Weight Loss Myth or Fact: బరువు తగ్గాలంటే అన్నం తినడం తగ్గించాలా.. చాలామంది ఫాలో అయ్యే దీని వెనుక ఉన్న నిజం ఏంటంటే..
ABN, First Publish Date - 2023-04-21T11:09:34+05:30
ఆహారంలో తృణధాన్యాలు, ప్రోటీన్లు, పాల ఉత్పత్తుల వంటి ఆహారాలను తీసుకునేలా చూడాలి.
అన్నం తినాలా వద్దా అనేది బరువు తగ్గడానికి ప్రయత్నించే వ్యక్తుల్లో ఒక పెద్ద ప్రశ్న! బరువు తగ్గే విషయానికి వస్తే, దాదాపు అందరూ చెప్పేది అన్నం తినకూడదనే.. ప్రపంచంలోని సగభాగంలో ఇవి ప్రధానమైన ఆహారం అయినప్పటికీ, బరువు పెరగడంలో అన్నం ముఖ్యమైన అపరాధిగా ప్రచారం చేయబడింది. అయితే అన్నం తినడం నిజంగా బరువు పెరిగేలా చేస్తుందా? అధిక బరువును తగ్గించుకోలేకపోవడానికి కారణం అన్నమేనా?
అతిగా తినడం అనేది బరువు పెరగడానికి ప్రధాన కారణం
మితంగా తినే ఆహారాలు ప్రయోజనాన్ని ఇస్తాయి. బరువు తగ్గడం విషయానికి వస్తే అతిగా తినడం వల్ల బరువు పెరుగుతారనే విషయంలో అధ్యయనాలున్నాయి. ఇది బరువు పెరగడానికి దారితీసే అంశం కానప్పటికీ, బరువును పెరగడంలో ఇది ప్రధాన పాత్ర పోషిస్తుంది. దానికి అన్నం అయినా మరోకటి అయితనా సరే అతిగా తినడం అనేది బరువు పెరగడానికి ప్రధాన కారణం అని గుర్తించాలి.
ఆరోగ్యకరమైన మార్గంలో బరువు తగ్గడానికి సమతుల్యత అవసరం. బరువు పెరిగే ప్రమాదాన్ని కలిగించే అనేక అంశాలు ఉన్నప్పటికీ, ఆరోగ్యకరమైన బరువును పొందడానికి ఆరోగ్యకరమైన జీవితాన్ని గడపడానికి కొన్ని సూచనలు..
ఇది కూడా చదవండి: ఎండా కాలం కదా.. కొబ్బరి బోండాం నీళ్లు తాగడం మంచిదే.. కానీ నీళ్లు తాగి బోండాంలో ఉండే కొబ్బరిని పట్టించుకోకుండా పడేస్తుంటారా..!
1. వ్యాయామం తప్పనిసరి..
బరువు తగ్గించే లక్ష్యంతో సంబంధం లేకుండా, వ్యాధులను దూరంగా ఉంచడానికి ఎప్పుడూ శారీరకంగా చురుకుగా ఉండాలి. ఆరోగ్యకరమైన బరువును పొందడానికి ప్రతి వారం కనీసం 150 నిమిషాల మితమైన, తీవ్రమైన వ్యాయామం చేయాలి.
2. పండ్లు, కూరగాయలను చేర్చండి.
పండ్లు, కూరగాయలు ఆరోగ్యకరమైన ఆహారంలో భాగం, కాబట్టి బరువు తగ్గాలని ప్రయత్నిస్తున్నట్లయితే వీటిని పుష్కలంగా తినాలి.
3. కొన్ని ఆహారాలకు దూరంగా ఉండండి.
ఆహారంలో ప్రధానంగా బరువు పెరగడానికి దారితీసే కొన్ని ఆహారాలకు దూరంగా ఉండాలి. చక్కెర, సంతృప్త కొవ్వులు, సోడియం ఉన్న ఆహారాన్ని తగ్గించాలి.
4. ఆహారంలో భాగం చేసుకోండి.
రోజూ తీసుకునే ఆహారంలో తృణధాన్యాలు, ప్రోటీన్లు, పాల ఉత్పత్తుల వంటి ఆహారాలను తీసుకునేలా చూడాలి.
5. వ్యాయామాలు చేయండి.
వ్యాయామం దినచర్య జీవితాన్ని మెరుగుపరుస్తుంది. క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం మంచిది. బరువు తగ్గడానికి ఇవి సహజమైన మార్గాలు.
Updated Date - 2023-04-21T11:09:34+05:30 IST