ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Mallikarjun Kharge: బీజేపీని గద్దె దించేందుకు ఎలాంటి త్యాగాలకైనా సిద్ధం: ఖర్గే

ABN, First Publish Date - 2023-02-25T14:52:55+05:30

ప్రజా వ్యతిరేక బీజేపీ ప్రభుత్వాన్ని 2024 లోక్‌సభ ఎన్నికల్లో గద్దె దించేందుకు భావసారూప్యత కలిగిన పార్టీలతో సమర్ధవంతమైన ప్రత్నామ్నాయాన్ని ముందుకు తెచ్చేందుకు..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

రాయ్‌పూర్: ప్రజా వ్యతిరేక బీజేపీ ప్రభుత్వాన్ని 2024 లోక్‌సభ ఎన్నికల్లో గద్దె దించేందుకు భావసారూప్యత కలిగిన పార్టీలతో సమర్ధవంతమైన ప్రత్నామ్నాయాన్ని ముందుకు తెచ్చేందుకు తమ పార్టీ సిద్ధంగా ఉందని, ఇందుకు అవసరమైతే ఎలాంటి త్యాగాలకైనా వెనుకాడేది లేదని కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే (Mallikarjun Kharge) అన్నారు. రాయ్‌పూర్‌లో జరుగుతున్న కాంగ్రెస్ 85వ ప్లీనరీలో రెండవ రోజైన శనివారనాడు ఆయన ప్రసంగిస్తూ, ఇవాల్టి సంక్లిష్ట పరిస్థితుల్లో దేశానికి సమర్ధవంతమైన నాయకత్వాన్ని అందించగలిగిన ఏకైక పార్టీ కాంగ్రెస్ మాత్రమేనని స్పష్టం చేశారు. 2004 నుంచి 2014 వరకూ కాంగ్రెస్ సారథ్యలోని కూటమి ప్రభుత్వం భాగస్వామ్య పార్టీలతో కలిసి దేశానికి సేవలందించిన విషయాన్ని గుర్తుచేశారు.

''మరోసారి భావసారూప్యత కలిగిన పార్టీలతో కలిసి సమర్ధవంతమైన ప్రత్యామ్నాయాన్ని తీసుకురావాలని మేము కోరుకుంటున్నాం. ప్రజా వ్యతిరేక, అప్రజాస్వామిక బీజేపీ ప్రభుత్వాన్ని ఓడించడమే ప్రధాన లక్ష్యం. దేశ ప్రజల సంక్షేమం కోసం పోరాడేందుకు మేము సిద్ధంగా ఉన్నాం. ఇందుకోసం రాబోయే అసెంబ్లీ ఎన్నికలు, 2024 లోక్‌సభ ఎన్నికల్లో ఎలాంటి త్యాగాలకైనా మేము సిద్ధం'' అని మల్లికార్జున్ ఖర్గే అన్నారు. బీజేపీ సారథ్యంలోని కేంద్ర ప్రభుత్వంపై విమర్శలు గుప్పిస్తూ, ఢిల్లీలో కూర్చున్న పాలకులు ప్రజాస్వామ్యాన్ని ధ్వంసం చేసే ప్రయత్నాలు చేస్తున్నారని, వారిది పేదల వ్యతిరేక డీఎన్ఏ అనీ అన్నారు. దేశంలోని ప్రస్తుత పరిస్థితికి వ్యతిరేకంగా ప్రజా ఉద్యమం రావాలని ఖర్గే పిలుపునిచ్చారు. తనను తాను 'ప్రధాన్ సేవక్‌'గా చెప్పుకుంటూ మిత్రుల ప్రయోజనాల కోసం పనిచేస్తున్నారంటూ ప్రధాన మంత్రి నరేంద్ర మోదీని విమర్శించారు.

దేశంలోని ప్రజాస్వామ్యాన్ని ధ్వసం చేసేందుకు కుట్ర జరుగుతోందని ఖర్గే ఆరోపించారు. అయితే కాంగ్రెస్ మాత్రం అందర్నీ ఐక్యం చేసేందుకు పాటుపడుతోందన్నారు. పెద్ద నోట్ల రద్దు, జీఎస్‌టీ, రాజ్యాంగ విలువలపై నిరంతర దాడి వంటి చర్యలను కేంద్రంలోని బీజేపీ తీసుకుందన్నారు. కాంగ్రెస్ ప్లీనరీని అడ్డుకునేందుకు పార్టీ కార్యకర్తల నివాసాలపై బీజేపీ దాడులు జరిపించిందని ఆరోపించారు. పలువురు కార్యకర్తలను అరెస్టు చేయించారని, వాటిని అన్నింటినీ ఎదుర్కొంటూనే కాంగ్రెస్ ప్లీనరీని తాము జరుపుతున్నామని చెప్పారు. దేశంలోని అన్ని సవాళ్లను ఎదుర్కొనేందుకు కాంగ్రెస్ పార్టీ సిద్ధంగా ఉందని అన్నారు. భారత్ జోడో యాత్ర దేశానికి శుభోదయమని, వేలాదిమంది రాహుల్ గాంధీ యాత్రలో పాల్గొని, ఇప్పటికీ తమ హృదయాల్లో కాంగ్రెస్ పార్టీకి చెక్కుచెదరని స్థానం ఉందని చాటిచెప్పారని అన్నారు. యువతకు రాహుల్ స్ఫూర్తిగా నిలుస్తున్నారని ప్రశంసించారు. కాగా, రెండోరోజు ప్లీనరీలో భాగంగా రాజకీయ, ఆర్థిక, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తీర్మానాలపై పార్టీ ప్రతినిధులు పలువురు ప్రసంగించారు. యూపీఏ చైర్‌పర్సన్ సోనియాగాంధీ, కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు, పార్టీ వయనాడ్ ఎంపీ రాహుల్ గాంధీ తదితర ప్రముఖులు రెండో రోజు ప్లీనరీలో పాల్గొన్నారు.

Updated Date - 2023-02-25T14:53:02+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising