Mukesh Ambani: ఈ అంబానీ ఫ్యామిలీకి ఇష్టమైన స్ట్రీట్ ఫుడ్ ఎంటో తెలుసా..!
ABN, First Publish Date - 2023-03-31T11:03:00+05:30
విలాసవంతంగా జీవిస్తున్నప్పటికీ, ముఖేష్ అంబానీ తినడానికి ఇష్టపడే వాటిలో గుజరాతీ వంటకాలు ప్రముఖంగా ఉంటాయి.
రిలయన్స్ అధిపతి ముఖేష్ అంబానీ ప్రపంచంలోని అత్యంత ధనవంతులలో ఒకరు, అయినప్పటికీ, అతని ఆహారపు అలవాట్లు పక్కా భారతీయ వంటకాలనే ఇష్టపడే విధానంనే ఉన్నాయి. విలాసవంతంగా జీవిస్తున్నప్పటికీ, ముఖేష్ అంబానీ తినడానికి ఇష్టపడే వాటిలో గుజరాతీ వంటకాలు ప్రముఖంగా ఉంటాయి.
ముఖేష్ అంబానీ భార్య నీతా అంబానీ చెప్పినట్టుగా, అంబానీ ముఖ్యంగా భోజనంలో ఇంట్లో వండిన ఆహారాన్ని ఇష్టపడతారని, ముకేశ్ అంబానీకి స్ట్రీట్ ఫుడ్ అంటే చాలా ఇష్టమని, అయితే, అతనికి ఇష్టమైన స్ట్రీట్ సైడ్ ఫుడ్ భేల్ , దహీ బటాటా పూరీ. ఈ రెండు వంటకాలు తనకు ఎప్పుడూ ఇష్టమని నీతా అంబానీ చెప్పుకొచ్చింది.
ప్రపంచంలోనే రెండో అత్యంత ఖరీదు అయిన ఇల్లు యాంటిలియోలో ఎంతో విలాసవంతమైన జీవితాన్ని గడుపుతున్నారు ముకేష్ అంబానీ, నీతా గుజరాతీగా స్థానిక ఆహార పదార్థాలంటే చాలా ఇష్టపడే ఇద్దరూ లైఫ్ ని ఆనందంగా నచ్చిన విధంగా గడుపుతున్నారని ఈమధ్య కాలంలో ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది నీతా. ఆయనకు ఇష్టమైన పలు ఆహార పదార్థాలను అంబానీ సతీమణి నీతా అంబానీ వెల్లడించారు. ఇంట్లో వండినటువంటి ఆహార పదార్థాలనే ఎక్కువగా ఇష్టపడుతారట.
అంబానీలు చాలా సింపుల్ లైఫ్ లీడ్ చేసేందుకు ఇష్టపడుతారు. ఇంగ్లాండ్‌లోని బకింగ్ హామ్ ప్యాలస్ తరువాత ముంబయిలోని యాంటిలియా వార్తల్లో రెండో స్థానంలో నిలిచింది. ప్రస్తుతం దాని విలువ రూ.15వేల కోట్లు ఉంటుందని పలు నివేదికలు వెల్లడించాయి. యాంటిలియా భవనం తరువాత స్థానంలో రేమండ్స్ అధినేత భవనం నిలుస్తున్నట్టు తెలుస్తోంది. మరోవైపు అనీల్ అంబానీ నివాసం సైతం ముకేష్ అంబానీ యాంటిలియాకు సమీపంలోనే ఉంటుందట. చాలా మంది కుబేరుల ఇళ్లు ఆ ప్రాంతంలోనే ఉన్నాయి.
ఇది కూడా చదవండి: బీట్‌రూట్ జ్యూస్ వల్ల బెనిఫిట్స్ ఏమిటంటే..?
నీతా అంబానీ మిగిలిన కుటుంబం కోసం సమయాన్ని వెచ్చించడంతో పాటు, తమ జంట ఇప్పటికీ రాత్రులు కొన్నిసార్లు తినడానికి, వీధల్లో దొరికే ఆహారం తినడానికి వెళుతుంటారట. కొన్ని సార్లు అనుకోకుండానే బయటకు వెళ్ళి కాఫీ తాగుదామని అంబానీ అనగానే మా ప్రయాణం సముద్ర తీరం వరకూ ఉంటుంది. అక్కడ కాసేపు గడిపి స్ట్రీట్ ఫుడ్ తిని వస్తాం. ముఖ్యంగా అందులో అంబానీకి ఇష్టమైన భేల్ లేదా దహీ బటాటా పూరీ తప్పక ఉంటుంది అని చెప్పుకొచ్చింది.
Updated Date - 2023-03-31T11:03:00+05:30 IST