ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Viral Video: యమ దూతలుగా వీధి కుక్కలు.. పాపం ఈ చిన్నారి.. ఒళ్లు జలదరించే వీడియో..!

ABN, First Publish Date - 2023-06-20T16:21:01+05:30

9 ఏళ్ల బాలికపై వీధి కుక్కలు విచక్షణారహితంగా దాడి చేశాయి. దీంతో బాలిక తీవ్రంగా గాయపడింది. ఈ ఘటన అంతా సీసీటీవీ పుటేజీలో రికార్డు అవ్వగా.. ఆ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. కేరళలోని కన్నూర్‌లో జాన్వీ అనే తొమ్మిదేళ్ల బాలిక తన ఇంటి పెరట్లో ఆడుకుంటున్న సమయంలో మూడు కుక్కలు ఆమెపై దాడి చేశాయి.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కేరళలో దారుణం చోటు చేసుకుంది. 9 ఏళ్ల బాలికపై వీధి కుక్కలు విచక్షణారహితంగా దాడి చేశాయి. దీంతో బాలిక తీవ్రంగా గాయపడింది. ఈ ఘటన అంతా సీసీటీవీ పుటేజీలో రికార్డు అవ్వగా.. ఆ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. కేరళలోని కన్నూర్‌లో జాన్వీ అనే తొమ్మిదేళ్ల బాలిక తన ఇంటి పెరట్లో ఆడుకుంటున్న సమయంలో మూడు కుక్కలు ఆమెపై దాడి చేశాయి. జాన్వీని నేలపైకి ఈడ్చుకెళ్లిన కుక్కలు విచక్షణారహితంగా దాడిచేశాయి. ప్రాణ భయంతో బాలిక ఆర్తనాదాలు చేయడం వీడియోలో స్పష్టంగా కనిపిస్తోంది.

బాలిక అరుపులను ఏ మాత్రం పట్టించుకోని కుక్కలు చేతులు, కాళ్లు, తలపై పదే పదే కరిచాయి. సహాయం కోసం బాలిక కేకలు వేయడాన్ని గమనించిన చుట్టుపక్కలవారు వెంటనే అక్కడికి చేరుకుని జాన్వీని రక్షించారు. కుక్కల దాడిలో బాలిక తల, పొత్తికడుపు, తొడలు, చేతులపై తీవ్ర గాయాలయ్యాయి. ప్రస్తుతం జాన్వీ ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది. కాగా కేరళలో ఈ తరహా ఘటనలు కొత్తేమి కాదు. కొంతకాలం క్రితం 10వ తరగది చదువుతున్న ఆదిల్ అనే విద్యార్థిపై, జూన్ 11న 10 ఏళ్ల బాలుడిపై కూడా వీధికుక్కలు ఇలాగే దాడి చేసి తీవ్రంగా గాయపరిచాయి.

కాగా చిన్నపిల్లలపై వీధి కుక్కల దాడులు మనకు కూడా కొత్తేమి కాదు. కొంతకాలం క్రితం హైదరాబాద్‌లోని అంబర్‌పేటలో నాలుగేళ్ల ప్రదీప్ అనే చిన్నారిపై వీధి కుక్కలు దాడి చేయడంతో చనిపోయాడు. ఈ ఘటన అప్పట్లో తీవ్ర దుమారం రేపింది. హైదరాబాద్‌లో వీధి కుక్కలను అదుపులో పెట్టలేకపోతున్నారంటూ జీహెచ్‌ఎంసీపై పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి. ప్రముఖ దర్శకుడు రాంగోపాల్ వర్మ సైతం మేయర్‌ విజయలక్ష్మిని సూటిగా ప్రశ్నించారు. వరుస ట్వీట్లతో నిలదీశారు. అలాగే 2022 ఏప్రిల్ నెలలో గోల్కొండ ప్రాంతంలో రెండేళ్ల బాలుడిపై వీధి కుక్కలు దాడి చేయడంతో చనిపోయాడు. అదే ఏడాది మే నెలలో మూసీ నది పక్కన ఆడుకుంటున్న 12 ఏళ్ల బాలుడిపై వీధి కుక్కలు దాడి చేయడంతో చికిత్స పొందుతూ చనిపోయాడు.

Updated Date - 2023-06-20T16:23:44+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising