ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

'Vandebharat' train: ‘వందేభారత్‌’ రైలు వచ్చేస్తోంది.. ఎక్కడినుంచి ఎక్కడివరకంటే..

ABN, First Publish Date - 2023-08-02T10:20:42+05:30

చెన్నై - తిరునల్వేలి(Chennai - Tirunelveli) మధ్య ‘వందేభారత్‌’ సెమి హైస్పీడ్‌ రైలు(Semi High Speed Train) ఆలస్యంగా పరుగులుతీసే అవకాశం కనిపి

చెన్నై, (ఆంధ్రజ్యోతి): చెన్నై - తిరునల్వేలి(Chennai - Tirunelveli) మధ్య ‘వందేభారత్‌’ సెమి హైస్పీడ్‌ రైలు(Semi High Speed Train) ఆలస్యంగా పరుగులుతీసే అవకాశం కనిపిస్తోంది. నిజానికి ఈ నెల 6వ తేదీన ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఈ రైలును లాంఛనంగా ప్రారంభించాల్సివుంది. కానీ అనివార్య కారణాల వల్ల ఈ సర్వీసు నవంబరులో ప్రారంభమయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. కాగా దేశంమొత్తమ్మీద ఇది 26వ వందేభారత్‌ రైలు. 8 బోగీలు కలిగిన ఈ రైలు ఉదయం తిరునల్వేలిలో బయలుదేరి మధ్యాహ్నానికి ఎగ్మూరు చేరుకుంటుంది. మొత్తం 650 కి.మీ దూరాన్ని 8 గంటల్లో అధిగమించనుంది. నిజానికి ప్రస్తుతమున్న నెల్లై ఎక్స్‌ప్రెస్‌, కన్నియాకుమారి ఎక్స్‌ప్రెస్‌(Kanniyakumari Express)లు చెన్నై - తిరునల్వేలి మధ్య సుమారు 11 గంటల మేర ప్రయాణించాల్సి వస్తోంది. అయితే వందేభారత్‌తో ఈ గమ్యాన్ని 8 గంటల్లోనే చేరుకోవచ్చని అధికారులు తెలిపారు. కాగా పూర్తి వివరాలు త్వరలోనే దక్షిణరైల్వే ప్రకటించనుంది. ఇదిలా వుండగా ఈ రైలు తమిళనాడు(Tamil Nadu) నుంచి సంచరించే మూడో వందేభారత్‌ రైలు కావడం విశేషం. ఇప్పటికే గత నవంబరు 22వ తేదీన చెన్నై - మైసూర్‌ మధ్య, గత ఏప్రిల్‌ 18న చెన్నై - కోయంబత్తూరు మధ్య వందేభారత్‌ రైళ్లు ప్రారంభమైన విషయం తెలిసిందే.

Updated Date - 2023-08-02T10:20:42+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising