Viral News: వీడెవడండి బాబూ!.. బ్యాగులో ఏకంగా 47 కొండ చిలువలను పెట్టుకుని తిరుగుతున్నాడు
ABN, First Publish Date - 2023-07-31T11:51:25+05:30
తమిళనాడులోని తిరుచ్చి అంతర్జాతీయ విమానాశ్రయంలో ఆదివారం కస్టమ్స్ అధికారులు ఓ ప్రయాణికుడి బ్యాగులో ఏకంగా 47 కొండచిలువలను గుర్తించారు. కొండ చిలువలతోపాటు రెండు అరుదైన బల్లులు కూడా ఉన్నాయి.
సాధారణంగా ఇతర దేశాలకు వెళ్లే ప్రయాణికుల ట్రాలీ బ్యాగులో బట్టలు, ఏవైనా వస్తువులు, డబ్బులు, నగలు వంటివి ఉంటాయి. ఇవి కాకుండా కొందరు నిషేధించిన వాటిని తీసుకొచ్చి విమానశ్రయంలో పట్టుబడిన ఘటనలను కూడా చూశాం. కానీ ఓ ప్రయాణికుడి బ్యాగులో ఇవేవి కాకుండా ఏకంగా 47 కొండ చిలువలు ఉన్నాయంటే నమ్మగలరా? కానీ ఇది నిజం. తమిళనాడులోని తిరుచ్చి అంతర్జాతీయ విమానాశ్రయంలో ఆదివారం కస్టమ్స్ అధికారులు ఓ ప్రయాణికుడి బ్యాగులో ఏకంగా 47 కొండచిలువలను(47 pythons and 2 lizards) గుర్తించారు. కొండ చిలువలతోపాటు రెండు అరుదైన బల్లులు కూడా ఉన్నాయి. సదరు ప్రయాణికుడు మలేషియాలోని కౌలాలంపూర్ నుంచి వచ్చిన మహమ్మద్ మొయిదీన్‌గా(Muhammad Moideen) అధికారులు గుర్తించారు.
మొయిదీన్ బాటిక్ ఎయిర్ విమానంలో(Trichy airport by the Batik Air flight) తిరుచ్చి విమానాశ్రయానికి(Trichy airport) చేరుకోగానే కస్టమ్స్ అధికారులు(Customs officials) అడ్డుకున్నారు. అతని బ్యాగ్‌లో ఏదో తేడా ఉండడాన్ని గమనించిన అధికారులు తెరిచి చూశారు. తెరిచి చూశాక అందులో ఉన్న కొండ చిలువలను చూసి షాయ్యారు. నిందితుడి మొయిదీన్ అనేక చిల్లులు గల పెట్టెల్లో వాటిని దాచిపెట్టాడు. వెంటనే కస్టమ్స్ అధికారులు.. అటవీశాఖ అధికారులకు సమాచారమిచ్చారు. దీంతో అటవీ అధికారులు విమానాశ్రయానికి చేరుకుని 47 కొండ చిలువలను, రెండు బల్లులను స్వాధీనం చేసుకున్నారు. నిబంధనల ప్రకారం వాటిని తిరిగి మలేషియాకు పంపించేందుకు అటవీశాఖ అధికారులు చర్యలు చేపట్టారు. ఇక నిందితుడైనా మొయిదీన్‌ను విచారణ నిమిత్తం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సరీసృపాలను మొయిదీన్ ఎందుకు తీసుకువచ్చాడనే కోణంలో తదుపరి విచారణ కొనసాగుతుంది.
Updated Date - 2023-07-31T11:51:25+05:30 IST