ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

BBC Vs IT Survey : బీబీసీలో ఏం జరుగుతోంది?... ఐటీ సర్వే, సెర్చ్ మధ్య తేడా ఏమిటి?...

ABN, First Publish Date - 2023-02-14T19:35:44+05:30

పన్ను ఎగవేత ఆరోపణల నేపథ్యంలో ఆదాయపు పన్ను శాఖ (IT Department) మంగళవారం బ్రిటిష్ బ్రాడ్‌కాస్టింగ్ కంపెనీ

IT Survey and Search
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ : పన్ను ఎగవేత ఆరోపణల నేపథ్యంలో ఆదాయపు పన్ను శాఖ (IT Department) మంగళవారం బ్రిటిష్ బ్రాడ్‌కాస్టింగ్ కంపెనీ (BBC) కార్యాలయాల్లో సర్వే నిర్వహించింది. న్యూఢిల్లీ, ముంబైలలోని మొత్తం మూడు చోట్ల సర్వే చేసింది. ఈ నేపథ్యంలో ఐటీ సర్వేకు, సోదాలకు మధ్య తేడా ఏమిటో తెలుసుకోవాలనే ఆసక్తి చాలా మందికి కలిగింది.

ఢిల్లీ, ముంబైలలోని బీబీసీ కార్యాలయాల్లో మంగళవారం ఉదయం ఏకకాలంలో ఆకస్మికంగా ఈ సర్వే జరిగింది. ఈ కార్యాలయాల్లోని బీబీసీ సిబ్బంది వద్ద ఉన్న ఫోన్లన్నిటినీ ఓ చోట పెట్టాలని అధికారులు ఆదేశించినట్లు తెలుస్తోంది. లండన్ ప్రధాన కేంద్రంగా పని చేస్తున్న ఈ సంస్థ వ్యాపార కార్యకలాపాలపై ప్రధానంగా దృష్టి పెట్టినట్లు ఐటీ అధికారులు తెలిపారు. బీబీసీ అనుబంధ కంపెనీల అంతర్జాతీయ పన్నుల చెల్లింపులపై ఈ సర్వే జరిగినట్లు సమాచారం.

ఐటీ సర్వే అంటే...

ముఖ్యంగా సర్వే చేయడమంటే, ఆదాయపు పన్ను శాఖ అధికారులు కేవలం వ్యాపార కార్యకలాపాలు జరిగే చోట్ల మాత్రమే సోదాలు చేస్తారు. ఆ వ్యాపార సంస్థల ప్రమోటర్లు లేదా డైరెక్టర్లు నివసించే చోట్ల ఈ సర్వే జరగదు. ఆదాయపు పన్ను చట్టం, 1961లోని సెక్షన్ 133ఏ ప్రకారం సర్వే జరుగుతుంది. ఈ సెక్షన్‌కు ఫైనాన్స్ యాక్ట్, 2002లో కొన్ని సవరణలు చేశారు.

లెక్కల్లో చూపని, ఆదాయపు పన్ను శాఖకు తెలియజేయని, గోప్యంగా ఉంచిన ఆదాయం, ఆస్తుల గురించి తెలుసుకోవడానికి సర్వే జరుగుతుంది. కేవలం సమాచార సేకరణ కోసమే సర్వే చేస్తారు. వ్యక్తి లేదా వ్యాపార సంస్థ ఖాతా పుస్తకాలను సక్రమంగా నిర్వహిస్తున్నదీ, లేనిదీ సర్వేలో అధికారులు తెలుసుకుంటారు.

సోదాలు అంటే...

ఐటీ అధికారులు పన్ను ఎగవేత కేసుల్లో విస్తృత స్థాయిలో దర్యాప్తు చేస్తారు. దాచి ఉంచిన ఆదాయం, సంపదలను గుర్తించేందుకు వ్యాపార సంస్థల కార్యాలయాలు, సంబంధిత భవనాలు, ఇతర చోట్ల తనిఖీలు చేస్తారు. ఆదాయపు పన్ను శాఖకు తెలియజేయకుండా రహస్యంగా దాచిన పత్రాలు, సంపద, బంగారు ఆభరణాలు, ఇతర వస్తువులను స్వాధీనం చేసుకునే అధికారం ఐటీ అధికారులకు ఉంటుంది. అందుకే వీటిని (సెర్చ్ అండ్ సీజర్ ఆపరేషన్స్) అంటారు. వీటినే దాడులు (Raids) అని పిలుస్తారు. ఐటీ చట్టం, 1961లోని సెక్షన్ 132 ప్రకారం సోదాలు (Searches) జరుగుతాయి.

సర్వే, సోదాల మధ్య తేడా

- వ్యాపార సంస్థ పని వేళల్లో మాత్రమే సర్వే చేస్తారు. కానీ సోదాలు చేసేటపుడు ఈ పరిమితులేవీ ఉండవు.

- లెక్కల్లో చూపని ఆస్తులను సోదాల్లో గుర్తిస్తే, వాటిని స్వాధీనం చేసుకోవచ్చు. అయితే అధికారులు ఈ విషయంలో చాలా జాగ్రత్తగా వ్యవహరించవలసి ఉంటుంది.

- సోదాలు నిర్వహించడం కోసం సంబంధిత వ్యక్తులు, సంస్థలు సహకరించకపోతే, ఏదైనా తలుపు లేదా కిటికీని పగులగొట్టి, లోనికి ప్రవేశించవచ్చు. కానీ సర్వే చేసేటపుడు ఈ విధంగా బలప్రయోగం చేసి, లోనికి వెళ్లకూడదు.

- సమాచారాన్ని సేకరించడం మాత్రమే సర్వే లక్ష్యం. లెక్కల్లో చూపని సంపద, పత్రాలు, లావాదేవీలు వంటివాటిని గుర్తించి, స్వాధీనం చేసుకోవడం సోదాల ప్రాథమిక లక్ష్యం.

- ఫైనాన్స్ యాక్ట్, 2002కు పూర్వం సర్వే చేసే అధికారులు సంబంధిత వ్యాపార సంస్థకు చెందినవాటిని వేటినీ స్వాధీనం చేసుకునే అవకాశం ఉండేది కాదు. ఈ చట్టానికి 2002లో సవరణ జరిగిన తర్వాత నుంచి తగిన కారణాలను రికార్డు చేసి, వీటిని స్వాధీనం చేసుకోవడానికి అధికారం లభించింది. సర్వేను 10 రోజుల కన్నా ఎక్కువ కాలం నిర్వహించరాదు. ఒకవేళ అంతకన్నా ఎక్కువ సమయం సర్వే చేయవలసి వస్తే, ముందుగా చీఫ్ కమిషనర్, కమిషనర్, డైరెక్టర్ జనరల్ లేదా డైరెక్టర్ నుంచి అనుమతి పొందవలసి ఉంటుంది.

- సెర్చ్ అండ్ సీజర్ యాక్షన్‌లో స్టాక్-ఇన్-ట్రేడ్ మినహా ఇతర పత్రాలు, ఆస్తులను ఐటీ అధికారులు జప్తు చేయవచ్చు. సంబంధిత సంస్థకు చెందినవారు తాళాలను ఇవ్వకపోతే, ఏదైనా కప్పతాళాన్ని పగులగొట్టవచ్చు. సోదాలు నిర్వహించడం కోసం పోలీసుల సహాయం, కేంద్ర ప్రభుత్వ అధికారుల సహాయం పొందవచ్చు.

Updated Date - 2023-02-14T21:40:25+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising