Share News

Instagram Reels : ఇన్‌స్టాగ్రామ్‌ రీల్స్‌

ABN , First Publish Date - 2023-11-25T00:07:47+05:30 IST

ఎక్కడైనా డౌన్‌లోడ్‌కు ఓకేరీల్స్‌ని డౌన్‌లోడ్‌ చేసుకునే ఆప్షన్‌ని ఇన్‌స్టాగ్రామ్‌ గత జూన్‌లోనే ప్రారంభించింది. అయితే తొలుత ఇది అమెరికా వరకే పరిమితం చేసింది.

Instagram Reels : ఇన్‌స్టాగ్రామ్‌ రీల్స్‌

ఎక్కడైనా డౌన్‌లోడ్‌కు ఓకేరీల్స్‌ని డౌన్‌లోడ్‌ చేసుకునే ఆప్షన్‌ని ఇన్‌స్టాగ్రామ్‌ గత జూన్‌లోనే ప్రారంభించింది. అయితే తొలుత ఇది అమెరికా వరకే పరిమితం చేసింది. ఇప్పుడు దీనిని అన్ని ప్రాంతాలకు విస్తరించింది. అంటే 18 సంవత్సరాలు నిండిన వారు ఎవరైనా, ఎక్కడి నుంచైన డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు. వయసు నిబంధన ఉన్నప్పటికీ టర్నాఫ్‌ చేసి రీల్స్‌ను డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు. అలాగే రీల్స్‌ సృష్టికర్తలకు కూడా ఒక ఆప్షన్‌ ఉంటుంది. తమ రీల్స్‌ ప్రైవేట్‌ అని చెప్పి. వాటిని డౌన్‌లోడ్‌ కాకుండా క్రియేటర్లు బ్లాక్‌ చేయవచ్చు. అందుకనే వారు పబ్లిక్‌ అని చెప్పిన వాటినే యూజర్లు డౌన్‌లోడ్‌ చేసుకోవాల్సి ఉంటుంది. ఇందులో భాగంగా క్రియేటర్లు...

రీల్‌ని రికార్డింగ్‌, ఎడిటింగ్‌తో మొదలుపెట్టాలి. తదుపరి దిగువన కుడివైపు టాప్‌ చేయాలి.

దిగువన ఉన్న మోర్‌ ఆప్షన్స్‌ని టాప్‌ చేయాలి. కిందికి వెళ్ళి అడ్వాన్స్‌డ్‌ సెట్టింగ్స్‌ని టాప్‌ చేయాలి.

కిందికి వెళ్ళి సదరు రీల్‌ని డౌన్‌లోడ్‌ చేసుకునే అవకాశాన్ని పబ్లిక్‌కి కల్పించాలి. అందుకు స్విచ్చాఫ్‌ లేదా స్విచాన్‌ను టాప్‌ చేయాల్సి ఉంటుంది.

యూజర్లు ఏంచేయాలంటే

  • డౌన్‌లోడ్‌ చేయాలని అనుకుంటున్న రీల్‌ ఎక్కడ ఉందో చూడాలి.

  • రైట్‌ మెనూలో ఉన్న షేర్‌ బటన్‌ని క్లిక్‌ చేయాలి.

  • దిగువన ఉన్న డౌన్‌లోడ్‌ని సెలెక్ట్‌ చేయాలి. అప్పుడు కెమెరా రోల్‌కి రీల్‌ డౌన్‌లోడ్‌ అవుతుంది.

డౌన్‌లోడ్‌ చేసుకున్న రీల్‌ - ఇన్‌స్టాగ్రామ్‌ వాటర్‌మార్కుతో వస్తుంది. క్రియేటర్‌ యూజర్‌ నేమ్‌, ఆడియో ఆట్రిబ్యూషన్‌ కూడా ఉంటాయి.

Updated Date - 2023-11-25T00:07:48+05:30 IST