Tejashwi Vs RK Singh : తేజస్వి యాదవ్‌పై కేంద్ర మంత్రి ఆగ్రహం
ABN, First Publish Date - 2023-04-17T20:23:14+05:30
ఉత్తర ప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌లో గ్యాంగ్‌స్టర్, మాజీ ఎంపీ అతిక్ అహ్మద్హ త్యపై ప్రతిపక్షాలు స్పందిస్తున్న తీరును కేంద్ర మంత్రి
న్యూఢిల్లీ : ఉత్తర ప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌లో గ్యాంగ్‌స్టర్, మాజీ ఎంపీ అతిక్ అహ్మద్ (Atiq Ahmad) హత్యపై ప్రతిపక్షాలు స్పందిస్తున్న తీరును కేంద్ర మంత్రి ఆర్‌కే సింగ్ (Union minister RK Singh) తీవ్రంగా ఖండించారు. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమత బెనర్జీ, సమాజ్‌వాదీ పార్టీ చీఫ్ అఖిలేశ్ యాదవ్, ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్ వంటివారు ఓటు బ్యాంకు రాజకీయాల కోసం పాకులాడుతున్నారని వ్యాఖ్యానించారు.
ఉత్తరప్రదేశ్ (Uttar Pradesh)లోని ప్రయాగ్‌రాజ్ (Prayagraj)లో గ్యాంగ్‌స్టర్ అతీక్ అహ్మద్ (Atiq Ahmed), అతడి సోదరుడు అష్రఫ్ అహ్మద్ (Ashraf)లను శనివారం రాత్రి ముగ్గురు దుండగులు హత్య చేసిన సంగతి తెలిసిందే. దీనిపై బిహార్ ఉప ముఖ్యమంత్రి, ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్ (Bihar Deputy Chief Minister Tejashwi Yadav) స్పందిస్తూ, నేరాలను చట్టబద్ధంగా నిర్మూలించాలని, అయితే అతిక్, అష్రఫ్‌ల శవయాత్ర ఉత్తర ప్రదేశ్‌లో చట్టానికి అంతిమ యాత్ర అని ఆరోపించారు.
పశ్చిమ బెంగాల్ సీఎం, టీఎంసీ చీఫ్ మమత బెనర్జీ (West Bengal Chief Minister Mamata Banerjee) సోమవారం స్పందిస్తూ, ఉత్తర ప్రదేశ్‌లో ఎన్‌కౌంటర్లు సాధారణ విషయంగా మారిపోయాయని వ్యాఖ్యానించారు. పశ్చిమ బెంగాల్‌లో ఏం జరిగినా కేంద్ర ప్రభుత్వం వెంటనే కేంద్ర దర్యాప్తు సంస్థలను పంపిస్తుందన్నారు. బీజేపీది డబుల్ ఇంజిన్, ద్వంద్వ ప్రమాణాలు అని దుయ్యబట్టారు. ఎన్‌కౌంటర్లపై నిరసన తెలపాలని ఉత్తర ప్రదేశ్ ప్రజలకు పిలుపునిచ్చారు.
ఈ నేపథ్యంలో కేంద్ర మంత్రి ఆర్‌కే సింగ్ ఓ వార్తా సంస్థతో మాట్లాడుతూ, తేజస్వి యాదవ్ బిహార్ ఉప ముఖ్యమంత్రి పదవిని నిర్వహిస్తున్నారని, ఆయన అతిక్ అహ్మద్‌ను ‘అతిక్ గారు’ అంటూ సంబోధించారని మండిపడ్డారు. అతిక్ అనేక హత్యలు, అపహరణలు, దోపిడీల కేసుల్లో నిందితుడని తెలిపారు. తనకు వ్యతిరేకంగా సాక్ష్యం చెప్పాలనుకునేవారిని అతిక్ చంపేసేవాడన్నారు. లష్కరే తొయిబా ఉగ్రవాద సంస్థతో తనకు సంబంధాలు ఉన్నాయని అతిక్ అంగీకరించాడన్నారు. ఓ నేరస్థుడు గ్యాంగ్ వార్‌లో చనిపోయాడన్నారు. సమాజ్‌వాదీ పార్టీ అయినా, మమత బెనర్జీ అయినా ఓటు బ్యాంకు రాజకీయాల కోసం పాకులాడుతున్నారని దుయ్యబట్టారు. అందుకే వారు కన్నీరు కార్చుతున్నారన్నారు.
అతీక్, అష్రఫ్‌ల హత్యపై దర్యాప్తునకు యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ (Yogi Adityanath) ముగ్గురు సభ్యులతో జ్యుడీషియల్ కమిటీని, సిట్‌ను నియమించారు. డీజీపీ నుంచి ఎప్పటికప్పుడు తాజా పరిస్థితులను తెలుసుకుంటున్నారు. అవాంఛనీయ సంఘటనలు జరగకుండా రాష్ట్ర వ్యాప్తంగా అప్రమత్తత ప్రకటించారు. యూపీలోని అన్ని జిల్లాల్లో ప్రస్తుతం 144 సెక్షన్ కొనసాగుతోంది. ప్రయాగ్‌రాజ్‌లో ఇంటర్‌నెట్ సర్వీసులు నిలిపివేశారు. పోలీసులు ఫ్లాగ్ మార్చ్ నిర్వహిస్తున్నారు.
ఇవి కూడా చదవండి :
Same-sex marriage : స్వలింగ వివాహాలపై పిటిషన్లను తోసిపుచ్చండి.. సుప్రీంకోర్టును కోరిన కేంద్రం..
PM Modi : కుల గణనపై మోదీకి ఖర్గే లేఖ
Updated Date - 2023-04-17T20:23:14+05:30 IST