ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Venkaiah Naidu: ఆరోగ్య సూత్రాలు పాటించి ఆయుష్షు పెంచుకోండి

ABN, First Publish Date - 2023-03-12T08:50:53+05:30

ఆరోగ్య సూత్రాలను తప్పకుండా పాటించి ఆయుష్షు పెంచుకోవాలని మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు ప్రజలకు ..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ప్రవేశం ఉచితం. సం|| 9393 763 666

చెన్నై/ప్యారీస్‌: ఆరోగ్య సూత్రాలను తప్పకుండా పాటించి ఆయుష్షు పెంచుకోవాలని మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు ప్రజలకు పిలుపునిచ్చారు. స్థానిక మైలాపూర్‌లోని మ్యూజిక్‌ అకాడమీ ఆడిటోరియంలో శనివారం సాయంత్రం ఫౌండేషన్‌ సిల్వర్‌ జూబ్లీ వేడుకలు ఘనంగా నిర్వహించారు. సంస్థ ట్రస్టీ ఆర్‌.సుందర్‌ ఆహ్వానం పలుకగా, చైర్మన్‌ రాజన్‌ రవిచంద్రన్‌ సభకు అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ... 1997లో ప్రారంభించిన హెల్త్‌ ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో మూత్రపిండాల సమస్యలతో బాధపడుతున్న సుమారు 20 వేల మంది రోగులను కిడ్నీ ట్రాన్స్‌ప్లాంట్‌ ఆపరేషన్‌ ద్వారా కాపాడామన్నారు.

1వ తరగతి నుంచి విద్యార్థులకు మూత్ర పరీక్షలు నిర్వహించి, ఆ ఫలితాలు పరిశీలించి వ్యాధి లక్షణాలు తగ్గించేందుకు ప్రభుత్వమే చర్యలు చేపడితే, విద్యార్థుల జీవితం ఆనందంగా ఉంటుందన్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విచ్చేసిన మాజీ రాష్ట్రపతి ఎం.వెంకయ్య నాయుడు, గౌరవ అతిథి సూపర్‌స్టార్‌ రజినీకాంత్‌ ఆరోగ్య సూత్రాలకు సంబంధించి ఐదు పోస్టర్లు ఆవిష్కరించారు. అనంతరం వెంకయ్య నాయుడు మాట్లాడుతూ... రజినీకాంత్‌ గొప్ప నటుడే కాదు, రాజకీయాలు ఆరోగ్యకరం కాదని ఆలోచించి వ్యవహరిస్తున్న సమర్థవంతుడన్నారు. మన పితరులు ఆరోగ్యమే మహాభాగ్యమని చెప్పారని, నేటి ఆధునిక ప్రపంచంలో అలవాట్లు మార్చుకోవడంతో పాటు భారతీయ సంస్కృతిని, మాతృభాషలను మరచిపోరాదన్నారు. మంచి ఆలోచనలు జీవితానికి ఆనందం కలిగిస్తాయన్నారు. అనంతరం రజనీకాంత్‌ మాట్లాడుతూ... వైద్యులు దైవంతో సమానమని, తానిప్పుడు ఈ వేదికపై మాట్లాడుతున్నానంటే సపైన్స్‌ హెల్త్‌ ఫౌండేషన్‌ చైర్మన్‌ డాక్టర్‌ రాజన్‌ రవిచంద్రన్‌ పుణ్యమేనని అన్నారు. ఈ కార్యక్రమంలో డాక్టర్‌ ఎస్‌ఎన్‌ నరసింగన్‌, డాక్టర్‌ అమిత్‌ షా, హాస్యనటుడు మధు బాలాజి తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2023-03-12T08:57:01+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising