Rahul Gandhi: మీ మనసులో ఉన్న రాహుల్ గాంధీని చంపేశాను: రాహుల్
ABN, First Publish Date - 2023-01-09T20:56:01+05:30
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ(Rahul Gandhi) చేపట్టిన ‘భారత్ జోడో యాత్ర’(Bharat Jodo
చండీగఢ్: కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ(Rahul Gandhi) చేపట్టిన ‘భారత్ జోడో యాత్ర’(Bharat Jodo Yatra)కు విశేష స్పందన లభిస్తోంది. వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు రాహుల్‌తో కలిసి నడుస్తూ సంఘీభావం తెలుపుతున్నారు. ప్రస్తుతం ఆయన యాత్ర హర్యానా(Haryana)లో కొనసాగుతోంది. ఈ సందర్భంగా నిర్వహించిన మీడియా సమావేశంలో ఓ ప్రశ్నకు సమాధానంగా రాహుల్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. మీ మనసుల్లో ఉన్న రాహుల్ గాంధీని తాను చంపేశానని పేర్కొన్నారు. తానిచ్చిన సమాధానంతో ఆశ్చర్యపోవద్దని, తానేం చెప్పానో అర్థం చేసుకునేందుకు హిందూయిజం, శివుడి గురించి చదవాలని తనను ప్రశ్న అడిగిన జర్నలిస్టుకు రాహుల్ సలహా ఇచ్చారు.
‘‘మీకు అర్థం కాలేదు కదూ! ఇతను రాహుల్ గాంధీ కాదు. హిందూ ధర్మ గురించి కొద్దిగా చదవండి. శివుడి గురించి కూడా కొంత చదవండి. నేనేం చెప్పానో అప్పుడు అర్థమవుతుంది. ఆశ్చర్యపోకండి. రాహుల్ గాంధీ మీ మనసుల్లో ఉన్నాడు. కానీ, నా మనసులో లేడు. రాహుల్ బీజేపీ మనసులో ఉన్నాడు. నా మనసులో లేడు’’ అని రాహుల్ చెప్పుకొచ్చారు.
తనకు ఇమేజ్‌తో సంబంధం లేదని, దానిపై తనకు అంత ఆసక్తి కూడా లేదన్న రాహుల్.. ఆ ఇమేజ్‌ను మీరు ఉంచుకోవాలనుకుంటే ఉంచుకోండని, అది మంచిదైనా, చెడ్డదైనా మీదేనని తనది కాదని పేర్కొన్నారు. దానివల్ల తనకొచ్చేదేమీ లేదని స్పష్టం చేశారు. తన పని తాను చేసుకుంటానని రాహుల్ స్పష్టం చేశారు.
Updated Date - 2023-01-09T21:02:25+05:30 IST