Wife and Husband Relationship: భార్య కావాలని శృంగారాన్ని వద్దనడం క్రూరత్వమే.. ఢిల్లీ హైకోర్టు సంచలన తీర్పు
ABN, First Publish Date - 2023-09-18T20:14:53+05:30
లైఫ్ పార్ట్‌నర్ కావాలని భర్తతో శృంగారంలో పాల్గొనకపోవడం క్రూరత్వమే అవుతుందని ఢిల్లీ హైకోర్టు వ్యాఖ్యానించింది. భర్త అభ్యర్థన మేరకు ఫ్యామిలీ కోర్టు మంజూరు చేసిన విడాకుల నిర్ణయాన్ని హైకోర్టు సమర్థించింది. వైవాహిక బంధంలో సెక్సువల్ లైఫ్ దూరం కావడం అంత దారుణం మరోటి ఉండదని కోర్టు వ్యాఖ్యానించింది.
ఢిల్లీ: లైఫ్ పార్ట్‌నర్(Life Partner) కావాలని భర్తతో శృంగారంలో పాల్గొనకపోవడం క్రూరత్వమే అవుతుందని ఢిల్లీ హైకోర్టు(Delhi High Court) వ్యాఖ్యానించింది. భర్త అభ్యర్థన మేరకు ఫ్యామిలీ కోర్టు మంజూరు చేసిన విడాకుల నిర్ణయాన్ని హైకోర్టు సమర్థించింది. వైవాహిక బంధంలో సెక్సువల్ లైఫ్ దూరం కావడమంత దారుణం మరోటి ఉండదని కోర్టు వ్యాఖ్యానించింది. ఏ సందర్భంలో ఈ వ్యాఖ్యలు చేసిందంటే.. ఢిల్లీకి చెందిన ఓ జంట 2004లో పెళ్లి చేసుకుంది. 35 రోజులపాటే ఇరువురు కలిసి ఉన్నారు. అనంతరం భార్య పుట్టింటికి వెళ్లిపోయింది. భర్త తిరిగి రమ్మని చెప్పినా రాలేదు. వివాహ బంధానికి ఫుల్ స్టాప్ పడటంతో భర్త ఫ్యామిలీ కోర్టు లో విడాకుల(Divorce)కు అప్లై చేసుకున్నాడు.
దీంతో కోర్టు విడాకులు మంజూరు చేసింది. ఈ తీర్పును సవాల్ చేస్తూ భార్య ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ వేసింది. ఈ పిటిషన్ పై విచారణ చేసిన కోర్టు.. ఇవాళ తీర్పు వెలువరిచింది. కోర్టు పేర్కొన్న వివరాల ప్రకారం.. 'సెక్సువల్ లైఫ్ లేని వివాహ బంధం ఊహించలేనిది. భార్య శృంగారానికి నిరాకరించడంతో వైవాహిక బంధం పరిపూర్ణం కాదు. అదే సమయంలో భార్య ఆధారాల్లేకుండా భర్తపై వరకట్న వేధింపుల కేసు పెట్టింది. ఉద్దేశ పూర్వకంగా లైఫ్ పార్ట్ నర్ శృంగారానికి నిరాకరించడం క్రూరత్వమే అవుతుంది. కొత్తగా దాంపత్య జీవితంలోకి ప్రవేశించిన వారికి ఈ పరిస్థితి రావడం ఇంకా దారుణం' అని కోర్టు వ్యాఖ్యానిస్తూ.. ఫ్యామిలీ కోర్టు(Familu Court) ఇచ్చిన తీర్పును సమర్థించింది.
Updated Date - 2023-09-18T20:17:14+05:30 IST