ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Kuwait: కువైత్ సర్కార్ కీలక నిర్ణయం.. 10వేల మంది నర్సులకు లబ్ధి..!

ABN, First Publish Date - 2023-10-22T08:12:26+05:30

కువైత్ సర్కార్ ఇటీవల నర్సింగ్ వ్యవస్థ (Nursing Systerm) విషయంలో కీలక నిర్ణయం తీసుకుంది. నర్సుల వర్క్ అలెవెన్స్‌లను సవరించింది (Revised Work Allowance). ఇంతకుముందు ఏ, బీ, సీ కేటగిరీలుగా ఉన్న నర్సింగ్ వ్యవస్థను ఇప్పుడు కేవలం ఏ, బీ కేటగిరీలకు మాత్రమే పరిమితం చేసింది.

కువైత్ సిటీ: కువైత్ సర్కార్ ఇటీవల నర్సింగ్ వ్యవస్థ (Nursing Systerm) విషయంలో కీలక నిర్ణయం తీసుకుంది. నర్సుల వర్క్ అలెవెన్స్‌లను సవరించింది (Revised Work Allowance). ఇంతకుముందు ఏ, బీ, సీ కేటగిరీలుగా ఉన్న నర్సింగ్ వ్యవస్థను ఇప్పుడు కేవలం ఏ, బీ కేటగిరీలకు మాత్రమే పరిమితం చేసింది. ఈ మార్పు నర్సింగ్ సిబ్బందికి మరింత అనుకూలమైన పని వాతావరణాన్ని కలిగించడమే లక్ష్యంగా తీసుకొచ్చినట్లు ఆరోగ్య మంత్రిత్వశాఖ (Ministry of Health) వెల్లడించింది. తద్వారా వారు నిబద్ధత, అంకితభావంతో పనిచేస్తారని తెలిపింది. ఇక తాజాగా సవరించిన పని భత్యం వల్ల 10వేల మంది నర్సులకు నేలకు సరాసరిగా 50 కువైటీ దినార్ల (రూ. 13,445) అధిక శాలరీ వస్తుంది.

UAE: 3నెలల విజిట్ వీసాలను నిలిపివేసిన యూఏఈ.. ప్రస్తుతం విజిటర్లకు అందుబాటులో ఉన్న ఇతర లాంగ్‌టర్మ్ వీసా ఆప్షన్లు ఇవే..

కాగా, తాజా మార్పులతో ఇంతకుముందు బీ కేటగిరీలో ఉన్న 599 మంది కువైటీ నర్సులు ప్రస్తుతం ఏ కేటగిరీకి మారారు. అలాగే 98 మంది సీ కేటగిరీ నర్సులు బీ కేటగిరీకి మారడం జరిగింది. ఇలా మొత్తంగా 697 మంది కువైత్ నర్సులు వారి అలవెన్సులలో పెరుగుదలను నమోదు చేశారు. అదే సమయంలో 4,200 మంది నాన్-కువైటీ నర్సులు (Non-Kuwaiti Nurses) బీ కేటగిరీ నుంచి ఏ కేటగిరీకి అప్‌గ్రేడ్ అయ్యారు. మరో 3,702 మంది సీ కేటగిరీ నుంచి బీ కేటగిరీకి ప్రమోట్ కావడం జరిగింది. ఇలా సవరించిన భత్యం కారణంగా మొత్తం 7,902 మంది నాన్-కువైటీ నర్సులు ప్రయోజనం పొందుతున్నారు. ఇంకా బోనస్ నిబంధన కింద పనిచేసే 601 నాన్-కువైత్ నర్సులకు రీక్లాసిఫికేషన్‌ వర్తించనుంది. వీరిలో 401 మంది బీ కేటగిరీ నుండి ఏ కేటగిరీకి మరియు 200 మంది సీ నుండి బీ కేటగిరీకి అప్‌గ్రేడ్ అవుతారు. తద్వారా ప్రతి ఒక్కరు సగటున నెలవారీ 50కేడీల పెంపును పొందుతారు.

UAE Visas: రెసిడెన్సీ నుంచి గోల్డెన్ వీసా వరకు.. ఇంట్లో నుంచే రెన్యువల్ చేసుకోవచ్చు.. ఎలాగంటే..

Updated Date - 2023-10-22T08:13:10+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising