అయితే హింసాత్మక సంఘటనలు క్రమంగా తగ్గుతున్నాయని చెప్పారు. గృహ దహనాలు జరుగుతున్నాయని, నిందితులను పట్టుకోవడానికి కూంబింగ్ ఆపరేషన్ జరుగుతోందని తెలిపారు. చట్ట ప్రకారం నిందితులను పట్టుకుంటామని, తగిన చర్యలు తీసుకుంటామని ప్రజలకు హామీ ఇస్తున్నానని తెలిపారు.
మెయిటీ తెగవారు తమను షెడ్యూల్డు తెగల జాబితాలో చేర్చాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ డిమాండ్‌ను పరిశీలించాలని రాష్ట్ర ప్రభుత్వానికి మణిపూర్ హైకోర్టు తెలిపింది. దీంతో ఆల్ ట్రైబల్ స్టూడెంట్స్ యూనియన్ మే 3 నుంచి ఆందోళన, నిరసన కార్యక్రమాలను నిర్వహిస్తోంది.
ఇవి కూడా చదవండి :
Reservation fight : మణిపూర్ మంటల వెనుక.. మీటీ, కుకీ తెగల మధ్య రిజర్వేషన్ పోరు
14న హాజరు కావాల్సిందే.. బీజేపీ రాష్ట్ర చీఫ్‌కు కోర్టు ఆదేశం
Updated Date - 2023-06-16T09:19:20+05:30 IST