ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

AAP:కేంద్ర పర్యావరణ శాఖ మంత్రి ఎక్కడ? వాయు కాలుష్యంపై బీజేపీ టార్గెట్‌గా ఆప్ విసుర్లు

ABN, First Publish Date - 2023-11-03T14:20:42+05:30

దేశ రాజధానిలో రోజు రోజుకి వాయు కాలుష్య(Delhi Pollution) తీవ్రత పెరిగిపోతోంది. దీంతో రాష్ట్రంలో అధికారంలో ఉన్న కేజ్రీవాల్ సర్కార్(Arvind Kejriwal) కేంద్ర ప్రభుత్వాన్ని టార్గెట్ చేసింది. వాయు కాలుష్యం పెరుగుతున్నా.. కేంద్ర పర్యావరణ శాఖ మంత్రి భూపేందర్ యాదవ్(Bhupender Yadav) ఆచూకీ లభించట్లేదని ఢిల్లీ పర్యావరణ మంత్రి గోపాల్ రాయ్ ఎద్దేవా చేశారు.

ఢిల్లీ: దేశ రాజధానిలో రోజు రోజుకి వాయు కాలుష్య(Delhi Pollution) తీవ్రత పెరిగిపోతోంది. దీంతో రాష్ట్రంలో అధికారంలో ఉన్న కేజ్రీవాల్ సర్కార్(Arvind Kejriwal) కేంద్ర ప్రభుత్వాన్ని టార్గెట్ చేసింది. వాయు కాలుష్యం పెరుగుతున్నా.. కేంద్ర పర్యావరణ శాఖ మంత్రి భూపేందర్ యాదవ్(Bhupender Yadav) ఆచూకీ లభించట్లేదని ఢిల్లీ పర్యావరణ మంత్రి గోపాల్ రాయ్ ఎద్దేవా చేశారు. ఢిల్లీ ప్రజలు విషపూరిత గాలిని పీల్చుకుంటున్నా.. బీజేపీలో చలనం లేదని అన్నారు. ఢిల్లీ కాలుష్యంపై పొరుగు రాష్ట్రాలతో కేంద్రం సమావేశాన్ని నిర్వహించాలని రాయ్ కోరారు. పొల్యూషన్ అరికట్టడానికి కేజ్రీవాల్ సర్కార్ తీసుకుంటున్న చర్యలను మంత్రి వివరించారు. డీజిల్ వాహనాల రాకపోకలను నిషేధించినట్లు తెలిపారు.


"ఈ సమస్య పరిష్కారంపై బీజేపీకి బాధ్యత లేదా? చర్యలు చేపట్టాల్సిన టైంలో వారంతా వివిధ రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో బిజీగా ఉన్నారు. ఢిల్లీ ప్రజలను కాపాడేదెవరు? ఇప్పటికే ఉత్తర భారతం మొత్తం వాయు కాలుష్యంలో చిక్కుకుంది" అని అన్నారు. ఢిల్లీలో నిన్న ఉదయం 10 గంటల నుంచి ఇవాళ ఉదయం 9 గంటల వరకు వాయు కాలుష్యం 351 పాయింట్ల నుంచి 471 పాయింట్లకు చేరుకుంది. శీతాకాలానికి తోడు కాలుష్యంతో ఢిల్లీ పరిసర ప్రాంతాల ప్రజలు అవస్థలు ఎదుర్కొంటున్నారు. దీంతో అప్రమత్తమైన కేజ్రీవాల్(Arvind Kejriwal) సర్కార్ శుక్ర, శనివారాల్లో ప్రాథమిక పాఠశాలలకు సెలవులు ప్రకటించింది. ఇందుకు సంబంధించిన ఉత్తర్వులను గురువారం సాయంత్రమే విడుదల చేసింది. ప్రభుత్వ, ప్రైవేటు బడులకు నిబంధనలు వర్తిస్తాయని స్పష్టం చేసింది. అదే టైంలో కాలుష్యం తీవ్ర స్థాయికి చేరుకోవడంతో రాజధాని ప్రాంతంలో చేపడుతున్న పలు నిర్మాణ పనులపై ప్రభుత్వం నిషేధం విధించింది. ఢిల్లీ-ఎన్‌సీఆర్‌(Delhi - NCR Region) పరిధిలో అనవసరమైన నిర్మాణ కార్యకలాపాలను కేంద్ర కాలుష్య నియంత్రణ ప్యానెల్(Central Pollution Control Panel) నిషేధించినట్లు ఉత్తర్వుల్లో పేర్కొంది. కమీషన్ ఫర్ ఎయిర్ క్వాలిటీ మేనేజ్‌మెంట్ (CAQM) కూడా ఢిల్లీలో డీజిల్ వాహనాల రాకపోకల్ని నిషేధించింది. గ్రేడెడ్ రెస్పాన్స్ యాక్షన్ ప్లాన్ స్టేజ్ 3లో భాగంగా శీతాకాలంలో వాయుకాలుష్యాన్ని అరికట్టడానికి అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. ప్రజల్లో అవగాహన తీసుకురావడానికి "రెడ్ లైట్ ఆన్.. గాడీ ఆఫ్" అనే వినూత్న కార్యక్రమాలు కేజ్రీవాల్ సర్కార్ చేపడుతోంది. ఢిల్లీతో పాటు ఎన్ సీఆర్ పరిధిలోని రాష్ట్రాలకు సైతం కేంద్రం పలు నిబంధనలు విధించింది. సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ (CPCB) డేటా ప్రకారం వాయు నాణ్యత సూచి 0-50 మధ్య ఉంటే గాలి నాణ్యత(AQI) "మంచిది", 51-100 "సంతృప్తికరమైనది", 101-200 "మితమైన", 201-300 "పేలవమైనది", 301-400 "చాలా పేలవమైనది", 401-500 "తీవ్రమైనది"గా పరిగణిస్తారు. 500 కంటే ఎక్కువ కాలుష్యం ఉంటే "అతి తీవ్రమైన" విభాగంలోకి వస్తుంది.

Updated Date - 2023-11-03T14:21:22+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising