ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Delimitation: డీలిమిటేషన్ అంటే ఏమిటి.. ఎందుకు దక్షిణాది రాష్ట్రాలు వ్యతిరేకిస్తున్నాయి.. అందుకు కారణమిదేనా?

ABN, First Publish Date - 2023-09-25T22:08:59+05:30

తాను చేసే ప్రతీ పనిలో ఏదో ఒక ఫిట్టింగ్ పెట్టడం బీజేపీకి అలవాటే. ఆ ఫిట్టింగ్ కూడా మామూలుగా ఉండదు, దాని ప్రభావం చాలా పెద్దగానే ఉంటుంది. తనకు మాత్రమే ప్రయోజనం చేకూరి, ఇతరులు ఇరుకున పడేసేలా..

తాను చేసే ప్రతీ పనిలో ఏదో ఒక ఫిట్టింగ్ పెట్టడం బీజేపీకి అలవాటే. ఆ ఫిట్టింగ్ కూడా మామూలుగా ఉండదు, దాని ప్రభావం చాలా పెద్దగానే ఉంటుంది. తనకు మాత్రమే ప్రయోజనం చేకూరి, ఇతరులు ఇరుకున పడేసేలా.. బీజేపీ చక్కటి వ్యూహంతో ఆ ఫిట్టింగ్స్ పెడుతుంది. ఇప్పుడు మహిళా రిజర్వేషన్ బిల్లు విషయంలోనూ అదే పని చేస్తోంది. ఈ బిల్లు లోక్‌సభ, రాజ్యసభలో ఆమోదం పొందింది కానీ.. ఇది అమలు అవ్వాలంటే మాత్రం కొన్ని మెలికలు ఉన్నాయి. అది.. జనాభా గణన, డీలిమిటేషన్. ఈ రెండింటిలో జనాభా గణన అంశాన్ని పక్కనపెడితే.. డీలిమిటేషన్ ప్రక్రయ మాత్రం దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ముఖ్యంగా.. దక్షిణాది రాష్ట్రాలు దీనిని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి.

అసలు ఈ డీలిమిటేషన్ అంటే ఏమిటి?

పార్లమెంటరీ లేదా అసెంబ్లీ నియోజకవర్గాల సరిహద్దులను పునర్నిర్మించే ప్రక్రియనే డీలిమిటేషన్ అంటారు. జనాభా ప్రాతిపదికన ప్రజాప్రతినిధులు ఉండేలా సీట్లు కేటాయించాలన్న ఆలోచనతో.. ఈ డీలిమిటేషన్‌ని తెరమీదకు తీసుకొచ్చారు. అంటే.. ప్రతి ప్రతినిధి (పార్లమెంట్ లేదా రాష్ట్ర శాసనసభ సభ్యుడు) సభలో సమాన సంఖ్యలో జనాభాకు ప్రాతినిథ్యం వహించాల్సి ఉంటుంది. అయితే.. ఈ డీలిమిటేషన్ ప్రక్రియని అమలు చేయాలంటే, ముందుగా రాజ్యాంగం ప్రకారం జనాభా గణన చేయాల్సి ఉంటుంది. నిజానికి.. 2021లో జనాభా గణన జరగాల్సి ఉంది. కానీ.. అప్పుడు కొవిడ్ మహమ్మారి కారణంగా అది జరగలేదు. మరో విషయం ఏమిటంటే.. మోదీ ప్రభుత్వం ఇంతవరకూ జనాభా గణన ప్రారంభించలేదు.


దక్షిణాది రాష్ట్రాలు ఎందుకు వ్యతిరేకిస్తున్నాయి?

ఉత్తర భారతంతో పోలిస్తే.. దక్షిణ రాష్ట్రాల్లో జనాభా రేటు చాలా తక్కువ. ఉత్తరాదిన జనాభా గణనీయంగా పెరిగిపోతుంటే.. దక్షిణంలో మాత్రం జనాభా నియంత్రణపై కేంద్రం నిబంధనల్ని పాటిస్తున్నారు. అందుకే.. జనాభా పెరుగుదల దక్షిణ రాష్ట్రాల్లో ఒక క్రమంలో ఉంది. మొత్తంగా చెప్పాలంటే.. దక్షిణం కన్నా ఉత్తరాదిన జనాభా ఎక్కువ. ఇలాంటప్పుడు.. డీలిమిటేషన్ ప్రక్రయ అనేది ఉత్తర రాష్ట్రాలకే ప్రయోజనం చేకూరుస్తుంది. జనాభా ప్రాతిపదికన సీట్లు ఉండాలన్నది నియమం కాబట్టి.. ఉత్తరాదిన జనాభా ఎక్కువగా ఉండటంతో అక్కడ సీట్లు పెరిగే అవకాశాలు మెండుగా ఉన్నాయి. కానీ.. దక్షిణ రాష్ట్రాల్లో జనాభా తక్కువగా ఉండటంతో, ఉన్న సీట్లలో కోత పడే ప్రమాదం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు.

ముఖ్యంగా తెలుగు రాష్ట్రాలకు గట్టి దెబ్బ పడుతుంది. ఈ రెండు రాష్ట్రాలు కలిసి 8 సీట్లు కోల్పోయే ఛాన్స్ ఉందని వార్తలొస్తున్నాయి. అలాగే తమిళనాడు, కేరళ రాష్ట్రాలకు సైతం 8 సీట్ల కోత పడొచ్చని.. ఇక కర్ణాటకకి కూడా 2 సీట్లు పోవచ్చని సమాచారం. మొత్తం దక్షిణాది రాష్ట్రాలు కలిపితే 165 సీట్లు మాత్రమే అవుతాయని, మిగిలిన సీట్లన్నీ ఉత్తరాదికే పోతాయని కొన్ని మీడియా సంస్థలు పేర్కొంటున్నాయి. ఈ లెక్కలు నిజమేనా? కాదా? అనే విషయంపై పూర్తి స్పష్టత లేదు కానీ.. ఈ డీలిమిటేషన్ వల్ల మాత్రం దక్షిణాది రాష్ట్రాలకు గట్టి దెబ్బ పడటం ఖాయమని సర్వేలు తెలుపుతున్నాయి. అందుకే.. ఇక్కడి నేతలు ఈ డీలిమిటేషన్ ప్రక్రియను ఇప్పటి నుంచే వ్యతిరేకిస్తున్నారు.


తెలంగాణ ఐటీ మంత్రి కేటీఆర్ తాజాగా ఇండియా టుడే గ్రూప్ బయటపెట్టిన డీలిమిటేషన్ లెక్కల జాబితాను షేర్ చేస్తూ.. ఈ ప్రక్రియకు వ్యతిరేకంగా ఓ ట్వీట్ చేశారు. ఒకవేళ ఈ డీలిమిటేషన్ లెక్కలు నిజమైతే మాత్రం.. మొత్తం దక్షిణ భారతదేశంలో బలమైన ప్రజల ఉద్యమానికి దారి తీస్తుందని హెచ్చరించారు. మనమంతా గర్వించదగిన భారతీయులమని.. దక్షిణ రాష్ట్రాలు దేశంలోనే అత్యుత్తమ పనితీరు కనబరిస్తున్నాయని అన్నారు. దేశంలోని అత్యున్నత ప్రజాస్వామిక వేదికపై మన ప్రజల గొంతులు, ప్రాతినిధ్యాన్ని అణచివేస్తే.. చూస్తూ ఊరుకునేది లేదని వార్నింగ్ ఇచ్చారు. ఈ విషయంపై కేంద్రం మరోసారి పునరాచోలిస్తే ఉత్తమమని కేటీఆర్ ట్విటర్ మాధ్యమంగా సూచించారు.

ఇంతకుముందు తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ సైతం ఈ డీలిమిటేషన్ ప్రక్రియని వ్యతిరేకించారు. ఇది రాజకీయ ఎత్తుగడ అని, జనాభా ప్రాతిపదికన పార్లమెంట్‌లో సీట్లు పెంచితే.. దక్షిణ భారత రాష్ట్రాల రాజకీయ ప్రాతినిథ్యం తగ్గిపోతుందని అన్నారు. తాము మహిళా రిజర్వేషన్ బిల్లును స్వాగతిస్తున్నాము కానీ.. డీలిమిటేషన్ పేరుతో దక్షిణ భారత ప్రజలకు ఎటువంటి హాని జరగదని హామీ ఇవ్వాలని ప్రధాని మోదీని స్టాలిన్ డిమాండ్ చేశారు. డీలిమిటేషన్ పట్ల దక్షిణ భారతదేశ ప్రజల భయాన్ని మోదీ తొలగించాలని కోరారు.

Updated Date - 2023-09-25T22:08:59+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising