Vijay Sethupathi, Sharwanand : తండ్రీ కొడుకులుగా
ABN , First Publish Date - 2023-10-21T23:41:19+05:30 IST
శర్వానంద్ కథానాయకుడిగా శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వంలో ఓ చిత్రం రూపుదిద్దుకొంటోంది. కృతిశెట్టి కథానాయిక. ఈ చిత్రంలో ఓ కీలకమైన పాత్ర కోసం విజయ్ సేతుపతిని ఎంచుకొన్నారని

శర్వానంద్ కథానాయకుడిగా శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వంలో ఓ చిత్రం రూపుదిద్దుకొంటోంది. కృతిశెట్టి కథానాయిక. ఈ చిత్రంలో ఓ కీలకమైన పాత్ర కోసం విజయ్ సేతుపతిని ఎంచుకొన్నారని తెలుస్తోంది. ఈ చిత్రంలో విజయ్ సేతుపతి, శర్వానంద్ తండ్రీ కొడుకులుగా కనిపించబోతున్నారట. ఓ లవ్ స్టోరీలో.. తండ్రీ కొడుకుల ఎమోషన్‌ని దర్శకుడు చక్కగా మేళవించాడని, ఈ సినిమాలో విజయ్ పాత్ర కొత్త తరహాలో కనిపించబోతోందని సమాచారం. ‘శమంతకమణి’, ‘దేవదాస్’ చిత్రాలతో ఆకట్టుకొన్న శ్రీరామ్ ఆదిత్య... ‘హీరో’తో నిరాశ పరిచాడు. అందుకే కొంత గ్యాప్ తీసుకొని.. ఓ పవర్‌ఫుల్ స్ర్కిప్టు సిద్ధం చేశాడు. ప్రస్తుతం చిత్రీకరణ జరుగుతోంది. త్వరలోనే టైటిల్‌తో పాటుగా మరిన్ని వివరాలు వెల్లడిస్తారు.