ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Summer fruit salad: వేసవి వచ్చిందంటే దడే.. ఉడుకుచేసిందా?.., అలాంటప్పుడు ఈ సలాడ్స్ తింటే..!

ABN, First Publish Date - 2023-04-15T12:27:57+05:30

ఫ్రూట్ సలాడ్ పుచ్చకాయ, సీతాఫలం, హనీడ్యూ వంటి జ్యుసి పండ్లతో తయారు చేస్తారు.

refreshing
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ప్రవేశం ఉచితం. సం|| 9393 763 666

వేసవి కాలం వచ్చిందంటే ఉక్కపోత వేడి అసౌకర్యంగా, కొన్నిసార్లు భరించలేనంతగా ఉన్నప్పుడు, ఆహారం తీసుకోవడం తగ్గడంతో పాటు, ఎక్కువ నీరు త్రాగడం, చెమట కలిగిస్తుంది. అయితే దీనితో పాటు కొవ్వును కరిగించడంలో కూడా వేసవి కాలం సహాయపడుతుంది. ముఖ్యంగా ఈ కాలంలో తీసుకునే ప్రతి ఆహారం శరీరానికి మంచే చేస్తుంది. అయితే వేసవిలో తీసుకునే ఆహారం శీతాకాలం కంటే వేగంగా బరువు తగ్గడానికి సహకరిస్తుందట. మరింకెందుకు ఆలస్యం ఈ ఫూట్ సలాడ్స్ తీసుకుని చూడండి.

పండ్లు శరీరాన్ని చల్లబరుస్తాయి. తగినంత హైడ్రేషన్‌ను అందిస్తాయి, కాబట్టి ఇవి పండ్లు మెగ్నీషియం, పొటాషియం, ఇనుము వంటి అవసరమైన విటమిన్లు, ఖనిజాలను కలిగి ఉంటాయి. ఇవి శక్తి స్థాయిలను కూడా నింపుతాయి. కాలానుగుణ వ్యాధులకు వ్యతిరేకంగా రోగనిరోధక శక్తిని పెంచుతాయి. సలాడ్‌లు, స్మూతీలు, జ్యూస్‌ల నుండి డెజర్ట్‌ల వరకు తినే ఆహారంలో పండ్లను తీసుకునేలా అనేక మార్గాలు ఉన్నాయి. ఈ వేసవిలో, ఐస్ క్రీమ్‌లు, ఎరేటెడ్ డ్రింక్స్ తాగాలనే కోరికను తగ్గించి, మంచి పండ్లను తీసుకునేలా ట్రై చేయండి. వేసవి కాలంలో తప్పనిసరిగా 5 ఫ్రూట్ సలాడ్‌లను తీసుకుంటే బరువు తగ్గడంలోనూ సహకరిస్తాయని ఆహార నిపుణులు.

1. ఉష్ణమండల పండు సలాడ్ (Tropical fruit salad)

ఈ సలాడ్ నిమ్మరసంతో కలిపిన మామిడి, పైనాపిల్, బొప్పాయి, కివీ వంటి పండ్ల రుచికరమైన మిశ్రమం. ఇది అద్భుతమైన రుచిని కలిగి ఉండటమే కాకుండా విటమిన్లు, మినరల్స్ వంటి పోషకాలతో నిండి ఉంటుంది. వేసవిలో ఆరోగ్యకరమైన గుణాలను అందిస్తుంది.

2. బెర్రీ, పుచ్చకాయ సలాడ్

ఈ ఫ్రూట్ సలాడ్ పుచ్చకాయ, స్ట్రాబెర్రీలు, బ్లూబెర్రీస్, రాస్ప్‌బెర్రీస్ వంటి పండ్లతో తయారు చేస్తారు. రిఫ్రెష్‌గా ఉంటుంది, ఒక టీస్పూన్ తేనెతాజా పుదీనాతో కలిపి తీసుకుంటే మంచి రుచిని ఇస్తుంది. వేసవి పిక్నిక్, బార్బెక్యూ ల కోసం ఇది సరైన చిరుతిండి.

ఇది కూడా చదవండి: ఇంట్లో పెంచే మొక్కలకూ వాస్తుంది.. ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 3 మధ్య వాటి నీడ పడితే ఇక అంతే సంగతి..!


3. పీచెస్, ఆప్రికాట్‌

పీచెస్, ఆప్రికాట్లు అందించే తీపి రుచి పుదీనా తాజాదనంతో పాటు నిమ్మరసం పులుపుతో సమతుల్యంగా ఉంటుంది. ఇది వేసవి స్నాక్‌గా, సైడ్ ఆప్షన్‌గా కూడా తినవచ్చు.

4. సిట్రస్ సలాడ్

ఈ ఫ్రూట్ సలాడ్ నారింజ, ద్రాక్షపండ్లు, టాన్జేరిన్‌ల వంటి పండ్లతో తయారు చేస్తారు. ఇది రిఫ్రెష్ రుచిని ఇస్తుంది. జ్యుసిగా, కొంచెం పుల్లగా ఉంటుంది, అయితే వాటిని ఒక టీస్పూన్ తేనె, తరిగిన పిస్తా వేయడం వల్ల కమ్మదనం కూడా వచ్చి చేరుతుంది.

5. మెలోన్ సలాడ్

ఈ ఫ్రూట్ సలాడ్ పుచ్చకాయ, సీతాఫలం, హనీడ్యూ వంటి జ్యుసి పండ్లతో తయారు చేస్తారు. ఇది రుచికరమైన కలయిక, వీటిని నిమ్మరసం, కొద్దిగా ఉప్పుతో పుచ్చకాయల తీపిని నిమ్మరసం పుల్లదనాన్ని కలిపిన రుచితో నోరు ఊరిస్తుంది.

ఈ సలాడ్‌లు వేసవి కాలంలో చల్లగా , రిఫ్రెష్‌గా ఉండటానికి సహాయపడతాయి. ఇవి రుచికరమైనవి మాత్రమే కాకుండా చాలా పోషకమైనవి కూడా. కాబట్టి చల్లగా, రిఫ్రెష్‌గా ఏదైనా తినాలనిపించినపుడు వీటిని ఆర్డర్ చేయడం మరిచిపోకండి.

Updated Date - 2023-04-15T12:41:10+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising