Kuwait: కువైత్‌లో 19 మంది నర్సులతో సహా 30 మంది భారతీయులు అరెస్ట్.. అసలేం జరిగిందంటే..!
ABN, First Publish Date - 2023-09-19T12:49:53+05:30
కువైత్ (Kuwait) లోని ఓ ప్రైవేట్ క్లినిక్‌లో భద్రతా తనిఖీల్లో భాగంగా 19 మంది మలయాళీ నర్సులతో సహా 30 మంది భారతీయులు (Indians) అరెస్టు అయ్యారు. వారి వద్ద సరియైన ధృవ పత్రాలు లేకపోవడంతో భద్రతాధికారులు వారిని అదుపులోకి తీసుకుని నిర్వాసిత కేంద్రానికి తరలించారు.
కువైత్ సిటీ: కువైత్ (Kuwait) లోని ఓ ప్రైవేట్ క్లినిక్‌లో భద్రతా తనిఖీల్లో భాగంగా 19 మంది మలయాళీ నర్సులతో సహా 30 మంది భారతీయులు (Indians) అరెస్టు అయ్యారు. వారి వద్ద సరియైన ధృవ పత్రాలు లేకపోవడంతో భద్రతాధికారులు వారిని అదుపులోకి తీసుకుని నిర్వాసిత కేంద్రానికి తరలించారు. ఇక నర్సులలో కొంతమందికి చిన్న పిల్లలు ఉన్నారు. వారికి చెల్లుబాటయ్యే వీసాలు (Visas) ఉన్నాయని.. ఆసుపత్రి యాజమాన్యానికి స్పాన్సర్ మధ్య వివాదమే అసలు సమస్య అని ఈ సందర్భంగా వారు పేర్కొన్నారు. తమను విడిపించాలని వారు విదేశాంగ మంత్రిత్వ శాఖ సహాయ మంత్రి వి మురళీధరన్, భారత రాయబార కార్యాలయం (Indian Embassy), ఎన్ఓఆర్‌కేఏ (NORKA)-రూట్స్ సహాయం కోరారు.
ఇక ఈ సంఘటనపై కువైత్‌లోని భారతీయ సమాజం ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ ఘటన గల్ఫ్ దేశంలోని భారతీయ కార్మికుల భద్రత, సంక్షేమంపై మరోసారి ప్రశ్నలను లేవనెత్తిందని మండిపడింది. విదేశాలలో ఉన్న పౌరుల హక్కులు, ప్రయోజనాలను పరిరక్షించడంలో భారత ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందని ఈ సందర్భంగా కొందరు కార్యకర్తలు ఆరోపించారు. వెంటనే భారత ప్రభుత్వం (Indian Govt) జోక్యం చేసుకుని నర్సులను విడిపించడంతో పాటు వారికి నష్టపరిహారం అందించాలని డిమాండ్ చేశారు. భవిష్యత్తులో భారతీయ కార్మికుల (Indian Workers) పై ఇలాంటి వేధింపులు జరగకుండా చర్యలు తీసుకోవాలని వారు ప్రభుత్వాన్ని కోరారు.
UAE-India travel: భారత ప్రవాసులు కేవలం రూ.10వేలకే స్వదేశానికి రావొచ్చు.. పైగా 200కేజీల వరకు లగేజీకి అనుమతి
Updated Date - 2023-09-19T12:49:53+05:30 IST