Studies on Sugar: చక్కెరను ఎందుకు తగ్గించాలి? ఇది దీర్ఘకాలిక అనారోగ్యాలను మరింత తీవ్రతరం చేస్తోందా? కొత్త అధ్యయనం ఏం చెప్పిందంటే..!
ABN, First Publish Date - 2023-04-15T13:47:39+05:30
పాలిష్ చేసిన తెల్ల బియ్యం, శుద్ధి చేసిన గోధుమలను తగ్గించండి.
ఈమధ్య కాలంలో అకాల మరణాలు, ధీర్ఘకాల అనారోగ్యాల గురించి వింటూనే ఉన్నాం. అయితే దీని వెనుక అనేక కారణాలు లేకపోలేదు. తీసుకునే ఆహారం విషయంలో సరైన అవగాహన లేకపోవడం, ఫాస్ట్ ఫుడ్ కి ఎక్కువగా అలవాటు పడటం, తీవ్రమైన పనివేళలు, స్ర్కీన్ టైం పెరగడం ఇలా చెప్పుకుంటూ పోతే అనేక కారణాలతో అనారోగ్యాల పాలవుతున్నాం. అయితే తీసుకునే ఆహారం విషయానికి వస్తే చాలా అలవాట్లు పాతకాలం నాటివే కొనసాగుతున్నా అందులోనూ చెడు తప్పడం లేదు. ఉదయాన్నే నిద్రలేవగానే టీ, కాఫీలు తీసుకోవడం అనేది మనలో చాలామందికి అలవాటుగా వస్తున్న ఆహారపు అలవాటు. అయితే ఇందులోకి వాడే చక్కర మాత్రం శరీరానికి హాని చేస్తుందిని, ధీర్ఘకాలిక వ్యాధులతో బాధపడేవారికి మరింత చేటు చేస్తుందని వైద్య నిపుణులు అంటున్నమాట. ఈమధ్యకాలంలో జరిగిన ఒక అధ్యయనంలో కూడా ఇదే తేలింది. విషయంలోకి వెళితే..
అకాలమరణాలను తగ్గించడానికి చక్కెరను తగ్గించాలా?
చైనా, యుఎస్ నుండి పరిశోధకులు చక్కెరపై 8,601 శాస్త్రీయ అధ్యయనాల 83 ఆరోగ్య ఫలితాలపై దాని ప్రభావాన్ని అంచనా వేశారు. ఫలితంగా గుండె జబ్బులు, మధుమేహం, ఊబకాయం, అధిక రక్తపోటు, గుండెపోటు, అధిక కొలెస్ట్రాల్, క్యాన్సర్, నిరాశ వంటి ప్రపంచంలోని అత్యంత సాధారణ ఆరోగ్య సమస్యలను ఉదహరించే జాబితాను రూపొందించారు. ఇందులో ఫ్రీ షుగర్‌ను తీసుకోవడం వల్ల కలిగే ప్రభావాన్ని అంచనా వేసే అధ్యయనాలను పరిశోధకులు పరిశీలించారు.
ఆహారంలో గ్లైసెమిక్ లోడ్ వల్ల మరణాలతో ముడిపడి ఉన్నదని కనుగొన్నారు. చక్కెర పదార్థాలను తీసుకోవడం, గ్లైసెమిక్ లోడ్ పెరగడం వల్ల వివిధ రకాల ఆరోగ్య పరిణామాలు ఎలా ఉంటాయో చూపించే మొదటి అధ్యయనాలలో ఇది ఒకటి. డైటరీ షుగర్ ట్రైగ్లిజరైడ్స్ స్థాయిలను పెంచింది, మధుమేహం, డైస్లిపిడెమియా, ఊబకాయం, వాపుకు కారణమవుతుందట. ఇవన్నీ గుండె జబ్బులు, స్ట్రోక్‌ల ప్రమాదాన్ని పెంచుతాయని తేల్చారు.
1. కుటుంబ చరిత్రలో గుండె జబ్బులు, మధుమేహం, అధిక బరువు ఉన్నట్లయితే చక్కెర తీసుకోవడం పరిమితం చేయండం చాలా మంచిది.
2. స్వీట్ లేకుండా టీ, కాఫీని తీసుకోండి, రోజువారి ఆహారంలో పచ్చి ఆకు కూరలను ఎక్కువగా తీసుకోండి.
ఇది కూడా చదవండి: వేసవి వచ్చిందంటే దడే.. ఉడుకుచేసిందా?.., అలాంటప్పుడు ఈ సలాడ్స్ తింటే..!
3. పాలిష్ చేసిన తెల్ల బియ్యం, శుద్ధి చేసిన గోధుమలను తగ్గించండి.
4. కార్బోహైడ్రేట్ తీసుకోవడం తగ్గించండి. బీన్స్, చిక్కుళ్ళు, గ్రాములు లేదా మొక్కల ప్రోటీన్ల మూలాల వినియోగాన్ని పెంచండి. ఏమైనప్పటికీ దీర్ఘకాలిక వ్యాధులతో పోరాడే భారతీయులందరూ, వ్యాయామం, శారీరక శ్రమ దినచర్యను మొదలుపెట్టడం వల్ల అనేక అనారోగ్యాలు దరిచేరవు.
Updated Date - 2023-04-15T13:47:39+05:30 IST