Rahul Vs Scindia : రాహుల్ గాంధీపై జ్యోతిరాదిత్య సింథియా మండిపాటు
ABN, First Publish Date - 2023-04-05T13:56:16+05:30
కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ వ్యక్తిగత న్యాయ పోరాటాన్ని ప్రజాస్వామ్యం కోసం జరుగుతున్న పోరాటంగా ఎందుకు
న్యూఢిల్లీ : కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ (Congress leader Rahul Gandhi) వ్యక్తిగత న్యాయ పోరాటాన్ని ప్రజాస్వామ్యం కోసం జరుగుతున్న పోరాటంగా ఎందుకు ప్రచారం చేస్తున్నారని ఆ పార్టీని కేంద్ర మంత్రి, బీజేపీ నేత జ్యోతిరాదిత్య సింథియా (Union minister Jyotiraditya Scindia) ప్రశ్నించారు. భారత దేశ ప్రజాస్వామ్యంతో ఆడుకోవడానికి, మరింత అట్టడుగు స్థాయికి దిగజారడానికి వచ్చే అవకాశాలను కాంగ్రెస్ వదులుకోవడం లేదని దుయ్యబట్టారు. రాజకీయంగా వెలుగులో ఉండటం కోసం చేయని ప్రయత్నం లేదని ఎద్దేవా చేశారు. ఇది ప్రజాస్వామ్యం కోసం పోరాటం కాదని, కేవలం ఓ వ్యక్తి కోసం పోరాటమని చెప్పారు. ఈ విషయంలో కాంగ్రెస్‌ను ఎంత విమర్శించినా తక్కువే అవుతుందన్నారు.
జ్యోతిరాదిత్య సింథియా బుధవారం విలేకర్ల సమావేశంలో మాట్లాడుతూ, లోక్‌సభ నుంచి అనర్హుడైనవారిలో రాహుల్ గాంధీ మొదటివారు కాదన్నారు. గతంలో జయలలిత, ఆజం ఖాన్ కూడా అనర్హత వేటుకు గురయ్యారని చెప్పారు. ఇప్పుడు మాత్రమే అంతలా ఎందుకు గగ్గోలు పెడుతున్నారని ప్రశ్నించారు. కాంగ్రెస్ నేతలు నల్ల దుస్తులను ఎందుకు ధరిస్తున్నారని ప్రశ్నించారు. రాహుల్ గాంధీ వ్యక్తిగత న్యాయ పోరాటాన్ని ప్రజాస్వామ్యం కోసం జరుగుతున్న పోరాటంగా ఎందుకు ప్రచారం చేస్తున్నారని నిలదీశారు. భారత దేశ ప్రజాస్వామ్యంతో ఆడుకోవడానికి, మరింత అట్టడుగు స్థాయికి దిగజారడానికి వచ్చే అవకాశాలను కాంగ్రెస్ వదులుకోవడం లేదని దుయ్యబట్టారు. రాజకీయంగా వెలుగులో ఉండటం కోసం చేయని ప్రయత్నం లేదని ఎద్దేవా చేశారు. ఈ విషయంలో కాంగ్రెస్‌ను ఎంత విమర్శించినా తక్కువే అవుతుందన్నారు.
రాహుల్ గాంధీని ప్రత్యేకంగా పరిగణిస్తున్నారన్నారు. ఆయన కోర్టుకు వెళ్లినపుడు కాంగ్రెస్ నేతలు పెద్ద ఎత్తున ఆయనతోపాటు వెళ్తున్నారన్నారు. ఇది న్యాయ వ్యవస్థపై ఒత్తిడి చేయడం కాకపోతే మరేమిటని ప్రశ్నించారు. ఇవి గాంధీయవాద రాజకీయాలా? అని నిలదీశారు. ఒక వ్యక్తి కోసం ఇదంతా ఎందుకు చేస్తున్నారని ప్రశ్నించారు.
తాను గాంధీనని, గాంధీ క్షమాపణ చెప్పరని రాహుల్ గాంధీ చెప్పడం చాలా ఆశ్చర్యం కలిగిస్తోందని సింథియా అన్నారు. గాంధీ కుటుంబీకులకు ప్రత్యేక నిబంధనలు ఉండాలని ఓ సీనియర్ కాంగ్రెస్ నేత అన్నారన్నారు. దీనినిబట్టి కాంగ్రెస్ దృష్టిలో కొందరు వ్యక్తులు ప్రథమ శ్రేణి పౌరులని, మీరు, నేను తృతీయ శ్రేణి పౌరులమని రుజువవుతోందన్నారు. కాంగ్రెస్ తీరు దేశ వ్యతిరేకమైనదన్నారు. క్షమాపణ చెప్పినంత మాత్రానికి ఎవరూ తక్కువ స్థాయివారు అయిపోరన్నారు. కానీ కొన్ని పార్టీలు దేశం కన్నా తామే గొప్ప అని భావిస్తున్నాయన్నారు.
ఇవి కూడా చదవండి :
Minister: మంత్రి ఉదయనిధి సంచలన కామెంట్స్.. ఆయన ఏమన్నారో తెలిస్తే..
Supreme Court : మీడియా స్వేచ్ఛపై సుప్రీంకోర్టు సంచలన వ్యాఖ్యలు
Updated Date - 2023-04-05T13:56:16+05:30 IST