Viral: రాజస్థాన్ యువకుడికి, పాకిస్థాన్ యువతికి ఆన్‌లైన్‌లో పెళ్లి.. ఇలా ఎందుకు చేసుకోవాల్సి వచ్చిందంటే..?
ABN, First Publish Date - 2023-08-06T13:39:28+05:30
ఈ మధ్య కాలంలో సరిహద్దు ప్రేమ కథలు(Cross-border relationships), పెళ్లిలు ఎక్కువైపోతున్నాయి. ఆన్‌లైన్ పరిచయాలు కాస్త సరిహద్దులు దాటి ఏడు అడుగులు వేసే వరకు వెళ్తున్నాయి. ఇటీవల ఫేస్‌బుక్‌లో పరిచయమైన ప్రేమికుడి కోసం రాజస్థాన్‌కు చెందిన 34 ఏళ్ల వివాహిత అంజు పాకిస్థాన్‌కు వెళ్లిన సంగతి తెలిసిందే.
ఈ మధ్య కాలంలో సరిహద్దు ప్రేమ కథలు(Cross-border relationships), పెళ్లిలు ఎక్కువైపోతున్నాయి. ఆన్‌లైన్ పరిచయాలు కాస్త సరిహద్దులు దాటి ఏడు అడుగులు వేసే వరకు వెళ్తున్నాయి. ఇటీవల ఫేస్‌బుక్‌లో పరిచయమైన ప్రేమికుడి కోసం రాజస్థాన్‌కు చెందిన 34 ఏళ్ల వివాహిత అంజు పాకిస్థాన్‌కు వెళ్లిన సంగతి తెలిసిందే. మరో ఘటనలో 30 ఏళ్ల సీమా హైదర్(Seema Haider) అనే పాకిస్థాన్ మహిళ పబ్జీలో పరిచయమైన ప్రియుడి కోసం భారత్‌కు వచ్చింది. చైనాకు చెందిన ఓ యువతి స్నాప్‌చాట్‌లో పరిచయమైన ప్రేమికుడి కోసం పాకిస్థాన్‌కు వెళ్లింది. అలాంటిదే మరో ఘటన ఇప్పుడు వెలుగులోకి వచ్చింది. కాకపోతే ఇది ప్రేమ వివాహాం కాదు. పెద్దలు కుదర్చిన వివాహం. సరిహద్దులు దాటడానికి వీసా లభించకపోవడంతో పెద్దలే దగ్గరుండి ఏకంగా ఆన్‌లైన్‌లో(virtually married) వివాహం కానిచ్చేశారు. ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
పూర్తి వివవరాల్లోకి వెళ్తే.. పాకిస్థాన్‌లోని(Pakistan) కరాచీకి(Karachi) చెందిన అమీనా(Ameena) అనే యువతికి భారత్‌లోని రాజస్థాన్ రాష్ట్రంలో గల జోధ్‌పూర్(Jodhpur) ప్రాంతానికి చెందిన అర్బాజ్ ఖాన్(Arbaaz Khan) అనే యువకుడికి పెద్దలు వివాహం నిశ్చయించారు. వరుడు అర్బాజ్ ఖాన్ జోధ్‌పూర్‌లో చార్టెట్ అకౌంటెంట్‌గా(chartered accountant) ఉద్యోగం చేస్తున్నాడు. అర్బాజ్ ఖాన్ తరఫు బంధువులు పాకిస్థాన్‌లో ఉన్నారు. వారే ఈ సంబంధం కుదిర్చారు. దీంతో పెళ్లి కోసం అమీనా భారత్‌కు రావడానికి వీసాకు దరఖాస్తు చేసుకుంది. కానీ ఆమె దరఖాస్తు తిరస్కరణకు గురైంది. వీసా(visa) కోసం చేసుకున్న దరఖాస్తు తిరస్కరణకు గురైతేనేం పెళ్లి మాత్రం ఆగలేదు. పెద్దల దగ్గరుండి మరి వర్చువల్‌గా ఆన్‌లైన్‌లో వివాహం జరిపించారు. జోధ్‌పూర్‌లోనే బుధవారం ఈ వివాహం జరిగింది. వరుడు జోధ్‌పూర్, వధువు కరాచీలోనే ఉండి ఆన్‌లైన్‌లో వివాహం చేసుకున్నారు. అయితే పెళ్లి ఆన్‌లైన్‌లో జరిగిందనే విషయాన్ని పక్కన పెడితే మిగతా సాంప్రదాయాలకు ఏ మాత్రం తక్కువ చేయలేదు. ఒక సాధారణ పెళ్లికి పాటించే అన్ని సాంప్రదాయాలను వీరి వివాహానికి పాటించారు. జోధ్‌పూర్ వేదికగా జరిగిన వివాహ వేడుకకు బంధువులు, స్నేహితులు హాజరయ్యారు. కాగా జోధ్‌పూర్‌కు చెందిన కాజీ ఈ పెళ్లిని జరిపించారు.
వివాహం అనంతరం పెళ్లి కొడుకు అర్బాజ్ మాట్లాడుతూ..‘‘మాది పెద్దలు కుదర్చిన వివాహం. వర్చువల్‌గా వివాహం చేసుకోవడానికి భారత్, పాకిస్థాన్ మధ్య సరైన సంబంధాలు లేకపోవడమే కారణం. మొదట అమీనా భారత్‌కు రావడానికి వీసా కోసం ప్రయత్నించి విఫలమైంది. దీంతో వర్చువల్‌గా వివాహాం చేసుకోవాల్సి వచ్చింది. అమీనా వీసా కోసం మళ్లీ దరఖాస్తు చేసుకుంటుంది. మేము పాకిస్థాన్‌లో పెళ్లి చేసుకుంటే ఇండియాలో గుర్తింపు దక్కదు. మేము మళ్లీ ఇండియాకు వచ్చి వివాహాం చేసుకోవాల్సి వచ్చేది. అదంతా వద్దనుకునే ఇలా ఆన్‌లైన్‌లో వివాహాం చేసుకున్నాం.’’ అని చెప్పాడు.
Updated Date - 2023-08-06T13:45:07+05:30 IST