Viral Video: రెస్టారెంట్‌కు వెళ్లి మటన్ తిందాం అనుకుంటున్నారా?.. అయితే మీరు ఈ వీడియో చూడాల్సిందే!..
ABN, First Publish Date - 2023-07-04T14:22:15+05:30
కుటుంబసభ్యులంతా ఓ రెస్టారెంట్‌కు వెళ్లారు. తమకు ఎంతో ఇష్టమైన మలై మటన్‌ను ఆర్డర్ చేశారు. మటన్ ముక్కలను నములుతూ, మూలగు బొక్కలను చీకుతూ, రుచిని ఆస్వాదిస్తూ తినాలని ఆ కుటుంబం ఆశతో ఎదురుచూస్తుంది. ఇంతలోనే ఆర్డర్ చేసిన మలై మటన్ రానే వచ్చింది.
పంజాబ్: ఎప్పుడూ ఇంట్లోనే ఏం తింటాం. సరాదాగా బయటికెళ్లి తిందాం అని ఓ కుటుంబం భావించింది. ఈ క్రమంలోనే కుటుంబసభ్యులంతా ఓ రెస్టారెంట్‌కు వెళ్లారు. తమకు ఎంతో ఇష్టమైన మలై మటన్‌ను ఆర్డర్ చేశారు. మటన్ ముక్కలను నములుతూ, మూలగు బొక్కలను చీకుతూ, రుచిని ఆస్వాదిస్తూ తినాలని ఆ కుటుంబం ఆశతో ఎదురుచూస్తుంది. ఇంతలోనే ఆర్డర్ చేసిన మలై మటన్ రానే వచ్చింది. ముక్కలను త్వరత్వరగా లాగించేయాలని మటన్‌ను ప్లేటులోకి పెట్టుకుంటున్నారు. ఇంతలో ఒక మటన్ ముక్క కొంచెం తేడాగా అనిపించింది. తీక్షణంగా గమనిస్తే కానీ అర్థం కాలేదు. అది మటన్ ముక్కకాదు, చనిపోయిన ఎలుక అని. మటన్‌ను ఆర్డర్ చేస్తే అందులో చనిపోయిన ఎలుక రావడాన్ని చూసి సదరు కుటుంబసభ్యులు షాక్‌కు గురికాక తప్పలేదు. పంజాబ్‌లోని లూథియానాలో గల విశ్వకర్మ చౌక్ సమీపంలో ఉన్న ప్రకాష్ దాబా అనే రెస్టారెంట్‌లో ఈ ఘటన చోటు చేసుకుంది.
దీంతో తీవ్ర ఆగ్రహానికి గురైన సదరు కుటుంబసభ్యులు రెస్టారెంట్ యాజమాన్యంతో వాగ్వాదానికి దిగారు. దీనికి సంబంధించిన వీడియోను ట్విట్టర్‌లో అప్‌లోడ్ చేయగా సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ క్రమంలో ఫుడ్ ఇన్‌స్పెక్టర్‌కు లంచం ఇచ్చి మీ రెస్టారెంట్‌ను విడిపించుకోండని పలువురు ట్విట్టర్‌లో రాసుకొచ్చారు. కానీ రెస్టారెంట్ యజమాని మాత్రం ఆ కస్టమర్ల వాదనను తోసిపుచ్చారు. ఇది ఒక ట్రిక్ అని అంటున్నారు. సదరు కస్టమర్లు ట్రిక్‌ను ఉపయోగించి తమ రెస్టారెంట్ పరువు తీయడానికి ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. మా రెస్టారెంట్ ఫుడ్‌లో తప్పులు జరిగే అవకాశం లేదని యజమాని చెబుతున్నారు. కాగా సోషల్ మీడియాలో ఈ వీడియో చూసిన పలువురు నెటిజన్లు ఈ దెబ్బతో జీవితంలో మటన్ తినాలనే ఆసక్తి కూడా పోయిందని కామెంట్ చేస్తున్నారు.
Updated Date - 2023-07-04T14:22:15+05:30 IST