ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Vande Metro: ‘వందే భారత్’ మాత్రమే కాదు ‘వందే మెట్రో’ రైళ్లు కూడా వచ్చేస్తున్నాయ్.. ఎప్పటి నుంచంటే..

ABN, First Publish Date - 2023-04-14T22:40:54+05:30

దేశంలోని పలు మార్గాల్లో ‘వందే భారత్’ రైళ్లను ఇప్పటికే అందుబాటులోకి తీసుకొచ్చిన భారతీయ రైల్వే శాఖ తాజాగా మరో ప్రతిపాదనతో దేశ ప్రజలకు..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ప్రవేశం ఉచితం. సం|| 9393 763 666

న్యూఢిల్లీ: దేశంలోని పలు మార్గాల్లో ‘వందే భారత్’ రైళ్లను (Vande Bharat Trains) ఇప్పటికే అందుబాటులోకి తీసుకొచ్చిన భారతీయ రైల్వే శాఖ (Indian Railways) తాజాగా మరో కీలక నిర్ణయంతో దేశ ప్రజలకు సరికొత్త ప్రయాణ అనుభూతిని పంచేందుకు సిద్ధమైంది. దేశంలో వచ్చే డిసెంబర్ నాటికి ‘వందే మెట్రో’ రైళ్లను (Vande Metro Trains) అందుబాటులోకి తీసుకురావాలని భావిస్తున్నట్లు రైల్వే శాఖా మంత్రి అశ్విన్ వైష్టవ్ వెల్లడించారు. దేశంలోని పలు మార్గాల్లో ‘వందే భారత్’ ఎక్స్‌ప్రెస్ రైళ్లు విజయవంతంగా రాకపోకలు సాగిస్తుండటంతో ‘వందే మెట్రో’ రైళ్లను తీసుకురావాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తోంది. దేశంలో తక్కువ దూరంలో ఉండే నగరాల మధ్య (వంద కిలోమీటర్ల దూరంలో ఉండే నగరాల మధ్య) ప్రయాణ సమయాన్ని తగ్గించడమే లక్ష్యంగా ఈ ‘వందే మెట్రో’ రైళ్లను తీసుకురావాలని కేంద్ర ప్రభుత్వం యోచిస్తున్నట్లు తెలిసింది.

చాలా ఎక్కువ ఫ్రీక్వెన్సీతో ఈ రైళ్లు నగరాల మధ్య పరుగులు తీయనున్నాయి. 100 కిలోమీటర్ల దూరంలో ఉండే నగరాల మధ్య రోజుకు 4 లేదా 5 సార్లు ఈ ‘వందే మెట్రో’ రైళ్లను నడపాలని నిర్ణయించామని, డిసెంబర్ నాటికి ఈ రైళ్లు అందుబాటులోకి తీసుకురావాలని భావిస్తున్నామని రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ వెల్లడించారు. ‘వందే భారత్’ ఎక్స్‌ప్రెస్ రైళ్లు 500 కిలోమీటర్ల దూరాన్ని కవర్ చేస్తూ దేశంలోని పలు మార్గాల్లో రాకపోకలు సాగిస్తున్న సంగతి తెలిసిందే. ‘వందే మెట్రో’ రైళ్లకు సంబంధించిన ట్రయల్ రన్ కూడా త్వరలో చేయనున్నారు.

ఈ ‘వందే మెట్రో’ రైళ్లు అందుబాటులోకి రావడం వల్ల ఉద్యోగాన్వేషణలో ఆ నగరం నుంచి ఈ నగరానికి అన్నట్టుగా రాకపోకలు సాగించే వారికి, విద్యార్థులకు ప్రయాణ సమయం తగ్గి ఊరట లభించే అవకాశం ఉంది. దీంతో పాటు లోకల్ ట్రైన్స్‌లో ఉండే రద్దీ కాస్తంత తగ్గే అవకాశమూ లేకపోలేదు. 8 కోచ్‌లతో ఈ ‘వందే మెట్రో’ రైళ్లు నడవనున్నాయి. చెన్నై, లక్నో నగరాల్లోని కోచ్ ఫ్యాక్టరీల్లో ఇప్పటికే ఇందుకు సంబంధించిన బోగీలు తయారవుతున్నాయి. ‘వందే మెట్రో’ తొలి రైలు ఉత్తరప్రదేశ్‌లోని ప్రధాన నగరాలైన లక్నో, కాన్పూర్ మధ్య అందుబాటులోకి తీసుకొచ్చే యోచనలో రైల్వే శాఖ ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. ఈ రెండు నగరాల మధ్య దూరం 90 కిలోమీటర్లు కావడం గమనార్హం.

Updated Date - 2023-04-14T22:41:03+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising